రక్షణ మంత్రిత్వ శాఖ
భారత వైమానిక దళం విమానంలో దుబయ్‌కి ఆక్సిజన్ కంటైనర్‌ల రవాణా
Posted On:
17 MAY 2021 12:50PM by PIB Hyderabad
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్, ఖాళీ క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను 20 ఏప్రిల్ 2021 నుండి భారతదేశంలోని ఆయా ఫిల్లింగ్ స్టేషన్లకు విమానంలో రవాణా చేస్తోంది. తద్వారా వాటిలో ప్రాణవాయువు నింపి రోడ్డు మార్గం లేదా రైలు ద్వారా గమ్యస్థానాలకు రవాణా చేసేందుకు వీలు కలుగుతుంది. ఐఏఎఫ్ ఇప్పుడు అంతర్జాతీయంగా వివిధ గమ్యస్థానాలకు కూడా ఇదే రకమైన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఐఏఎఫ్‌కు చెందిన ఐఎల్-76 విమానం జామ్‌నగర్ నుండి దుబయ్ దేశంలోని అల్ మక్తూమ్‌కు దాదాపు 03 ఖాళీ క్రయోజెనిక్ కంటైనర్లతో వాయుమార్గంలో పంపించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ కంటైనర్ల రవాణాను సమన్వయం చేస్తోంది. ఈ కంటైనర్‌లు దుబాయ్‌లోని లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో నింపబడుతాయి. ఓడ మార్గం ద్వారా తిరిగి భారతదేశానికి తీసుకురాబడతాయి. విమానాలలో కంటైనర్లను పంపించడం వల్ల ఖాళీ కంటైనర్ల రవాణా సమయం గణనీయంగా తగ్గుతుంది. వేగంగా ఆక్సిజన్ సరఫరాకు వీలుకలుగుతుంది.
***
(Release ID: 1719469)
Visitor Counter : 187