శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 యొక్క వివిధ వైరస్ జాతులను సులభంగా గుర్తించడం కోసం, నూతన మల్టీప్లెక్స్ ఆర్.టి-పి.సి.ఆర్. పరికరాన్ని, నూతన జన్యు లక్ష్యాలతో అభివృద్ధి చేసిన - డి.ఎస్.టి. సంస్థ
సార్స్-కోవ్-2 ఉత్పరివర్తనాలను సులభంగా గుర్తించడం ద్వారా కోవిడ్-19 కి వ్యతిరేకంగా మన పోరాటంలో ఈ ప్రత్యేకమైన ఆర్.టి-పి.సి.ఆర్. కిట్ ఒక ముఖ్యమైన ఆయుధంగా ఉంటుంది - డి.ఎస్.టి. కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ
Posted On:
18 MAY 2021 5:21PM by PIB Hyderabad
కొత్తగా అభివృద్ధి చేసిన, మల్టీప్లెక్స్ ఆర్.టి-పి.సి.ఆర్. పరికరం గ్లోబల్ మహమ్మారికి కారణమైన వైరస్ యొక్క వివిధ ఉత్పరివర్తన జాతులలో కోవిడ్ -19 ను గుర్తించే అధిక ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది.
మహమ్మారి బహుళ వైవిధ్యాలతో రెండవ దశ కొనసాగుతున్న నేపథ్యంలో, మల్టీప్లెక్స్ ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షలో లక్ష్య జన్యువుల ఎంపిక వైరస్ యొక్క ఖచ్చితమైన గుర్తించడంలో కీలకంగా మారుతోంది.
కరోనా వైరస్ లు ఇతర ఆర్.ఎన్.ఏ. వైరస్ ల కంటే చాలా తక్కువ లోపాలను కలిగి ఉన్నప్పటికీ, ఎస్. ఆర్. మరియు ఎన్. జన్యువులలో ని ఉత్పరివర్తనలు తరచుగా ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షలో జోక్యం చేసుకుంటాయి. ఉదాహరణకు, ఆర్.ఎన్.ఏ. లోని 6 స్థావరాలను తొలగించడం వలన “సంబంధిత వేరియంట్” బి1.1.7 (యు.కే. వేరియంట్ అని కూడా పిలుస్తారు) 69-70 డెల్ కలిగి ఉంది, దీని ఫలితంగా ఆర్. జన్యువు ఆర్.టి.-పి.సి.ఆర్. పరీక్ష నుండి తప్పుకుంటుంది.
కొత్త మల్టీప్లెక్స్ ఆర్.టి-పి.సి.ఆర్. కిట్ ని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్.సి.టి.ఐ.ఎంఎస్.టి) అభివృద్ధి చేసింది. భారత ప్రభుత్వం లోని, శాస్త్ర, సాంకేతిక విభాగంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ సంస్థ, రెండు సార్స్ కోవ్-2 జన్యువులైన, ఆర్.డి.ఆర్.పి. మరియు ఓ.ఆర్.ఎఫ్.బి-ఎన్.ఎస్.పి.14, మరియు మానవ ఆర్.ఎన్.ఏ. సే పి. జన్యువు లను, పరివర్తన చెందిన జాతుల శ్రేణిని గుర్తించడంలో సహాయపడే అంతర్గత నియంత్రణ కోసం, లక్ష్యంగా చేసుకుంది.
కోవిడ్-19 ను గుర్తించడంలో ఆర్.డి.ఆర్.పి. మరియు ఓ.ఆర్.ఎఫ్.1బి-ఎన్.ఎస్.పి.14 జన్యువులు మరింత సున్నితంగా ఉన్నట్లు, వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. రెండవ దశ లోని బహుళ వైవిధ్యాలను లక్ష్యంగా చేసుకోవడానికి, ఆర్.డి.ఆర్.పి. మరియు ఓ.ఆర్.ఎఫ్-ఎన్.ఎస్.పి.14 వంటి రెండు అత్యంత ఖచ్చితమైన నిర్ధారణ జన్యువులను ఉపయోగించినట్లయితే, ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలదు. ఓ.ఆర్.ఎఫ్-ఎన్.ఎస్.పి.14 అనేది కోవిడ్-19 లో తక్కువ పరివర్తన చెందిన జన్యువులలో ఒకటి కాగా, ప్రస్తుతం, మార్కెట్లో ఓ.ఆర్.ఎఫ్-ఎన్.ఎస్.పి.14 లక్ష్యంగా కిట్లు లేవు.
మల్టీప్లెక్స్ తక్మాన్ కెమిస్ట్రీ పై ఆధారపడిన, ఈ కొత్త కిట్, మూడు జన్యువులను ఒకే ప్రతిచర్యలో విస్తరిస్తుంది. నాసోఫారింజియల్ (ముక్కుల నుండి తీసే) శ్వాబ్ నమూనాల నుండి ఆర్.ఎన్.ఏ. వేరుచేయడానికి అవసరమైన సమయం కాకుండా, పరీక్ష కోసం విస్తరణ సమయం 45 నిమిషాలు పడుతుంది. జన్యువులలో ఒకటి విస్తరించడంలో విఫలమైతే మరియు క్రమం విశ్లేషణ కోసం గుర్తించగలిగితే రెండు నిర్ధారణ జన్యువులను మల్టీ ప్లెక్సింగ్ సాధ్యమయ్యే కొత్త వైవిధ్యాలను షార్ట్ లిస్ట్ చేయడానికి సహాయపడుతుంది.
పూణే లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లో ఈ కిట్ ను, ఐ.సి.ఎం.ఆర్. ధృవీకరించింది, ఇది, కోవిడ్-19 ని గుర్తించడంలో, 97.3 శాతం సున్నితత్వాన్నీ, 100 శాతం నిర్దిష్టతను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు.
ఈ కిట్‌ను వాణిజ్యపరం చేయడానికి ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి., 2021 మే, 14వ తేదీన హైదరాబాద్‌లోని హువెల్ లైఫ్ సైన్సెస్ తో ఒక సాధారణ లైసెన్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
"ఈ ప్రత్యేకమైన ఆర్.టి-పి.సి.ఆర్. కిట్ కోవిడ్-19 కి వ్యతిరేకంగా మనం చేసే పోరాటంలో ఒక ముఖ్యమైన ఆయుధంగా ఉంటుంది, ఇది సార్స్-కోవ్-2 ఉత్పరివర్తనాలను సులభంగా గుర్తించడం ద్వారా చాలా ముఖ్యమైనది గా మారుతోంది," అని డి.ఎస్.టి. కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలియజేశారు.
*****
(Release ID: 1719796)
Visitor Counter : 190