రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కొవిడ్ సంబంధిత ఔషధాల లభ్యతపై శ్రీ సదానంద గౌడ సమీక్ష

Posted On: 18 MAY 2021 7:33PM by PIB Hyderabad

కొవిడ్‌ చికిత్స కోసం వాడుతున్న ఔషధాల లభ్యతపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ సమీక్షించారు. కేంద్ర ఔషధ విభాగం సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

    దేశవ్యాప్తంగా ఔషధాల కొరత లేకుండా, నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు కేంద్ర ఔషధ విభాగం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోందని కేంద్ర మంత్రి ట్వీట్‌ చేశారు.

***(Release ID: 1719794) Visitor Counter : 24