రైల్వే మంత్రిత్వ శాఖ

మే నెలలో అత్యధికంగా 114.8 మెట్రిక్ టన్నుల మేర సరుకు ర‌వాణా చేప‌ట్టిన భార‌తీయ రైల్వే


గ‌త ఏడాది మే నెల అత్యుత్త‌మ‌మైన 104.6 ఎంటీల లోడ్‌తో పోలిస్తే ఈ ఏడాది మే 21వ తేదీ 9.7 శాతం అత్య‌ధిక లోడ్‌ను చేప‌ట్టిన భార‌తీయ రైల్వే

Posted On: 01 JUN 2021 3:05PM by PIB Hyderabad

 

కోవిడ్-19 స‌వాళ్లు నెలకొని ఉన్న‌ప్ప‌టికీ స‌రుకు ర‌వాణా విష‌యంలో భార‌తీయ‌ రైల్వే స‌రికొత్త వేగాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తోంది. కోవిడ్-19 సవాళ్లు ఉన్నప్పటికీ భార‌తీయ రైల్వే సంస్థ ఆదాయం, లోడింగ్ విష‌యంలో త‌న‌ అధికపు వేగాన్ని కొనసాగిస్తున్నాయి. యుద్ధ ప్రాతిప‌దిక‌న ఇండియన్ రైల్వే సంస్థ స‌ర‌కు ర‌వాణా విష‌య‌మై మే నెలలో అత్యధికంగా లోడ్ కార్య‌క్ర‌మాల్ని నిర్వహించింది. రైల్వే సంస్థ మే 2021 నెల‌లో 114.8 మెట్రిక్ టన్నుల స‌ర‌కు లోడింగ్ కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టింది. గ‌త ఏడాది అదే కాలంలో (మే 2019) చేప‌ట్టిన‌ 104.6 మెట్రిక్ టన్నుల స‌రుకు ర‌వాణా కంటే.. ఇది 9.7% ఎక్కువ. మే 2021 లో రవాణా చేయబడిన ముఖ్యమైన వస్తువులలో 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 5.61 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల ఖనిజ నూనె, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్ (క్లింకర్ మినహా), 4.2 మిలియన్  టన్నుల మేర క్లింకర్ ఉన్నాయి. గ‌త మే మాసంలో భార‌తీయ రైల్వే రూ.11604.94 కోట్ల మేర స‌ర‌కు ర‌వాణా ఆదాయాన్ని ఆర్జించింది. మే నెల‌లో వాగన్ టర్న్ అరౌండ్ టైం 26 శాతానికి మేర‌ మెరుగుపడింది. భార‌తీయ రైల్వే సంస్థ సరుకు రవాణాను చాలా ఆకర్షణీయంగా మార్చేందుకు గాను అనేక రాయితీల్ని/ తగ్గింపులు ప్ర‌క‌టంచ‌డం విశేషం. ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌లో సరుకు రవాణా రైళ్ల వేగం పెరిగిందని గమనించవచ్చు. సరుకు వేగం మెరుగుదల అన్ని ర‌కాల వాటాదారుల ఖర్చును ఆదా చేస్తుంది. గత 18 నెలల్లో సరుకు వేగం రెట్టింపు అయింది. రైల్వే కొన్ని మండలాలు (నాలుగు మండలాలు) సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని 50 కిలో మీటర్ల కంటే ఎక్కువ నమోదు చేశాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా, కొన్ని విభాగాలు సరుకు రవాణా రైళ్లకు మంచి వేగాన్ని అందిస్తున్నాయి. మే 2021లో సరుకు రవాణా రైళ్లు సగటున 45.6 కిలోమీటర్ల మేర వేగాన్ని నమోదు చేశాయి. ఇది.. అదే కాలానికి న‌మోదైన 36.19 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 26 శాతం మేర ఎక్కువ. కోవిడ్-19 విప‌త్క‌ర స‌మ‌యాన్ని భారత రైల్వే సంస్థ అన్నిర‌కాలైన సామర్థ్యాలు, ప్రదర్శనల్ని మెరుగుపరుచుకుంటూ త‌న‌క‌నువైన ఒక అవకాశంగా దీనిని ఉపయోగించుకుంటోంది.
                             

****



(Release ID: 1723549) Visitor Counter : 130