ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గత 6 రోజుల్లో 5 రోజులు కొత్త కేసుల కంటే కోలుకున్నవారు అధికం


గత 24 గంటల్లో చికిత్సలో ఉన్న వారి సంఖ్య 55,344 తగ్గుదల

దేశవ్యాప్తంగా 18.22 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ

18-44 వయోవర్గం అందుకున్న టీకాలు 48 లక్షల పైమాటే

Posted On: 16 MAY 2021 11:26AM by PIB Hyderabad

భారత దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకొని బైటపడినవారి సంఖ్య 2,07,95,335 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం  84.25% కాగా గత 24 గంటలలో  3,62,437 మంది కోలుకున్నారు. ఇది చికిత్సలో ఉన్నవారి కంటే ఎక్కువగా కాగా గత ఆరు రోజుల్లో ఇలా  నమోదవటం ఇది ఐదో సారి. కోలుకున్నవారిలో 70.94% మంది పది రాష్ట్రాలలో ఉన్నారు. 

మరోవైపు దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ నేడు 36,18,458 కు చేరింది. ఇది దేశం మొత్తంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 14.66%. గత 24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో  55,344 కేసులు తగ్గాయి.  చికిత్సలో ఉన్నవారిలో 74.69% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.

వివిధ రాష్ట్రాలలో గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసుల సంఖ్యలో మార్పును ఈ పటంలో చూడవచ్చు. 

పాజిటివిటీ శాతం తగ్గుతూ ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం అది 16.98% కు తగ్గినట్టు ఈ దిగువన చూదవచ్చు  

మూడో దశ టీకాలు కూడా మొదలవటంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు 18.22 కోట్లు దాటాయి.

ఇప్పటిదాకా మొత్తం  26,55,003 శిబిరాల ద్వారా 18,22,20,164 టీకా డోసుల పంపిణీ జరిగినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. ఇందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 96,42,278 మొదటి డోసులు, 66,41,047 రెండో డోసులు, కోవిడ్ యోధులు అందుకున్న 1,44,25,044 మొదటి డోసులు, 81,86,568 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు అందుకున్న 48,25,799 మొదటి డోసులు, 45-60 ఏళ్లవారు తీసుకున్న  5,71,61,076 మొదటి డోసులు, 90,66,862 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న  5,44,69,599 మొదటి డోసులు,  1,78,01,891 రెండో డోసులు ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,42,278

రెండవ డోస్

66,41,047

కొవిడ్ యోధులు

మొదటి డోస్

1,44,25,044

రెండవ డోస్

81,86,568

18-44 వయోవర్గం

మొదటి డోస్

48,25,799

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,71,61,076

రెండవ డోస్

90,66,862

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,44,69,599

రెండవ డోస్

1,78,01,891

 

మొత్తం

18,22,20,164

 

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలలో 66.76% వాటా పది రాష్ట్రాలు తీసుకున్నాయి.   

 

18-44 వయోవర్గానికి చెందిన 5,62,130 మంది గత 24 గంటలలో కోవిడ్ టీకా మొదటి డోస్ తీసుకోగా ఇప్పటివరకు ఈ వయోవర్గంలో 48,25,799 మంది తీసుకున్నారు. 32 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రామ్తాలకు చెమ్దిన ఈ వయీఓవర్గపు లబ్ధిదారుల వివరాలు ఆయా రాష్ట్రాలవారీగా  ఇలా ఉన్నాయి:

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

1,181

2

ఆంధ్రప్రదేశ్

3,443

3

అస్సాం

1,96,690

4

బీహార్

6,23,255

5

చండీగఢ్

1,938

6

చత్తీస్ గఢ్

1,028

7

దాద్రా, నాగర్ హవేలి

2,992

8

డామన్-డయ్యూ

3,137

9

ఢిల్లీ

5,78,140

10

గోవా

5,800

11

గుజరాత్

4,82,501

12

హర్యానా

4,20,625

13

హిమాచల్ ప్రదేశ్

14

14

జమ్మూ-కశ్మీర్

31,188

15

జార్ల్ఖండ్

73,436

16

కర్నాటక

1,13,335

17

కేరళ

1,553

18

లద్దాఖ్

570

19

మధ్యప్రదేశ్

1,81,722

20

మహారాష్ట్ర

6,48,674

21

మేఘాలయ

3,884

22

నాగాలాండ్

4

23

ఒడిశా

1,39,177

24

పుదుచ్చేరి

2

25

పంజాబ్

6,961

26

రాజస్థాన్

7,17,784

27

తమిళనాడు

31,356

28

తెలంగాణ

500

29

త్రిపుర

2

30

ఉత్తరప్రదేశ్

4,14,736

31

ఉత్తరాఖండ్

1,08,125

32

పశ్చిమ బెంగాల్

32,046

మొత్తం

48,25,799

 

గడిచిన 24 గంటలలో 17 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు.  దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైన 120వ రోజైన మే 15 నాడు 17,33,232 డోసుల పంపిణీ జరగగా 16,027 శిబిరాల ద్వారా 11,30,928 మంది మొదటి డోస్, 6,02,304 మంది రెండో డోస్ తీసుకున్నారు. 

తేదీ : మే 15, 2021 (120వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

14,093

రెండవ డోస్

18,622

కోవిడ్ యోధులు

మొదటి డోస్

56,699

రెండవ డోస్

35,560

18-44 వయోవర్గం

మొదటి డోస్

5,62,130

45 -60  వయోవర్గ

మొదటి డోస్

3,48,678

రెండవ డోస్

3,05,017

60 పైబడ్డవారు

మొదటి డోస్

1,49,328

రెండవ డోస్

2,43,105

మొత్తం

మొదటి డోస్

11,30,928

రెండవ డోస్

6,02,304

 

గత 24 గంటలలో 3,11,170 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో పది రాష్టాలవాటా 74.7% ఉంది. కర్నాటకలో అత్యధికంగా ఒక్క రోజులో  41,664 కొత్త కేసులు రాగా మహారాష్టలో 34,848, తమిళనాడులో   33,658 నమోదయ్యాయి.

జాతీయ స్థాయిలో కోవిడ్ బాధితులలో మరణాల శాతం  1.09% ఉంది. గత 24 గంటలలో 4,077 మంది కోవిడ్ వల్ల మరణించారు. అందులో పది రాష్ట్రాలవాటా 75.55% ఉంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో అత్యధికంగా 960 మంది చనిపోగా కర్నాటకలో 349 మరణాలు నమోదయ్యాయి.

దీనికి తోడుగా విదేశాలనుంచి అందుతున్న కోవిడ్ సాయాన్ని వీలైనంత త్వరగా అందుకొని రాష్టాలకు విభజించి తరలిస్తున్నారు. మొత్తం 10,953 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 13,169 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ ఉత్పత్తి ప్లాంట్లు; 6,835 వెంటిలేటర్లు; దాదాపు 4.9 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ఇప్పటిదాకా రోడ్డు, వాయు మార్గాల్లో పంపారు.  

 

***



(Release ID: 1719079) Visitor Counter : 159