ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీకరించిన ఎన్‌ఇజివిఎసి కొత్త సిఫార్సులు


ఎన్‌ఇజివిఎసి కొత్త సిఫారసుల ప్రకారం కొవిడ్‌ నుండి కోలుకున్న 3 నెలల తరువాత టీకా వేయబడుతుంది

మొదటి డోసు తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడితే కొవిడ్-19 నుండి కోలుకున్న 3 నెలల తర్వాత 2 వ డోసు వేయబడుతుంది.

పిల్లలకు తల్లిపాలిచ్చే మహిళలందరికీ కొవిడ్-19 టీకా సిఫార్సు చేయబడింది

వ్యాక్సినేషన్‌కు ముందు టీకా తీసుకునేవారికి ఎలాంటి రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు అవసరం లేదు.

Posted On: 19 MAY 2021 4:17PM by PIB Hyderabad

 

కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియపై  జాతీయ సాంకేతిక సలహా బృందం కొవిడ్-19 టీకాలకు సంబంధించి తాజా సిఫార్సులను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పంచుకుంది. ఈ సిఫార్సులు కొవిడ్-19 మహమ్మారి మరియు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శాస్త్రీయ ఆధారాలు, అభివృద్ధి చెందుతున్న పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయి.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సిఫారసులను అంగీకరించింది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి మరియు వాటిని రాష్ట్రాలు మరియు యుటిలకు కూడా తెలియజేశారు:

కింది పరిస్థితుల్లో కొవిడ్-19 టీకాను వాయిదా వేయడం జరుగుతుంది:

i.ప్రయోగశాల పరీక్షల్లో సార్స్‌-2 కొవిడ్-19 నిర్ధరణ: కోవిడ్ -19 టీకాలు వారు కోలుకునే వరకూ 3 నెలల వాయిదా వేయబడతాయి.

ii.ఎస్‌ఎఆర్‌ఎస్‌-2 మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా స్వస్థత కలిగిన ప్లాస్మా ఇచ్చిన ఎస్‌ఎఆర్‌ఎస్‌-2 కొవిడ్-19 రోగులు: కొవిడ్-19 టీకాలు ఆసుపత్రి నుండి విడుదలయ్యే తేదీ నుండి 3 నెలల వరకూ వాయిదా వేయబడతాయి.

iii.మొదటి డోసు తీసుకుని రెండవ డోసు తీసుకోవడానికి ముందు కొవిడ్-19 వైరస్‌ సోకిన వ్యక్తులు: కొవిడ్-19 అనారోగ్యం నుండి కోలుకున్న  3 నెలల అనంతరం మిగిలిన 2 వడోసు వ్యాక్సిన్‌ వేసుకోవాలి.

iv.ఆసుపత్రిలో చేరడం లేదా ఐసియు సంరక్షణ అవసరమయ్యే ఇతర తీవ్రమైన  అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు కూడా కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకునే ముందు 4-8 వారాలు వేచి ఉండాలి.

కొవిడ్ -19 వ్యాక్సిన్ అందుకున్న 14 రోజుల తర్వాత లేదా కొవిడ్-19 వ్యాధి బారిన పడినవాళ్లు ఆర్టీ-పిసిఆర్ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన తర్వాత రక్తదానం చేయవచ్చు

పాలిచ్చే మహిళలందరికీ కొవిడ్-19 టీకాలు వేయడం మంచిది.

కొవిడ్-19 వ్యాక్సినేషన్‌కు ముందు టీకా తీసుకునేవారికి ఎలాంటి రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు(ఆర్‌ఎటి) అవసరం లేదు.

గర్భిణీ స్త్రీలకు కొవిడ్-19 టీకాలు వేయడంపై నేషనల్‌ ఇమ్యునైజేషన్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్‌టిఎజిఐ) మరింత చర్చించి నిర్ణయం తీసుకోనుంది

ఈ సిఫారసులను గమనించి వాటి సమర్థవంతమైన అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ప్రజలకు మరింత అర్ధమయ్యేలా స్థానిక భాషల్లో అన్ని మాధ్యమాల్లో సమాచారం అందించాలని సూచించారు. టీకా సిబ్బందికి అన్ని స్థాయిలలో శిక్షణనివ్వాలని రాష్ట్రాలకు సూచించారు.


 

****



(Release ID: 1719977) Visitor Counter : 382