సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మోడీ ప్రభుత్వ పాలనకు ఏడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో ఏడు పంచాయతీల్లో కోవిడ్ 'సేవా' కార్యక్రమాలు


కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

వివిధ జిల్లాల్లో వందలాదిమంది పేదలకు అవసరమైనవారికి రేషన్, శానిటైజర్లు , మాస్కులు, ఆక్సిమీటర్లు,సహాయ సామాగ్రి పంపిణి

కోవిడ్ నివారణకు సంఘటితంగా పనిచేయాలని పిలుపు ఇచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 30 MAY 2021 4:25PM by PIB Hyderabad

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వ పాలనకు ఏడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని ఏడు పంచాయతీల్లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అధ్యక్షతన కోవిడ్ 'సేవా' కార్యక్రమాలు జరిగాయి. 

వివిధ జిల్లాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో డీడీసీ అధ్యక్షుడు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. వందలాది మంది ప్రజలకు రేషన్ సరకులు, శానిటైజర్లు, పేస్ మాస్కులను, ఆక్సిమీటర్లు మరియు ఇతర సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశాల్లో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఏడు సంవత్సరాల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ పాలనలో సంక్షేమ ఫలాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయని అన్నారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని శ్రీ నరేంద్రమోడీ అనేక విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని అమలు చేసారని మంత్రి అన్నారు. ' అంత్యోదయ' స్పూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. 2014 మేలో ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి దేశంలో నూతన శకం ప్రారంభం అయ్యిందని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. నిరాశావాదంలో ఉన్న దేశం ఆశావాద దృక్పధంతో శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో అభివృద్ధిపథంలో పయనిస్తున్నదని మంత్రి అన్నారు. 

కరోనా నేపథ్యంలో వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సంకుచిత విధానాలు స్వార్ధ ప్రయోజనాలను పక్కనపెట్టి కరోనా నివారణకు జరుగుతున్న పోరాటానికి సహకరించాలని డాక్టర్ జితేంద్రసింగ్ కోరారు. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో సంఘటిత కృషితో ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. శతాబ్దంలో ఒకసారి ఇటువంటి సంక్షోభం ఎదురవుతుందని మంత్రి అన్నారు. విపత్కర పరిస్థితిని సమర్ధంగా ఎదుర్కొంటున్న సమయంలో స్వార్ధ విమర్శలకు దిగడం మంచిదికాదని అన్న మంత్రి  సంఘటిత కృషితో  కోవిడ్‌కు వ్యతిరేకంగా భారత్ విజయం సాధిస్తుందని అన్నారు. 

ఆర్ధిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావాన్ని చూపిందని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. అయితే, ఇబ్బందులు ఎదురైనప్పటికీ  జాతీయ రహదారులు, పిఎమ్‌జిఎస్‌వై రోడ్లు, దేవిక, మన్సార్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు జిల్లాల్లో కోవిడ్ అదుపులో ఉండడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంటులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. 

అవసరమైన సమయంలో సొంత నిధుల నుంచి కోవిడ్ సహాయ సామాగ్రిని, ఆక్సిజన్ ప్లాంటులను ఏర్పాటు చేయడానికి నిధులను విడుదలచేసిన మంత్రికి సమావేశంలో పాల్గొన్న డీడీసీ అధ్యక్షులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో నియోజకవర్గంలో సౌకర్యాలను కల్పించడానికి ఎంపీ నిధుల నుంచి 2.5కోట్ల రూపాయలను కేటాయించిన మంత్రి వారు కృతజ్ఞతలు తెలిపారు.తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మంత్రి అయిదు ట్రక్కుల్లో సహాయ సామాగ్రిని పంపారు. 

కోవిడ్ మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడానికి  'టెలి-కన్సల్టేషన్' అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. ఈ సౌకర్యంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. 

కేంద్రపాలిత ప్రాంతంలో 45 సంవత్సరాలు పైబడిన వారిలో 67 నుంచి 70 శాతం మందికి టీకాలు ఇవ్వడం జరిగిందని డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. ఇది జాతీయ సగటు కంటె ఎక్కువగా ఉందని మంత్రి అన్నారు. టీకాలు తీసుకోవడానికి ప్రజలు అపోహలను విడనాడి ముందుకు వస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనమని మంత్రి అన్నారు.

***



(Release ID: 1722972) Visitor Counter : 138