విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఒడిశాలో కొవిడ్‌ నిరోధక చర్యలు చేపట్టిన పవర్‌గ్రిడ్‌

Posted On: 22 MAY 2021 4:05PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలోని, మహారత్న హోదా సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (పవర్‌గ్రిడ్‌), దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సాయం కోసం ఈ కష్టకాలంలో చురుగ్గా చర్యలు చేపట్టింది.

    రూర్కెలా ఉప కేంద్రాన్ని 100 శాతం కొవిడ్‌ రహితంగా మార్చేందుకు పవర్‌గ్రిడ్‌ చర్యలు తీసుకుంది. రూర్కెలా ఉప కేంద్రం చుట్టుపక్కల నివశించే తన ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం వేగవంతమైన కొవిడ్‌ పరీక్షల శిబిరాన్ని (ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌-ఆర్‌ఏటీ) ఈ నెల 19వ తేదీన ఏర్పాటు చేసింది.

    అంగుల్‌ ఉప కేంద్రంలో సామూహిక టీకా కార్యక్రమం నిర్వహించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఏఎంసీ ఫిట్టర్లు, డ్రైవర్లు సహా దాదాపు 100 మందికి ఇక్కడ టీకా వేశారు. బరిపాద, కనిహా, బొలన్గిర్‌ ఉప కేంద్రాల్లోనూ టీకా కార్యక్రమాలను పవర్‌గ్రిడ్‌ నిర్వహించింది.

 

***



(Release ID: 1720921) Visitor Counter : 153