రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే సమయం 10 సెకన్ల కంటే ఎక్కువ ఉండకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు
Posted On:
26 MAY 2021 8:07PM by PIB Hyderabad
టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా, త్వరగా ప్రయాణించేలా చూడటానికి గాను భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) పలు రకాల చర్యలను చేపడుతోంది. జాతీయ రహదారులు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే గరిష్ట సమయం 10 సెకన్లకు మించకుండా సేవా సమయం ఉండేలా తగు మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 100 మీటర్లకు మించి వాహనాలను క్యూలో నిలచిపోవడం అనుమతించకుండా.. టోల్ ప్లాజాల వద్ద నిరంతరాయంగా ట్రాఫిక్ ప్రవహించేలా చర్యలు చేపడుతోంది. నూరు శాతం
తప్పనిసరి ఫాస్టాగ్ అమలు చేయడంతో.. దేశ టోల్ ప్లాజాల వద్ద చాలా వరకు
నిరీక్షణ సమయమనేది లేకుండా పోయింది. అయితే కొన్ని కారణాల వల్ల 100 మీటర్లకు పైగా వాహనాలు వెయిటింగ్‌లో నిరీక్షించాల్సి ఉంటోంది. అయితే.. తాజా మార్గదర్శకాల ప్రకారం.. వివిధ కారణాల వల్ల.. ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తున్న పలు వాహనాలు టోల్ ఫీజు కట్టకుండానే వెళ్లి పోయేందుకు వీలుగా తగిన అనుమతించనున్నారు. ఈ ప్రయోజనం కోసం, టోల్ బూత్ నుండి 100 మీటర్ల దూరంలో పసుపు గీతను.. ప్రతి టోల్ లేన్లో ఏర్పాటు చేయబడుతుంది. టోల్ ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీతనం భావనను మరింతగా కలిగించడానికి ఇది దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 2021 మధ్య నుండి ఎన్‌హెచ్ఏఐ 100% నగదు రహిత టోలింగ్ విజయవంతంగా మారింది. ఎన్‌హెచ్ఏఐ టోల్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్‌తో కూడిన వాహనాలు వెళ్లడం 96 శాతానికి చేరుకుంది. చాలా ప్లాజాల వద్ద ఇది 99 శాతం ఉంది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) ప్రవేశాల్ని దృష్టిలో ఉంచుకుని.. సమర్థవంతమైన టోల్ వసూలు వ్యవస్థలను కలిగి ఉండటానికి వచ్చే పదేళ్లలో ట్రాఫిక్ అంచనాల ప్రకారం కొత్త డిజైన్‌ను కలిగి ఉండాలని రాబోయే టోల్ ప్లాజాలను నిర్మించాల్సిన అవసరాలను ఇది నొక్కి చెబుతోంది. సామాజిక దూరం కొత్త సాధారణమైనందున ఎక్కువ మంది ప్రయాణికులు ఫాస్ట్ ట్యాగ్‌ను ఉపయోగించుకుంటున్నారు.. ఎందుకంటే ఇది డ్రైవర్లు, టోల్ ఆపరేటర్ల మధ్య పర్సనల్ కాంటాక్ట్‌లు ఏర్పడే అవకాశాలను ఇది తొలగిస్తుంది. జాతీయ రహదారుల వినియోగదారులు ఫాస్ట్ ట్యాగ్ వాడకంలో స్థిరమైన పెరుగుదల, స్వీకరణ ప్రోత్సాహకరంగా ఉంది. దేశ టోల్ కార్యకలాపాలలో మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది.
*****
(Release ID: 1722041)
Visitor Counter : 203