ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

నాడు పోస్టు చేయడమైనది: 02 JUN 2021 9:49AM by PIB Hyderabad

ఇండియా లో రోజువారి కొత్త కోవిడ్ కేసులు 1.32 ల‌క్ష‌లు న‌మోద‌య్యాయి. కొత్త కేసులలో త‌గ్గుద‌ల కొనసాగుతోంది.
ఇండియాలో క్రియాశీల కేసులోడ్ మ‌రింత త‌గ్గి 20 ల‌క్ష‌ల లోపున‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం వీటి సంఖ్య 17,93,645
క్రియాశీల కేసులు గ‌త 24 గంట‌ల‌లో 1,01,875 త‌గ్గుద‌ల‌
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,61,79,085
గ‌త 24 గంట‌ల‌లో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,31,465
వ‌రుస‌గా 20 వ రోజు కూడా రోజు వారి కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువ‌
రిక‌వ‌రీ రేటు 92.48 శాతానికి పెరుగుద‌ల‌
వార‌పు పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం 8.21 శాతం గా ఉంది.

రోజువారి పాజిటివిటీ రేటు 6.57 శాతంగా ఉంది. వ‌రుస‌గా 9వ రోజు కూడా ఇది ప‌దిశాతం కంటే త‌క్కువ‌గా ఉంది.

కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌ర‌ర‌రిగింది. మొత్తం 35 కోట్ల కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
జాతీయస్థాయిలో చేప‌ట్టిన  వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా21.85 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 1723616) సందర్శకుల సూచీ సంఖ్య : : 143
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam