విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కేంద్ర విద్యుత్ రంగం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం భారీగా టీకా శిబిరాన్ని నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ
Posted On:
19 MAY 2021 6:21PM by PIB Hyderabad
గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి (స్వతంత్ర హోదా), నైపుణ్య అభివృద్ధి మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖల కేంద్ర మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ పిలుపు మేరకు.. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెట్‌లో భారీగా టీకా శిబిరంను నిర్వహించారు. మే 18 నుంచి 19 మే 2020 వరకు బదర్‌పూర్‌లోని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో
(ఎన్‌పీటీఐ) రెండు రోజుల టీకాల శిబిరం నిర్వహించారు. న్యూఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వ విద్యుత్
శాఖ, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఎంఎన్‌ఆర్ఈ కింద పని చేస్తున్న వివిధ సీపీఎస్‌యులు / సంస్థలకు చెందిన ఉద్యోగులు (కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు భద్రతా సిబ్బందితో సహా..) వారి కుటుంబ సభ్యులు (18-44 సంవత్సరాలు కలిగిన వారు కూడా) టీకాలను వేయించుకున్నారు. 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి టీకాలు తీసుకోకుండా ఉన్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకూ మొదటి మోతాదు టీకా ఇచ్చారు. ఢిల్లీ బదర్‌పూర్‌లో ఎన్‌పీటీఐలో
ఏర్పాటు చేసిన కోవిడ్ 19 టీకా శిబిరాన్నిఎన్‌హెచ్‌పీసీ సంస్థ సీఎండీ శ్రీ ఎ.కె. సింగ్, ఎన్‌పీటీఐ, అపోలో హాస్పిటల్స్ అధికారులతో కలిసి సందర్శించారు. శ్రీ ఎ.కె. సింగ్ ఎన్‌హెచ్‌పీసీలో మొదటి రోజు టీకాల వేదికను సందర్శించి ప్రస్తుత
సంక్షోభ కాలంలో ఈ టీకా శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి అంకితభావంతో కృషి చేసిన ఎన్‌హెచ్‌పీసీ బృందానికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ టీకా శిబిరానికి వేదికను ఏర్పాటు చేసేందుకు గాను సహకరించినందుకు ఎన్‌పీటీఐ, అపోలో హాస్పిటల్స్ సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రెండు రోజుల శిబిరంలో ఎన్‌హెచ్‌పీసీ భారీ స్థాయిలో టీకాలు వేసింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ, భెల్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, ఇరేడా, పీటీఐ, ఆర్ఈసీ, టీహెచ్‌డీసీ, పీటీసీ, సీవీపీపీఎల్, బీబీఎమ్‌బీ మరియు యుపీఎల్‌కు చెందిన 1270 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మొదటిసారిగా పొందారు. 24x7 ప్రాతిపదికన నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ రంగ సిబ్బంది భద్రత కోసం టీకా శిబిరం ఏర్పాటు చేశారు.
******
(Release ID: 1720119)
Visitor Counter : 212