వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఎన్.ఎఫ్.ఎస్.ఏ. / పి.ఎమ్-జి.కే.ఏ.వై-III పధకాల కింద ఆహార ధాన్యాల సురక్షితమైన మరియు సకాలంలో పంపిణీని నిర్ధారించడానికి చౌక ధరల దుకాణాలను ఎక్కువ సమయం మరియు వారంలో అన్ని రోజులూ తెరిచి ఉంచాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన - కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ విభాగం

Posted On: 16 MAY 2021 1:12PM by PIB Hyderabad

 

కొన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న లాక్-డౌన్ కారణంగా, చవక ధరల దుకాణాల (ఎఫ్‌.పి.ఎస్.ల) పని గంటలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో,    పి.ఎం.జి.కే.ఏ.వై-III మరియు ఎన్.ఎఫ్.ఎస్.ఏ. పధకాల కింద ఆహార ధాన్యాల లబ్ధిదారులకు రోజంతా అందుబాటులో ఉండే పద్ధతిలో పంపిణీ చేయడానికి వీలుగా,   చౌక ధరల దుకాణాలను నెలలో అన్ని రోజులు తెరిచి ఉంచాలనీ,  చౌక ధరల దుకాణాల వద్ద సరైన సామాజిక దూరం వంటి  కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలనీ, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ 2021 మే నెల 15వ తేదీన, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు, ఒక సలహా (అడ్వైజరీ) జారీ చేసింది.  ఇందుకు అనుగుణంగా, సాధారణ మార్కెట్ లోని దుకాణాలు తెరిచి ఉంచడానికి విధించిన పరిమిత గంటల నిబంధనల నుండి చౌక ధరల దుకాణాలకు మినహాయింపు ఉండేలా చూడాలని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను అభ్యర్థించారు.

ఈ విభాగం జారీ చేసిన సలహా ప్రకారం, పి.ఎం.జి.కే.ఏ.వై-III మరియు ఎన్.ఎఫ్.ఎస్.ఏ. పధకాల కింద అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఎ. లబ్ధిదారులందరికీ, కోవిడ్-19 నియమనిబంధనల ను సక్రమంగా పాటిస్తూ,  సురక్షితంగా, సరైన సమయంలో  అందజేయడానికి, ఈ చర్య వీలు కల్పిస్తుంది.  లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా, తమ ఎఫ్‌.పి.ఎస్‌.ల వద్ద సకాలంలో ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో చేపట్టిన చర్యలకు విస్తృత ప్రచారం కల్పించాలనీ, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.

ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లబ్ధిదారులకు, గతంలో అమలుచేసిన పద్ధతిలోనే, వారికి ప్రతీ నెలా అందజేసే అర్హతలకు అందనంగా నెలకు 5 కిలోల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు (బియ్యం / గోధుమ) అందించడం ద్వారా, “ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన” (పి.ఎమ్-జి.కే.ఏ.వై-III) కింద, రెండు నెలల కాలానికి, అంటే, 2021 మే మరియు జూన్ నెలలకు, పంపిణీ చేయడం ప్రారంభమైంది. అంత్యోదయ అన్న యోజన (ఏ.ఏ.వై) మరియు ప్రాధాన్యతా కుటుంబాలు (పి.హెచ్.హెచ్) అనే పేర్లతో ఉన్న ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఏ. కి చెందిన రెండు పథకాల పరిధిలో ఉన్న 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. 

సలహా లేఖ (అడ్వైజరీ) కోసం ఇక్కడ నొక్కండి 

*****



(Release ID: 1719261) Visitor Counter : 174