విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కోవిడ్ సంర‌క్ష‌ణ కార్యక్రమాలను చేప‌డుతున్న ప‌వ‌ర్‌గ్రిడ్‌

Posted On: 26 MAY 2021 10:34AM by PIB Hyderabad

కోవిడ్ మ‌హమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని 'మహారత్న' సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ప‌వ‌ర్‌గ్రిడ్‌) తన ఉద్యోగులు అందరి (ప్రస్తుతం సంస్థ‌లో ప‌నిచేస్తున్న‌, అధీన, కాంట్రాక్ట్ కార్మికులు) సంర‌క్ష‌ణ‌కు త‌గు చ‌ర్య‌లు చేప‌డుతోంది. కోవిడ్-19 వైర‌స్ బారిన ప‌డిన వారికి త‌గిన చికిత్స‌ను అందించేందుకు అవసరమైన అన్ని ర‌కాల స‌హాయాల్ని అందిస్తోంది. కోవిడ్-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ఈ వైర‌స్ గురించి ఉద్యోగుల‌కు త‌గు అవ‌గాన‌హ క‌ల్పించ‌డం.. త‌గిన ర‌క్ష‌ణ పొందేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌వ‌ర్త గురించి తెలియ‌ప‌రిచే కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. ప‌వ‌ర్ గ్రిడ్ ఉత్త‌ర ప్రాంతం- II, ఉద్యోగుల కోసం ఐదు టీకా డ్రైవ్‌లు నిర్వహించింది.
ఉద్యోగులు, వారి పై ఆధార‌ప‌డిన కుంటుంబ స‌భ్యులు, కాంట్రాక్టు కార్మికులు, సూప‌ర్ యాన్యుయేటెడ్ ఉద్యోగులు, వారి కుటుంబాల వారి సంక్షేమార్థం టీకా డ్రైవ్‌ల‌ను నిర్వ‌హించారు. జలంధర్, మోగా, హమీర్‌పూర్, వాగూరాతో సహా.. వివిధ ఉప స్టేషన్లలో ప‌ని చేసే ఉద్యోగుల‌కు దీనిని విస్తరించారు. జ‌మ్ములోని ఆర్‌హెచ్‌క్యూలో డ్రైవ్‌ను నిర్వ‌హించారు. ఇందులో సుమారు 100 మందికి టీకా వేశారు. ఆక్సిజన్ స‌దుపాయం క‌లిగిన దాదాపు 35 కోవిడ్ కేర్ ఫెసిలిటీ పడకలు ఏర్పాటు చేయబడింది. 24x7 నర్సు సంరక్షణ సౌకర్యం, మరియు రోగనిరోధక నిపుణులతో కూడిన ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం
నిరంత‌రం ఇమ్యూనాల‌జిస్ట్‌లు అందుబాటులో ఉంటారు. సంస్థ ఉద్యోగులు.. వారిపై ఆధార‌ప‌డిన వారికోసం నిరంత‌ర క‌న్స‌ల్టేష‌ష‌న్‌, పర్స‌నల్  విజిట్‌కు వీలుగా ఏర్పాట్లు చేశారు. సామాజిక దూరం, ముసుగులు (మాస్క్‌లు), చేతి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు మరియు సహాయక సిబ్బందికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు. కోవిడ్‌-19  ప్రవర్తనను వర్ణించే పోస్టర్ల‌ను మెయిన్ గేట్, పార్కింగ్ ప్రాంతం, లిఫ్ట్ ఏరియా మరియు ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఏర్పాటు చేశారు. ఆర్‌హెచ్‌క్యు జమ్మూ రిసెప్షన్‌లో కూడా వీటిని ఏర్పాటు చేశారు. రవాణా శిబిరాలు, ప‌వ‌ర్‌గ్రిడ్‌ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ యొక్క కమ్యూనిటీ సెంటర్‌ల‌లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ  చిన్న కార్యక్రమాలు అనారోగ్యాలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు వారికి సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడంలో సహాయపడ‌తాయి.

                               

***



(Release ID: 1721996) Visitor Counter : 162