రైల్వే మంత్రిత్వ శాఖ

20 రోజుల‌లో 126 మెట్రిక్ ట‌న్నుల నుంచి 7900 మెట్రిక్ ట‌న్నులు; 24 ఏప్రిల్‌న తొలి బ‌ట్వాడాతో ప్రారంభించి 12 రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్ స‌హాయాన్ని అందించేందుకు ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ కార్య‌క‌లాపాల‌ను పెంచిన రైల్వేలు


40 మెట్రిక్ ట‌న్నుల ఎల్ఎంఒతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నెల్లూరుకు ప్ర‌యాణిస్తున్న తొలి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌

118 ఎంటిల ఎల్ఎంఒతో కేర‌ళ‌లోని ఎర్నాకులంకు బ‌యిలు దేరిన తొలి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌

80ఎంటిల ఆక్సిజ‌న్‌ను త‌మిళ‌నాడుకు బ‌ట్వాడా చేసిన తొలి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌

ప్ర‌స్తుతం దేశంలో రోజుకు 800 ఎంటిల ఎల్ఎంఒను బ‌ట్వాడా చేస్తున్న ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు

ఉత్త‌రాఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఎంపి, ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు, హ‌ర్యానా, తెలంగాణ‌, పంజాబ్‌, కేర‌ళ‌, ఢిల్లీ, యుపిల‌కు ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఆక్సిజ‌న్ చేర‌వేత‌

నేటివ‌ర‌కు 462 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను మ‌హ‌రాష్ట్ర‌లో దించ‌గా, 2210 ఎంటిలు యుపిలో, 408 ఎంటీలు ఎంపిలో, 1228 ఎంటీలు హ‌ర్యానాలో, 308 ఎంటిలు తెలంగాణ‌లో, 72 ఎంటీలు రాజ‌స్థాన్‌లో, 120 ఎంటీలు క‌ర్నాట‌కలో, 80 ఎంటీలు ఉత్త‌రాఖండ్‌లో, 80 ఎంటీలు త‌మిళ‌నాడులో, 2934 ఎంటీల‌కు పైగా ఢిల్లీలో అందించాయి

