రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు/యూటీలు,కేంద్ర సంస్థలకు అదనంగా 80,000 యాంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయింపు : శ్రీ. డి.వి. సదానంద గౌడ
మే 26న రాష్ట్రాలు/ యూటీలకు 29,250 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను కేటాయించిన కేంద్రం
Posted On:
27 MAY 2021 6:22PM by PIB Hyderabad
ముకార్మైకోసిస్ వ్యాధి చికిత్స కోసం వినియోగిస్తున్న యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను ఈ రోజు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు అదనంగా కేటాయించినట్టు కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ మంత్రి శ్రీ డి,వి. సదానంద గౌడ వెల్లడించారు. ఈరోజు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 80,000 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను కేటాయించామని ఆయన తెలిపారు.
ముకార్మైకోసిస్ వ్యాధి చికిత్స కోసం వినియోగిస్తున్న 29,250 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు మే 26వ తేదీన కేంద్రం పంపింది
***
(Release ID: 1722288)
Visitor Counter : 177