యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
దేశంలో ఏడు రాష్ట్రాల్లో 143 ఖేలో ఇండియా కేంద్రాల స్థాపనకు క్రీడల మంత్రిత్వశాఖ అనుమతి
Posted On:
25 MAY 2021 5:05PM by PIB Hyderabad
దేశం ఏడు రాష్ట్రాల్లో 143 ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పడానికి క్రీడల మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి 14.30 కోట్ల రూపాయలు అవసరముంటాయని అంచనా వేశారు.. ఒకో కేంద్రాన్ని ఒకో క్రీడను కేటాయించడం జరుగుతుంది. మహారాష్ట్ర, మిజోరం, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్ రాష్ట్రాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
రాష్ట్రాలవారీగా సౌకర్యాలు:
1. మహారాష్ట్ర - 30 జిల్లాల్లో 36 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు. అంచనా వ్యయం 3.60 కోట్ల రూపాయలు
2. మిజోరాం - కోలాసిబ్ జిల్లాలో రెండు ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు. బడ్జెట్ అంచనా రూ. 20 లక్షలు.
3. అరుణాచల్ ప్రదేశ్- 26 జిల్లాల్లో 52 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు. . బడ్జెట్ అంచనారూ .4.12 కోట్ల రూపాయలు
4. మధ్యప్రదేశ్ - రూ .40 లక్షల బడ్జెట్ అంచనాతో నాలుగు ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయడం
5. కర్ణాటక - 31 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు. అంచనా వ్యయం రూ. 3.10 కోట్లు.
6. మణిపూర్ - 16 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు. అంచనా వ్యయం రూ. 1.60 కోట్లు.
7. గోవా - రెండు ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు. బడ్జెట్ అంచనా రూ. 20 లక్షలు.
క్షేత్ర స్థాయిలో క్రీడలకు అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రాలతో కలసి క్రీడల మంత్రిత్వశాఖ ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ' 2028 ఒలంపిక్ క్రీడల సమయానికి భారతదేశానికి మొదటి పది స్థానాల్లో స్థానం లభించేలా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఈ లక్ష్య సాధనకు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించవలసి ఉంది. జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే ఖేలో ఇండియా కేంద్రాల్లో మంచి కోచ్‌లతో పాటు అవసరమైన క్రీడా సామాగ్రి అందుబాటులో ఉంటుంది. దీనితో లక్ష్యాన్ని సులువుగా సాధించగలమన్న నమ్మకం ఉంది ' అని క్రీడలశాఖ మంత్రి శ్రీ శ్రీ కిరెన్ రిజిజు అన్నారు.
దేశంలో నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో నూతనంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పాలని 2020 జూన్ లో క్రీడల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీనికి ముందు వివిధ రాష్ట్రాల్లో 217 ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్ష దీవులు మరియు లడఖ్ జిల్లాలలో ప్రతి జిల్లాలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కేంద్రాలను నిర్వహించడానికి సంబంధిత రాష్ట్రాలు గతంలో ఛాంపియన్లుగా నిలిచిన క్రీడాకారులను నియమించవలసి ఉంటుంది. తక్కువ ఖర్చుతో క్షేత్రస్థాయిలో క్రీడా సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గతంలో ఛాంపియన్లుగా నిలిచిన క్రీడాకారుల సేవలను ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో ఛాంపియన్లుగా నిలిచిన క్రీడాకారులు యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ వారిని తీర్చిదిద్దుతారు. స్వయంప్రతిపత్తితో శిక్షణ ఇస్తూనే జీవనోపాధి పొందడానికి వారికి అవకాశం కలుగుతుంది.
గతంలో ఛాంపియన్లుగా నిలిచిన క్రీడాకారులకు కోచ్‌లుగా వేతనాలు చెల్లించడానికి, సహాయసిబ్బంది వేతనాలు, పరికరాల కొనుగోలు, వినియోగ వస్తువుల కొనుగోలు, పోటీల్లో పాల్గోడానికి అయ్యే ఖర్చును సహాయంగా అందిచడం జరుగుతుంది.
(Release ID: 1721683)
Visitor Counter : 243