ఆర్థిక మంత్రిత్వ శాఖ
కెయిర్న్ న్యాయవివాదానికి సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలను ఖండించిన భారత ప్రభుత్వం
Posted On:
23 MAY 2021 2:23PM by PIB Hyderabad
కెయిర్న్ న్యాయవివాదానికి సంబంధించి కొన్నిమీడియా సంస్థలలో స్వార్థ ప్రయోజనాలు కలిగిన వారు సాగిస్తున్న తప్పుడు వార్తలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విదేశాలలోని విదేశీ కరెన్సీ ఖాతాలను కెయిర్న్ న్యాయవివాదానికి సంబంధించి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్న ముందుచూపుతో ప్రభుత్వం ఆయా విదేశీ కరెన్సీ ఖాతాలనుంచి నిధులను ఉపసంహరించుకోవలసిందిగా ఆయా ప్రభుత్వరంగ బ్యాంకులను కోరినట్టు కొన్ని మీడియాలలో ప్రచారంలో ఉన్న వార్తలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఇలాంటి వార్తలన్నీ నిరాధారమని ప్రభుత్వం ఖండించింది. ఇవి వాస్తవాల ఆధారంగా వస్తున్న వార్తలు కావని ప్రభుత్వం స్పష్టం చేసింది.స్వీయ ప్రయోజనాలు కలిగిన కొందరు ఇలాంటి తప్పుదార పట్టించే వార్తలను ప్రచారం చేస్తున్నారని, ఈ వార్తలకు ఆధారాలేమిటో అందులో తెలపడం లేదని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి న వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించకపోగా పూర్తి భిన్నమైన రీతిలో ప్రచారం చేస్తున్నారని తెలిపింది.
ఈ న్యాయ వివాదంలో తన వాదనలను భారత ప్రభుత్వం గట్టిగా వినిపిస్తున్నది. హేగ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో డిసెంబర్ 2020 నాటి లోపభూయిష్టమైన అవార్డును కొట్టివేయాల్సిందిగా 2021 మార్చి 22న భారత ప్రభుత్వం దరఖాస్తుచేసుకుందన్నది వాస్తవం.
ఆ అవార్డును పక్కనపెట్టాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం తన వాదనలను గట్టిగా వినిపిస్తోంది. ఇందులో 1భారత రిపబ్లిక్ ఏనాడూ తన జాతీయ వివాద పరిధిలో మధ్యవర్తిత్వానికి అంగీకారం, ఒప్పందం తెలపనప్పటికీ . ఆర్బిట్రల్ ట్రిబ్యూనల్ , ఒక జాతీయ పన్ను వివాద పరిధిలో అనుచిత జోక్యం చేసుకుంది. 2) ఈ అవార్డు కింద క్లెయిమ్‌లు భారత పన్ను చట్టాలను పూర్తిగా ఉల్లంఘించేవిగా, పన్ను చెల్లింపు మినహాయింపును దుర్వినియోగం చేసేవిగా ఉన్నాయి. అందువల్ల కెయిర్న్‌ల పెట్టుబడులు ఇండియా- యుకె ద్వైపాక్షిక పెట్ఉబడి ఒప్పందం కింద ఎలాంటి రక్షణ లభించదు. అలాగే,
3) ఈ అవార్డు కెయిర్న్ ద్వంద్వ పన్నేతర పథకాన్ని అనుచితంగా సమర్ధించనట్టు అవుతుంది. అంటే ప్రపంచంలో ఎక్కడా పన్నులు చెల్లించకుండా ఎగవేయడానకి ఇది వీలు కల్పించేదిగా ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు ప్రభుత్వవిధానలకు సంబంధించిన ఆందోళనకర అంశం.
ఈ ప్రొసీడింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. భారత ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి అన్ని న్యాయమార్గాలనూ అన్వేషిస్తున్నది, ప్రపంచవ్యాప్తంగా తన కేసును బలంగా వాదించేందుకు ప్రయత్నిస్తున్నది.
కెయిర్న్ సిఇఒ, దాని ప్రతినిధులు ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు భారత ప్రభుత్వంతో చర్చలకు సంప్రదించినట్టు కూడా ఇందులో పేర్కొన్నారు. నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని, ఈ వివాదం విషయంలో సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు , దేశ చట్టపరమైన చట్రానికి లోబడి కృషి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
***
(Release ID: 1721110)
Visitor Counter : 249