ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ సహాయంపై తాజా సమాచారం


ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 18,016 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 19,085 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ ప్లాంట్లు; 15,206 వెంటిలేటర్లు; దాదాపు 7.7 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు, 12 లక్షల ఫ్లావిపిరవిర్ టాబ్లెట్ల పంపిణీ

Posted On: 28 MAY 2021 1:45PM by PIB Hyderabad

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా  ఈ సంక్షోభ నివారణ దిశలో భారత్ చేస్తున్న కృషికి తోడుగా ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలు, సంస్థలు పంపుతున్న విరాళాలు, సహాయ సామగ్రిని భారత ప్రభుత్వం  ఏప్రిల్ 27 నుంచి అందుకుంటోంది. దీన్ని వెనువెంటనే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేస్తోంది.

 

ఏప్రిల్ 27 నుంచి మే 27 దాకా మొత్తం 18,016 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 19,085 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 15,206 వెంటిలేటర్లు; దాదాపు 7.7 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు, సుమారు 12 లక్షల ఫావిపిరవిర్ టాబ్లెట్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా వీటి తరలింపు కొనసాగుతోంది.

26/27 తేదీలలో కెనడా, జర్మనీ, బహ్రెయిన్ ( ఇండియన్ అండ బహ్రెయిన్ ఆర్గనైజేషన్), రాబర్ట్ బాష్ ( జర్మనీ) నుంచి అందిన ప్రధాన సహాయ సామగ్రి ఇలా ఉంది

 

సామగ్రి

పరిమాణం

ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు

10

వెంటిలేటర్లు

692

 

తక్షణమే సమర్థవంతంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించటం, పంపిణీ చేయటం అనేది అవిచ్ఛిన్నంగా సాగే ప్రక్రియ.   కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది.  మంత్రిత్వశాఖ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ సహాయాన్ని అందుకోవటం, దాన్ని పంపిణీ చేయటం లాంటివి పర్యవేక్షిస్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ విభాగం పనిచేయటం ప్రారంభమైంది. మే 2వ తేదీ నుంచి ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించి అమలు చేస్తోంది.

 

                                                         

****



(Release ID: 1722476) Visitor Counter : 181