ఉక్కు మంత్రిత్వ శాఖ

రూర్కెలాలో అభివృద్ధి పరచిన ఐ సి యు వెంటిలేటర్ సౌకర్యాన్ని కోవిడ్ రోగులకు అంకితం ఇచ్చిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులలో ఒకరికి వ్యాక్సిన్ ఇస్తే బయట ఇద్దరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి : శ్రీ ప్రధాన్

ఐ సి యు సౌకర్యం స్థాయి పెంపు వల్ల ఒడిశాలో కోవిడ్ -19 పోరాటానికి సాయపడుతుంది

Posted On: 20 MAY 2021 2:45PM by PIB Hyderabad

ఒడిశా  రాష్ట్రం రూర్కెలాలోని భారత ఉక్కు సంస్థ (సెయిల్) కు చెందిన ఇస్పాత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ (ఐ పి జి ఐ)  మరియు  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (ఎస్ ఎస్ హెచ్)  వద్ద కోవిడ్  రోగుల చికిత్స కోసం అభివృద్ధి  పరచి స్థాయి పెంచిన ఐ సి యు వెంటిలేటర్ సౌకర్యాన్ని కేంద్ర ఉక్కు మరియు పెట్రోలియం  &  సహజవాయవు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  గురువారం ప్రజలకు అంకితం ఇచ్చారు.  
ఐ పి జి ఐ మరియు ఎస్ ఎస్ హెచ్ కాంప్లెక్ ను  భారత రాష్ట్రపతి 21 మార్చి 2021న జాతికి అంకితం ఇచ్చారు.   గురువారం చాక్షుష రీతిలో జరిగిన ఈ కార్యక్రమంలో  ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫాగన్  సింగ్ కులస్తే,   ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ నబాకిషోర్ దాస్,
సుందర్ గఢ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం పీ శ్రీ జ్వాలారం,  ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు,  సెయిల్ చైర్ పర్సన్ మరియు సి యి ఓ  సోమా మండల్ మరియు  ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు సెయిల్ కు చెందిన  సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

ఈ సందర్బంగా శ్రీ ప్రధాన్  మాట్లాడుతూ రూర్కెలా చుట్టుపక్కల వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు మరియు పొరుగున ఉన్న రాష్ట్రాలకు చెందిన వారు  ఎస్ ఎస్ హెచ్ లో అవుట్ పేషేంట్ సేవలను వినియోగించుకోవడం ప్రారంభించారని,  రెండవ దశ కరోనా విజృంభణతో  వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల రాక బాగా పెరిగిందని,  దాంతో ఆక్సిజన్,  వెంటిలేటర్ సౌకర్యాల పెంపు అవసరాన్ని గుర్తించి  కోవిడ్  రోగుల కోసం 60 పడకల ఐ సి యును  ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.    ఆ తరువాత దానిని 100 పడకల ఐ సి యు సౌకర్యంగా విస్తరించారు.   విస్తరించిన ఈ ఐ సి యు సౌకర్యం ఆ  ప్రాంతంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఆవశ్యకమైన చేర్పుఅని, ఈ  స్థాయి పెంపు  ఒడిశాలో కోవిడ్ -19 పోరాటానికి సహాయకారి కాగలదని కేంద్ర మంత్రి  తెలిపారు.

