ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాల తాజా సమాచారం


రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 21 కోట్లకు పైగా టీకా డోసుల అందజేత రాష్టాల దగ్గర ఇంకా అందు బాటులో 1.97 కోట్ల టీకా డోసులు

Posted On: 20 MAY 2021 1:43PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స   అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా  టీకాల మీద  ప్రత్యేక దృష్టిసారించింది. దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కృషికి అండగా కేంద్రప్రభుత్వం కోవిడ్ టీకాలు ఉచితంగా అందజేస్తోంది.

అదే సమయంలో రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నేరుగా టీకాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది.

సరళీకృత మూడో దశ టీకాల కార్యక్రమం మే 1న అమలు కావటం ప్రారంభం కాగా ఈ వ్యూహం కింద కేంద్ర ఔషధ ప్రయోగశాల (సిడిఎల్) ఆమోదం పొందిన   టీకా మందు తయారీదారులనుంచి 50% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఇంతకు ముందు లాగానే రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుంది. 

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా ఉచితంగానూ, రాష్ట్రాల ప్రత్యక్ష కొనుగోలు ద్వారా ఇప్పటిదాకా 21కోట్లకు పైగా టీకాలు    (21,07,31,130) రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. ఇందులో మొత్తం వాడకం ( వృధాతో సహా) 19,09,60,575 డోసులుగా ఈ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.

దాదాపు 2 కోట్ల (1,97,70,555) కోవిడ్ టీకా డోసులు ఇంకా  ప్రజలకు ఇవ్వటానికి వీలుగా రాష్ట్రాల దగ్గర అందుబాటులో ఉన్నాయి.

అంతే కాకుండా దాదాపు 26 లక్షల (25,98,760) టీకా డోసులు పంపే ప్రయత్నం సాగుతోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు త్వరలొనే ఈ డోసులు అందుకుంటాయి. 

*****



(Release ID: 1720278) Visitor Counter : 215