Posted On: 14 MAY 2021 6:51PM by PIB Hyderabad

అన్ని ఆటంకాలను అధిగమించి,  నూత‌న  కొత్త పరిష్కారాలను కనుగొంటూ   దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకుద్ర‌వ‌రూపంలోని మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను పంపిణీ చేయడం ద్వారా ఊర‌ట‌ను కలిగించే ప్రయాణాన్ని భారతీయ రైల్వే కొనసాగిస్తోంది. ఇంత‌వ‌ర‌కూ భార‌తీయ రైల్వేలు దాదాపు 500 ట్యాంక‌ర్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు సుమారు 7900 మెట్రిక్ ట‌న్నుల ఎల్ఎంఒను బ‌ట్వాడా చేసింది.
గ‌త కొన్ని రోజులుగా ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ప్ర‌తి రోజూ దాదాపు 800 మెట్రిక్ ట‌న్నుల ఎల్ఎంఒను బ‌ట్వాడా చేస్తోంది.
ఆక్సిజ‌న్ ఎక్స్ ప్రెస్‌లు 20 రోజుల కింద నుంచి, అంటే 24 ఏప్రిల్ 2021న మ‌హారాష్ట్ర నుంచి 120 మెట్రిక్ ట‌న్నుల ఎల్ఎంఒను బ‌ట్వాడా చేయ‌డం ద్వారా త‌న అంద‌చేత‌ల‌ను ప్రారంభించింది.
కేవ‌లం 20రోజుల‌లో రైల్వేలు ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ కార్య‌క‌లాపాల‌ను 12 రాష్ట్రాల‌కు దాదాపు 7900 మెట్రిక్ ట‌న్నుల ద్ర‌వ‌రూపంలోని ఆక్సిజ‌న్ ను బ‌ట్వాడా చేయ‌డం ద్వారా పెంచింది.
దేశం న‌లుమూల‌లా ప్ర‌యాణిస్తూ, ప‌శ్చిమంలోని హాపా& ముంద్రా,  తూర్పులో ఉన్న రూర్కెలా, దుర్గాపూర్‌, టాటాన‌గ‌ర్‌, అంగల్ వంటి ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్ ను తీసుకొని ఉత్త‌రాఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఎంపి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ్‌నాడు, హ‌ర్యానా, తెలంగాణ‌, పంజాబ్‌, కేర‌ళ‌, ఢిల్లీ, యుపి వంటి రాష్ట్రాల‌కు బ‌ట్వాడా చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మాన్ని సంక్లిష్ట కార్య‌క‌లాప మార్గానికి ప్ర‌ణాళిక‌లు వేసుకొని నిర్వ‌హిస్తోంది.
సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఆక్సిజ‌న్ స‌హాయం అందించేందుకు రైల్వేలు ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ స‌రుకు ర‌వాణా రైళ్ళ‌ను న‌డిపేందుకు నూత‌న ప్ర‌మాణాలు, ముందెన్న‌డూ లేని  బెంచ్ మార్కుల‌ను సృష్టిస్తోంది. కీల‌క‌మైన ఈ స‌రుకు ర‌వాణా రైళ్ళు దీర్ఘ దూరాలు వెళ్ళేట‌ప్పుడు స‌గ‌టే వేగం గంట‌కు 55 కిలోమీట‌ర్ల‌కుపైన ఉంటుంది. అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన గ్రీన్ కారిడార్‌లో అత్యంత ప్రాధాన్య‌త భావ‌న‌తో న‌డిపేట‌ప్పుడు, వివిధ జోన్ల‌కు చెందిన కార్యాచ‌ర‌ణ బృందాలు ఆక్సిజ‌న్ గ‌మ్యానికి అతిత‌క్కువ స‌మ‌యంలో చేరుకునేందుకు రోజులో 24 గంట‌లూ అత్యంత స‌వాళ్ళ‌ను ఎదుర్కొనే ప‌రిస్థితుల్లో ప‌ని చేస్తున్నారు. సిబ్బంది వివిధ సెక్ష‌న్ల‌లో మారుతుండ‌డంతో సాంకేతిక నిలుపుద‌లలు ఒక నిమిషానికి త‌గ్గాయి. 
ఆక్సిజ‌న్ రైళ్ళు నిరాటంకంగా ప‌రుగులు తీసేందుకు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప‌ట్టాల‌ను ఆటంకాలు లేకుండా ఉంచుతున్నారు.
ఇత‌ర స‌రుకు ర‌వాణా వేగం త‌గ్గ‌కుండా ఉండే విదంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
విడుద‌ల సిద్దం అవుతుండ‌డంతో, ఆంధ్ర ప్ర‌దేశ్ కేర‌ళ రాష్ట్రాల‌కు తొలి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు 40 మెట్రిక్ ట‌న్నులు, 118 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ మోసుకుని వెళ్తున్నాయి. 
త‌మిళ‌నాడుకు తొలి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ 80 ఎంటిల ఆక్సిజ‌న్‌ను శుక్ర‌వారం బ‌ట్వాడా చేసింది, రెండ‌వ ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ బ‌య‌లుదేరింది.
ఇప్ప‌టి వ‌ర‌కూ 130 ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ త‌మ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకుని, వివిధ రాష్ట్రాల‌కు ఉప‌శ‌మ‌నాన్ని క‌ల్పించాయి.
ఆక్సిజ‌న్ కోరుతున్న రాష్ట్రాల‌కు సాధ్య‌మైనంత త‌క్కువ స‌మ‌యంలో సాధ్య‌మైనంత ఎల్ఎంఒను బ‌ట్వాడా చేసేందుకు భార‌తీయ‌ రైల్వేలు కృషి చేస్తోంది.
ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డే స‌మ‌యానికి, 462 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను మ‌హ‌రాష్ట్ర‌లో దించ‌గా, 2210 ఎంటిలు యుపిలో, 408 ఎంటీలు ఎంపిలో, 1228 ఎంటీలు హ‌ర్యానాలో, 308 ఎంటిలు తెలంగాణ‌లో, 72 ఎంటీలు రాజ‌స్థాన్‌లో, 120 ఎంటీలు క‌ర్నాట‌కలో, 80 ఎంటీలు ఉత్త‌రాఖండ్‌లో, 80 ఎంటీలు త‌మిళ‌నాడులో, 2934 ఎంటీల‌కు పైగా ఢిల్లీలో దించాయి. 
తాజా ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేయ‌డం అనేది క్రియాశీల వ్యాయామం, గ‌ణాంకాలు ఎప్ప‌టిక‌ప్పుడూ తాజా ప‌రుస్తున్నారు. ఆక్సిజ‌న్ నింపిన ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు త‌మ ప్ర‌యాణాన్ని ఈ రాత్రి నుంచి ప్రారంభించ‌నున్నాయి. 
ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే ప్రాంతాల‌కు భిన్న‌మైన మార్గాల‌ను సిద్ధం చేసి, రాష్ట్రాల‌కు అవ‌స‌రం త‌లెత్తుతున్న‌ప్పుడు ప్ర‌యాణానికి సిద్ధంగా రైల్వేలు సిద్ధంగా ఉంది. ఎల్ఎంఒను తీసుకువ‌చ్చేందుకు రాష్ట్రాలు భార‌తీయ రైల్వేకు ట్యాంక‌ర్ల‌ను అందిస్తున్నాయి.

 

****


(Release ID: 1718769) Visitor Counter : 171