 ప్రాణాంతక కోవిడ్  మహమ్మారిని ఎదుర్కోవడానికి ఒడిశాలో ,  దేశవ్యాప్తంగా  స్టీల్ కంపెనీలు తమ శక్తిని ఒడ్డి పోరాడుతున్నాయని మంత్రి తెలిపారు.  స్టీల్ ప్లాంట్ల నుంచి  వైద్య చికిత్సకు అవసరమైన  ఆక్సిజన్  (ఎల్ ఎం ఓ)  సరఫరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని.  ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ  తేదీన 538 మెట్రిక్ టన్నులున్న రోజువారీ  ఆక్సిజన్  సరఫరా ఇప్పుడు 4400 మెట్రిక్ టన్నులకు పెరిగింది.  మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఒడిశా జరుపుతున్న పోరాటానికి తోడ్పడేందుకు సెయిల్ అనేక చర్యలు తీసుకుంది.    రూర్కెలా స్టీల్ ప్లాంట్  గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేసిన వైరాలజీ ప్రయోగశాల వల్ల  త్వరగా  కోవిడ్  పరీక్షలను జరపడానికి తోడ్పడింది.  రోజువారీ ఆర్ టి - పి సి ఆర్   పరీక్షల సంఖ్యను కూడా  రోజుకు 50 నుంచి ఇప్పుడు 550కి పెంచారు.  కొద్దీ రోజుల్లోనే వాటిని రోజుకు 1000కి పెంచనున్నారు.   మాస్కులు ,  మందులు ,  మరియు చికిత్సలో ఉపయోగించే ఇతర  వస్తువుల లభ్యతకు చర్యలు తీసుకున్నట్లు  శ్రీ ప్రధాన్  తెలిపారు. అంతేకాక  ప్లాంటు మరియు టౌన్ షిప్ లో  క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున శానిటైజ్ చేస్తున్నారు.  మహమ్మారిని గురించి జాగృతం చేసేందుకు  మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.   ఇప్పుడు సమాజంలోని మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం మహమ్మారిని అంతం చేయడానికి  భాగస్వామ్యపక్షాలు అన్నీ  కలసికట్టుగా కృషిచేయడమని  మంత్రి అన్నారు.  కోవిడ్  పరీక్షలు, చికిత్స మరియు టీకాలు వేయడానికి చర్యలను పెంచాలని ఆయన పిలుపు ఇచ్చారు.   తమ భాగస్వామ్య పక్షాలు అందరికీ టీకాలు వేయడానికి సెయిల్ పూనుకోవాలని , కాంట్రాక్టు ఉద్యోగులు,  ప్లాంటు చుట్టుపక్కల ఉండే వారందరికీ టీకాలు వేయించాలని అన్నారు.  ఇందుకోసం  1 + 2  పధ్ధతి పాటించాలని మంత్రి పిలుపు ఇచ్చారు.  అంటే  కార్పొరేట్ సంస్థలో ఒక ఉద్యోగికి టీకా వేస్తే ఇద్దరు బయటి వారికి కూడా టీకా వేయాలని ఆయన అన్నారు.  

రూర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు  9653 మెట్రిక్ టన్నుల ప్రాణ రక్షక ఎల్ ఎం ఓ ను  ఒడిశాతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు  పంపడం జరిగిందని శ్రీ ప్రధాన్  తెలిపారు.  రూర్కెలా ప్లాంటులో  ఎల్ ఎం ఓ ఉత్పత్తి పెంపునకు  మరియు రవాణాకు  ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి  ఇందుకోసం  వత్తిడి పెంచడం జరిగిందని,  రూర్కెలా స్టీల్  ప్లాంటులో  ఆక్సిజన్ వినియోగాన్ని  హేతుబద్ధం చేసి  రేయింబవళ్లు ఆక్సిజన్ రవాణా జరిగేటట్లు చూస్తున్నట్లు మంత్రి తెలిపారు.


ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు  రూర్కెలా  స్టీల్ ప్లాంట్  కర్మాగార ప్రాంగణంలోని సెక్టార్ 22లో  500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసే పని మొదలు పెట్టడం పట్ల శ్రీ ప్రధాన సంతోషాన్ని వ్యక్తం చేశారు.   ఆ ఆసుపత్రికి ప్లాంట్ నుంచి  పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా  చేయడంతో పాటు  వెంటిలేటర్లు మరియు ఇతర అనుబంధ సౌకర్యాలను కల్పిస్తున్నారు.   దాని నిర్మాణం పూర్తయితే సెయిల్ కు చెందిన రూర్కెలా టౌన్షిప్ లో  ఆక్సిజన్ సౌకర్యంతో మొత్తం  1000 పడకలు మరియు దాదాపు 225 వెంటిలేటర్లు ఏర్పాటవుతాయని మంత్రి తెలిపారు.  

 

****



(Release ID: 1720426) Visitor Counter : 138