రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నావికాదళానికి చెందిన ఎల్‌హెచ్ ఎంకె III విమానంలో మెడికల్ ఐసియు ఏర్పాటు
Posted On:
30 MAY 2021 4:52PM by PIB Hyderabad
ఐఎన్ఎస్ హంస వద్ద గల ఐఎఎన్ఎఎస్ 323 నుంచి ఎల్‌హెచ్ ఎంకె III లో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎంఐసియు) వ్యవస్థను ఏర్పాటు చేసింది. అన్నిరకాల వాతావరణాల్లో ప్రయాణించగల ఎల్‌హెచ్ ఎంకె IIIలో ఎంఐసియును ఏర్పాటు చేయడం వల్ల భారతీయ నావికాదళం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రోగులను ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా వైద్య తరలింపును విమానం ద్వారా చేపట్టవచ్చు.
ఎంఐసియులో రెండు జతల డిఫిబ్రిలేటర్స్, మల్టీపారా మానిటర్లు, వెంటిలేటర్, ఆక్సిజన్ మద్దతుతో పాటుగా లోపలకి పంపగల సిరంజి పంపులు కూడా ఉన్నాయి. రోగిని విమానంలో తీసుకువెడుతున్నప్పుడు నోటిలో నుంచి వస్తున్న స్రావాలను శుభ్రం చేసేందుకు చోషణ వ్యవస్థ కూడా ఉంది. ఈ వ్యవస్థను వైమానిక విద్యుత్ సరఫరా మీద నిర్వహించవచ్చు, దానితో పాటుగా నాలుగు గంటల బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది. విమానాన్ని ఎయిర్ అంబులెన్స్‌గా మార్చేందుకు పరికరాలను రెండు మూడు గంటల్లో అమర్చవచ్చు. హెచ్ఎఎల్ నావికాదళానికి అందించనున్న ఎనిమిది ఎంఐసియు సెట్లలో ఇది మొదటిది.
***
(Release ID: 1722970)
Visitor Counter : 200