హోం మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా అపూర్వ విజయాలు సాధిస్తున్నందుకు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా


దేశాభివృద్ధి, ప్రజా భద్రత, సంక్షేమం, మైలురాళ్ల వంటి సంస్కరణల మధ్య గొప్ప సమన్వయానికి మోదీ ప్రభుత్వం ఒక విశిష్ఠ ఉదాహరణ: అమిత్ షా

ఈ ఏడేళ్లలో, దేశ ప్రయోజనాలకు తన దృఢమైన, సంపూర్ణ, సంక్షేమ విధానాలతో శ్రీ మోదీ ప్రాధాన్యతనిస్తూ, పేదలు, రైతులు, బడుగు వర్గాల జీవన ప్రమాణాలను ఉన్నతీకరించడం ద్వారా మెరుగుపరిచారు. మరోవైపు, తన దృఢమైన నాయకత్వంతో భారత్‌ను శక్తిమంతంగా తీర్చిదిద్దారు: అమిత్‌ షా

గత ఏడేళ్లుగా దేశ ప్రజలు శ్రీ మోదీ సేవలు, అంకితభావం పట్ల స్థిరమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు, ఇందుకు నేను వారికి నమస్కరిస్తున్నా: అమిత్‌ షా

దూరదృష్టి గల శ్రీ మోదీ నాయకత్వంలో మేం ప్రతి సవాలును అధిగమించి, భారత ప్రగతి ప్రయాణాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని నాకు నమ్మకముంది: అమిత్‌ షా

Posted On: 30 MAY 2021 2:31PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా అపూర్వ విజయాలు సాధిస్తున్నందుకు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి, ప్రజా భద్రత, సంక్షేమం, మైలురాళ్ల వంటి సంస్కరణల మధ్య అసమాన సమన్వయానికి మోదీ ప్రభుత్వాన్ని ఒక విశిష్ఠ ఉదాహరణగా అభివర్ణిస్తూ శ్రీ అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు.

    "ఈ ఏడేళ్లలో, దేశ ప్రయోజనాలకు తన దృఢమైన, సంపూర్ణ, సంక్షేమ విధానాలతో శ్రీ మోదీ ప్రాధాన్యతనిస్తూ, పేదలు, రైతులు, బడుగు వర్గాల జీవన ప్రమాణాలను ఉన్నతీకరించడం ద్వారా మెరుగుపరిచారు. మరోవైపు, తన దృఢమైన నాయకత్వంతో భారత్‌ను శక్తిమంత దేశంగా తీర్చిదిద్దారని" తన ట్వీట్లలో అమిత్‌ షా పేర్కొన్నారు

    "గత ఏడేళ్లుగా దేశ ప్రజలు శ్రీ మోదీ సేవలు, అంకితభావం పట్ల స్థిరమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు, ఇందుకు నేను వారికి నమస్కరిస్తున్నా. దూరదృష్టి గల శ్రీ మోదీ నాయకత్వంలో మేం ప్రతి సవాలును అధిగమించి, భారత ప్రగతి ప్రయాణాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని నాకు నమ్మకముంది" అని కేంద్ర హోంమంత్రి ట్విట్టర్‌ ద్వారా వివరించారు.
 

***



(Release ID: 1722928) Visitor Counter : 117