విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దాదాపు 150 గ్రామాలలో నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎన్‌టిపిసి మౌదా నదీ పునరుజ్జీవన ప్రాజెక్టు తోడ్పాటు
Posted On:
22 MAY 2021 11:17AM by PIB Hyderabad
భూగర్భ జలాల పునరుజ్జీవన ప్రాజెక్టు కింద నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు తాను కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతాలు,ఆ చుట్టుపక్కగల 150 గ్రామాలలో మహారాష్ట్రలోని మౌదాలో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి తోడ్పడింది. తన సిఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా నౌదాలోని ఎన్‌టిపిసి జలయుక్త శివార్ యోజనకు తోడ్పాటునందిస్తోంది. ఈ ప్రాజెక్టు మౌదాను మిగులు జలాల తెహశిల్‌గా మార్చడంలో విజయవంతం అయింది. ఈ ప్రాజెక్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహారాష్ట్ర విభాగం, ఇతర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలు చేసింది.
గతంలో నాగ్‌పూర్‌లోని, నీటిలోటు ఉన్న తహశిళ్ళలో మౌదా ఒకటిగా ఉంది. ఈ ప్రాజెక్టు 2017లో ప్రారంభమై 200 కిమీల పొడవునా మౌదా, హింగ్నా, కాంప్టీ తెహశిళ్ళలో అమలు అయింది. గత నాలుగేళ్ళలో 150కి పైగా గ్రామాలు దీని నుంచి లబ్ధి పొందాయి. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు అవసరమైన యంత్రాలు, పరికరాల ఇంధన చార్జీలకు ఎన్‌టిపిసి మౌదా రూ.75 లక్షలను అందించింది. అలాగే, దాదాపు 1000 ఎకరాల ప్రాంతానికి ఉపయోగపడే 5 చెరువుల పనరుజ్జీవనానికి ఎన్‌టిపిసి మౌదా 1 కోటి రూపాయలను అందిస్తోంది.
సమీప ప్రాంతాల అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం, అందుకు ఎన్‌టిపిసి మౌదా తన వంతు సాయం తాను చేస్తోంది, అని గ్రూప్ జనరల్ మేనేజర్ (ఎన్‌టిపిసి మౌదా) హరి ప్రసాద్ జోషీ చెప్పారు.
నది పారినంత మేర వాన ఎక్కడ పడితే అక్కడ దానిని బంధించండి, అన్న పద్ధతి చెరువులు, నాలాల సృష్టికోసం ఉద్దేశించింది. తద్వారా వాన నీటిని ఎక్కువ కాలం ఉంచవచ్చు. ఇంతకు ముందు, వాన నీరు ఇంకకుండా పారేది. కానీ, ప్రస్తుతం నీరు భూమిలోకి ఇంకేందుకు తగినంత సమయం ఉంటుంది. ఇది భూగర్భజలాలు భారీ స్థాయిలో పెరిగేందుకు తోడ్పడింది.
రెండేళ్ళ కింద వరకు, వరి, గోధుమ, మిరప వంటి పంటల కోతల ముందు కాలంలో నీటి కోసం ఆ ప్రాంతంలో రైతులు పోరాటం చేయవలసి వచ్చేది. ఇప్పుడు, నిల్వచేసిన వర్షపు నీరు రక్షణకు వచ్చి, వారి పంటలకు నూతన జీవాన్ని అందించడమే కాక వారి ఆదాయ స్థాయిలు పెరగడానికి తోడ్పాటు చేస్తోంది.
***
(Release ID: 1720861)
Visitor Counter : 208