హోం మంత్రిత్వ శాఖ

నైరుతి రుతుపవనాలు 2021 లో ఏర్పడే అవకాశం ఉన్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సంసిద్ధతపై రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ విభాగాల సహాయ కమిషనర్లు మరియు కార్యదర్శులతో వార్షిక సమావేశాన్నినిర్వహించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Posted On: 21 MAY 2021 5:00PM by PIB Hyderabad

ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ విభాగాల రిలీఫ్ కమిషనర్లు మరియు కార్యదర్శులతో ఈ రోజు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వార్షిక సమావేశాన్ని నిర్వహించింది.  నైరుతి రుతుపవనాల కాలంలో 2021 లో ఏర్పడడానికి అవకాశం ఉన్న  ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవటానికి సంసిద్ధతను  కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  ప్రధానంగా చర్చించారు. 

సమావేశంలో మాట్లాడిన హోం శాఖ కార్యదర్శి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఏడాది పొడవునా 24 గంటలూ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన సౌకర్యాలను వ్యవస్థలను సిద్ధం చేసుకోవలసి ఉంటుందని అన్నారు. నైరుతి రుతుపవనాల కాలంలో సంభవించే వరదలు, భారీ వర్షాల కురిసే సమయం లేదా మరేవిధమైన వైపరీత్యం ఏర్పడినప్పుడు పరిస్థితిని ఎదుర్కోవడానికి వైద్య సౌకర్యాలు, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో వరదలు, తుపానులు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కువగా ప్రాణ ఆస్థి నష్టం కలగకుండా చూడడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు సూచించారు. 

సమావేశంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సి) అభివృద్ధి చేసిన  నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ (ఎన్డిఇఎమ్)  వెర్షన్ 4.0 ను  హోం శాఖ కార్యదర్శి విడుదల చేశారు. దీనిద్వారా వివిధ విభాగాలు జారీ చేసే ముందస్తు హెచ్చరికలను ఎప్పటికప్పుడు సమీకృతం చేసి వాటిని దేశంలో విపత్తు నష్టాలను  తగ్గించడానికి జిల్లా స్థాయి వరకు విపత్తు నిర్వహణ అధికారులకు పంపడానికి వీలవుతుంది. 

ముందస్తు అంచనాలు , హెచ్చరికలు, వాటిని అందించే విధానం,  ప్రతిస్పందన మరియు సంసిద్ధత చర్యలు మరియు విపత్తు నిర్వహణ రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలపై భారత వాతావరణ విభాగం వివరించింది. 

సమావేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుకేంద్ర మంత్రిత్వ శాఖలుకేంద్ర సాయుధ పోలీసు దళాలుభారత వాతావరణ శాఖ సెంట్రల్ వాటర్ కమిషన్ స్నో అండ్  అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్రో తో సహా వివిధ శాస్త్రీయ పరిశోధనా సంస్థల ప్రతినిధులతో పాటు సాయుధ దళాలు మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు పాల్గొన్నాయి.

సమావేశంలో విపత్తు సంసిద్ధతముందస్తు హెచ్చరిక వ్యవస్థలువరద మరియు నది / రిజర్వాయర్ నిర్వహణవిపత్తు నిర్వహణ ఆన్-సైట్ మరియు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆఫ్-సైట్ ప్రణాళికలతో సంబంధం ఉన్నవివిధ  అంశాలను చర్చించారు. 

***



(Release ID: 1720762) Visitor Counter : 171