ఆయుష్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ' యోగా చేయండి ఇంట్లోనే ఉండండి' అనే అంశంపై అయిదు వెబినార్లను నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వశాఖ వెబినార్ సిరీస్ లో పాల్గొనున్న అయిదు సంస్థలు

Posted On: 23 MAY 2021 11:50AM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు సన్నాహకంగా ఆయుష్ మంత్రిత్వశాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నది. దీనిలో భాగంగా అయిదు ప్రముఖ సంస్థలతో కలసి ఆయుష్ మంత్రిత్వశాఖ ' యోగా చేయండి ఇంట్లోనే ఉండండి' అన్న అంశంపై అయిదు వెబినార్లను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుత సమయంలో యోగా ప్రాధాన్యతపై ఒకో సంస్థ ఒక వెబినార్ ను నిర్వహిస్తుంది. అయిదు సిరీస్ రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం  మే 24వ తేదీన  ఆర్ట్ అఫ్ లివింగ్ సంస్థ "బాహ్య సంక్షోభం మధ్య అంతర్గత బలాన్నిపొందడం ఎలా"అన్న అంశంపై వెబినార్ ను నిర్వహించనున్నది. 

కోవిడ్-19నేపథ్యంలో అత్యంత కీలకంగా మారిన అంశాలపై ఎక్కువ మంది ప్రజలను చైర్తన్యవంతులను చేయాలన్న లక్ష్యంతో ఈ వెబినార్లను నిర్వహించనున్నారు. అయిదు సంస్థలు వివిధ రంగాల్లో తమ అనుభవాలను ఒక వేదికపై క్రోడీకరించి వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. 

కోవిడ్ మహమ్మారి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు యోగా ద్వారా పరిష్కరించుకోవడానికి దోహదపడే విధంగా ఆర్ట్ అఫ్ లివింగ్ సంస్థ "బాహ్య సంక్షోభం మధ్య అంతర్గత బలాన్నిపొందడం ఎలా"అన్న అంశంపై వెబినార్ ను నిర్వహించనున్నది.సాయంకాలం అయిదు గంటలకు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమంలో ఆర్ట్ అఫ్ లివింగ్ అంతర్జాతీయ శిక్షకుడు స్వామి పూర్ణచైతన్య జి తన అనుభవాలను వివరిస్తారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  రంజిత్ కుమార్, ఎండిఎన్ఐవై డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి. బసవరడ్డి కూడా కార్యక్రమంలో ప్రసంగిస్తారు.అన్ని వెబ్‌నార్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క యూట్యూబ్, ఫేస్‌బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.

మిగిలిన నాలుగు వెబినార్లను యోగా ఇన్స్టిట్యూట్ , కృష్ణమాచార్య యోగా మందిరం, అర్హమ్‌ధ్యన్ యోగ్ మరియు కైవల్యాధమ యోగ ఇన్స్టిట్యూట్ లు నిర్వహిస్తాయి. 

ఆర్ట్ అఫ్ లివింగ్ సంస్థను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవి శంకర్ 1981లో  నెలకొల్పారు. విద్య, మానవ విలువల వ్యాప్తికి లాభాపేక్ష లేకుండా సంస్థ కృషి చేస్తోంది. ముంబైలోని శాంటాక్రూజ్ (తూర్పు)లో 1918లో యోగా ఇన్స్టిట్యూట్ ని శ్రీ యోగేంద్రజీ నెలకొల్పారు. జీవితంలో యోగా అంతర్భాగంగా ఉండాలన్న లక్ష్యంతో సంస్థ పనిచేస్తున్నది. 

1976లో టికెవి దేశికాచార్ ఒక ధార్మిక సంస్థగా కృష్ణమాచార్య యోగా మందిరం (కెవైఎం)ని ప్రారంభించారు. భారతదేశంలో యోగా, యోగ చికిత్సలు అందిస్తున్న సంస్థల్లో ఒకటిగా కృష్ణమాచార్య యోగా మందిరం (కెవైఎం) గుర్తింపు పొందింది. 

జైనుల సనాతన ధర్మం,సంప్రదాయాల పరిరక్షణకు ముంబయి కేంద్రంగా  కైవల్యధమ యోగా విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. దీనిని ముని  ప్రణయ్ సాగర్ నెలకొల్పారు. 

***



(Release ID: 1721049) Visitor Counter : 167