సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి కారణంగా ట్రాన్స్‌జండర్లకు ఒక్కరికి రూ 1500 ల సహాయం అందించనున్న ప్రభుత్వం
ట్రాన్స్‌జండర్ వ్యక్తుల మానసిక ఆరోగ్యసంరక్షణకు 8882133897 హెల్ప్‌లైన్ ఏర్పాటు
Posted On:
24 MAY 2021 4:37PM by PIB Hyderabad
దేశం కోవిడ్ -19 మహమ్మారితో పోరాడుతున్న దశలో ట్రాన్స్ జండర్ కు చెందిన వారు మహమ్మారి కారణంగా తమ జీవనోపాధిని కోల్పోయారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు ఈ కమ్యూనిటీని తీవ్ర ఇబ్బందులలో నెట్టివేస్తున్నది. ఆహారం , ఆరోగ్యం వంటి మౌలికసదుపాయాల తీవ్ర కొరతను వీరు ఎదుర్కొంటున్నారు.
ట్రాన్స్‌జండర్ వ్యక్తుల జీవికకు భృతి:
దేశంలో ప్రస్తుతం నెలకొన్న మహమ్మారి పరిస్థితులలో ప్రభుత్వ సహాయాన్ని కోరుత ట్రాన్స్‌జండర్ల నుంచి ప్రభుత్వానికి తమను ఆదుకోవలసిందిగా ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా విజ్ఞప్తులు వచ్చాయి..
ట్రాన్స్ జండర్ల సంక్షేమానికి సంబంధించి సామాజిక న్యాయ , సాధికారతా మంత్రిత్వశాక నోడల్ మంత్రిత్వశాఖ కావడంతో , వీరి మౌలిక అవసరాలు తీర్చేందుకు ట్రాన్స్ జండర్లకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ 1500 ల అలవెన్సు చెల్లించాలని నిర్ణయించింది. ఈ ఆర్ధిక సహాయం ట్రాన్స్‌జండర్లకు తమ రోజువారీ ఖర్చులు భరించడానికి సహాయపడుతుంది. ఈ విషయమై ట్రాన్స్‌జండర్ల కోసం పనిచేస్తున్న సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు (సిబిఒలు), ప్రభుత్వేతర సంస్థలు దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని మంత్రిత్వశాఖ కోరింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఎవరైనా ట్రాన్‌జండర్ కాని లేదా అటువంటి వ్యక్తి తరఫున సిబిఓ కానీ తగిన వివరాలు అంటే ఆధార్, బ్యాంకు ఖాతా నెంబరు ను https://forms.gle/H3BcREPCy3nG6TpH7 ఫారమ్‌లో ఆర్ధిక సహాయం కోసం సమర్పించవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ వెబ్ సైట్‌లో పొందుపరిచారు. ఇది సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ కింద పనిచేసే స్వతంత్ర విభాగం. వీలైనంత ఎక్కువమంది ట్రాన్స్ జండర్లకు ఈ సహాయం అందేలా చూసేందుకుఈ ఫారంను ఎన్.జి.ఒలు, సిబిఒ ఎస్ ల సహాయంతో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా తెలియజేయడం జరుగుతోంది.
ఈ మంత్రిత్వశాఖ ఇలాంటి ఆర్థిక సహాయాన్ని , రేషన్ కిట్‌ను ట్రాన్స్ జండర్లకు గత ఏడాది లాక్‌డౌన్ సందర్భంలోనూ అందజేసింది. దేశవ్యాప్తంగా 7000 మంది ట్రాన్స్‌జండర్ల కు ప్రయోజనం చేకూర్చేందుకు 98.50 లక్షలు ఖర్చుచేశారు.
కౌన్సిలింగ్ సేవల హెల్ప్ లైన్ :
మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీని విషయంలో ఉన్న సామాజిక ఇబ్బందుల కారణంగా వారు సహాయం అందుకోలేక పోతారు.. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో ట్రాన్స్‌జండర్లు ఎదుర్కొనే మానసిక సమస్యలనుంచి వారిని బయటపడేసి వారికి తగిన మద్దతునిచ్చేందుకు ఉచిత హెల్ప్‌లైన్‌ను సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ప్రకటించింది. ట్రాన్స్‌జండర్ ఎవరైనా 8882133897 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. ఈ హెల్ప్‌లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 11 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేస్తుంది. ఈ హెల్ప్‌లైన్‌పై వారు మానసిక ఆరోగ్యానికి సంబంధించి ప్రొఫైషనల్ సైకాలజిస్టులనుంచి కౌన్సిలింగ్ పోందవచ్చు.
ట్రాన్స్‌జండర్లకు వాక్సినేషన్:
ప్రస్తుత కోవిడ్ , వాక్సినేషన్ సెంటర్లలో ట్రాన్స్ జండర్లపట్ల ఎలాంటి వివక్ష లేకుండా చూడాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఈ మంత్రిత్వశాఖ లేఖ రాసింది. వాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ట్రాన్స్‌జండర్లకు అవగాహన కలిపించేందుకు వివిధ స్థానిక పత్రికల ద్వారా వారికి తెలియజేయాలని సూచించింది. ట్రాన్స్‌జండర్ వ్యక్తులకు వాక్సిన్ వేసేందుకు వేరుగా మొబైల్ వాక్సినేషన్ కేంద్రాలు లేదా బూత్‌లను హర్యానా, అస్సాంలలో ఏర్పాటు చేసినట్టుగా ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్రాలను కోరారు.
***
(Release ID: 1721570)
Visitor Counter : 238