రక్షణ మంత్రిత్వ శాఖ
బాలసోర్‌లోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను కొనసాగిస్తున్న భారత నావికాదళం
Posted On:
28 MAY 2021 10:50AM by PIB Hyderabad
జలదిగ్బందంలో ఉన్న పరిఖి గ్రామం చుట్టుపక్కల ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడానికి భారత నావికాదళం తన విపత్తు సహాయ బృందాన్ని మే 27, 2021న బాలసోర్ జిల్లా సదర్ బ్లాక్‌లో నియమించింది. హెచ్ఏడీఆర్ నావికాదళం సదర్ బ్లాక్‌లోని పరిఖి గ్రామానికి చెందిన బహుళార్థసాధక తుఫాను షెల్టర్ వద్ద కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసి తగు కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఇక్కడ తయారు చేసిన భోజనాన్ని పరిఖి గ్రామం బుధిగాడియా, నందాచక్, బౌల్‌బెని మత్స్య కాలనీలలోని 700 మందికి పైగా సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. కమ్యూనిటీ కిచెన్ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సహాయక బృందం బాధిత ప్రజలకు ఎంతో అవసరమైన సహాయాన్ని అందించింది. ఈ బృందం విపత్తు సమయాన సకాలంలో అందించిన సేవకు ఇక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మరో నావికా దళం విపత్తు సహాయ బృందం తలాసరి (ఒడిశా యొక్క ఉత్తరాన ఉన్న మత్స్యకార గ్రామం) కోసం మే 28, 21న నియమించారు. తలాసరి, భోగ్రై, చంద్రమణి, ఇంచుండి గ్రామాల బాధిత ప్రాంతాలలో అవసరమగు సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి బయలుదేరింది. బాలాసోర్ వద్ద కొన్ని రహదారులపై కూలిన చెట్లను కోసి రోడ్ క్లియరెన్స్ కార్యక్రమాల్ని కూడా ఈ బృందం నిర్వహించింది. స్థానిక భద్రక్ జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించడానికి సహాయక సామగ్రితో కూడిన నాలుగు నావికాదళ నౌకలు ఇప్పటికే ధమ్రా ఎంకరేజ్‌కు ఇప్పటికే చేరుకున్నాయి. ఒడిశా బాలసోర్ జిల్లాలో తుఫాను సహాయక ప్రయత్నాలను పెంచడానికి ఓడల నుండి హెలికాప్టర్ల సేవలు కూడా ప్రారంభించబడ్డాయి. ఈ బృందం 100 సిద్ధం చేసిన ఆహార పదార్ధాల ప్యాకెట్లు, 300 డ్రై ప్రొవిజన్ ప్యాకెట్లను సహాయ బృందాలకు సరఫరా చేశారు.
*****
(Release ID: 1722389)
Visitor Counter : 109