రైల్వే మంత్రిత్వ శాఖ
దేశానికి 9449 ఎంటీలకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను అందించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
ఇప్పటికే తమ ప్రయాణాన్ని పూర్తి చేసిన 150కి పైగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
55 ట్యాంకర్లతో 970 ఎంటీల ఆక్సిజన్‌తో పరుగులు తీస్తున్న 12 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 13 రాష్ట్రాలకు అందిన సాయం
మహారాష్ట కు 521 ఎంటీలు, ఉత్తరప్రదేశ్ కు 2525 ఎంటీ, మధ్యప్రదేశ్ కు 430 ఎంటీ, హర్యానా కు 1228 ఎంటీ, తెలంగాణకు 389ఎంటీ, రాజస్థాన్ కు 40 ఎంటీ, కర్ణాటక కు 361 ఎంటీ, ఉత్తరాఖండ్ కు 299 ఎంటీ, కేరళకు 118 ఎంటీ, తమిళనాడుకు 151 ఎంటీ, ఆంధ్రప్రదేశ్ కు 116 ఎంటీ, ఢిల్లీకి 2748ఎంటీలకు పైగా ఆక్సిజన్ ను సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
Posted On:
16 MAY 2021 6:25PM by PIB Hyderabad
సమస్యలు, అడ్డంకులను దాటుకుంటూ దేశం వివిధ ప్రాంతాలకు అవసరమైన ఆక్సిజన్ ను భారత రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా చేరవేస్తున్నాయి. ఇప్పటివరకు భారత రైల్వేశాఖ 590 ట్యాంకర్లలో దాదాపు 9440 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా చేసింది.
తాజా సమాచారం మేరకు 970 ఎంటీల ఆక్సిజన్ ను నింపిన 55 ట్యాంకర్లను 12 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ గమ్య స్థానాలకు నడుస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు అనేక అనేక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఆక్సిజన్ ను చేరవేయడంతో ఆ రాష్ట్రాలు ఊపిరి పీల్చుకొంటున్నాయి.
అదనంగా సరఫరా చేయడానికి దేశ రాజధాని ప్రాంతానికి 5000 ఎంటీల ఆక్సిజన్ చేరింది.
గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ దాదాపు 800 ఎంటీల ఆక్సిజన్ ను ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రవాణా చేస్తున్నాయి.
రాష్ట్రాల నుంచి అభ్యర్ధన అందిన వెంటనే తక్కువ కాలంలో సాధ్యమైనంత ఎక్కువగా ఆక్సిజన్ ను రవాణా చేయాలని భారత రైల్వేలు లక్ష్యంగా నిర్ణయించుకుని పనిచేస్తున్నాయి.
కేరళకు 118 ఎంటీల ఆక్సిజన్ ను తొలిసారిగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఎర్నాకుళంకు చేరవేసింది.
తాజా సమాచారం మేరకు మహారాష్ట కు 521 ఎంటీలు, ఉత్తరప్రదేశ్ కు 2525 ఎంటీ, మధ్యప్రదేశ్ కు 430 ఎంటీ, హర్యానా కు 1228 ఎంటీ, తెలంగాణకు 389ఎంటీ, రాజస్థాన్ కు 40 ఎంటీ, కర్ణాటక కు 361 ఎంటీ, ఉత్తరాఖండ్ కు 299 ఎంటీ, కేరళకు 118 ఎంటీ, తమిళనాడుకు 151 ఎంటీ, ఆంధ్రప్రదేశ్ కు 116 ఎంటీ, ఢిల్లీకి 2748ఎంటీలకు పైగా ఆక్సిజన్ ను సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రవాణా చేశాయి.
ఆక్సిజన్‌ను రవాణా చేయడం అనేది సంక్లిష్టమైన అంశం. రవాణా అవుతున్న ఆక్సిజన్ పరిమాణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మరికొన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నాయి.
రాష్ట్రాల అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి రైల్వేలు వివిధ మార్గాలను సిద్ధం చేశాయి. ఎల్‌ఎంఓను తీసుకురావడానికి అవసరమైన ట్యాంకర్లను భారత రైల్వేకు ఆయా రాష్ట్రాలు అందిస్తున్నాయి.
***
(Release ID: 1719312)
Visitor Counter : 165