ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వాక్సిన్ సేకరణ, లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం

దేశంలో వాక్సిన్ మరింత ఎక్కువగా అందుబాటులో వచ్చేలా చూడడానికి అనువైన వాతావరణం సృష్టించిన ప్రభుత్వ విధానాలు

Posted On: 13 MAY 2021 5:41PM by PIB Hyderabad

దేశంలో వాక్సిన్ కొరత లేకుండా చూడడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవాక్సీన్ టీకాలను ఎక్కువ పరిమాణంలో సేకరించి మరింత ఎక్కువగా అందుబాటులో ఉండే విధంగా చూడడానికి సరళీకృత విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.  కొవాక్సీన్ ఉత్పత్తికి లైసెన్సులు జారీ చేయడం, సాంకేతిక బదిలీ అంశాలలో జాప్యం జరుగుతుందంటూ కొన్ని పత్రికల్లో ఒక ట్వీట్ ఆధారం చేసుకొని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్-19 వాక్సిన్ అందుబాటులో వచ్చేలా చూడడానికి విదేశాల్లో అభివృద్ధి చేయబడి ఉత్పత్తి అవుతూ అత్యవసర వినియోగానికి అమెరికా జాతీయ నియంత్రణలు, యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్  అనుమతి పొందిన  లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న వాక్సిన్ లను భారతదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు అవుతున్నాయి. . డ్రగ్స్, క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019 లోని రెండవ షెడ్యూల్ ప్రకారం సూచించిన నిబంధనల ప్రకారం ముందస్తు స్థానిక క్లినికల్ ట్రయల్ నిర్వహించే స్థానంలో పోస్ట్-అప్రూవల్ సమాంతర బ్రిడ్జింగ్ క్లినికల్ ట్రయల్ కోసం ఇది అందిస్తుంది. విదేశీ వ్యాక్సిన్ల కు   సులువుగా వేగంగా అనుమతులు జారే చేయడానికి  గతంలో అనుసరించిన విధానాలు, నిబంధనల్లో  డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) మార్పులు తీసుకొని వచ్చింది. 

దీనివల్ల  కోవిడ్ -19 వ్యాక్సిన్ల ను సులభంగా దిగుమతి చేసుకొని దేశంలో వ్యాక్సిన్ల లభ్యతను ఎక్కువ చేయడానికి అవకాశం కలుగుతుంది. 

 వ్యాక్సిన్ ధరలను సరళీకృతం చేయడం, వ్యాక్సిన్ తయారీదారులను వారి ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి ప్రోత్సహించి నూతన  టీకా తయారీదారులను లక్ష్యంతో “లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ -19 టీకా స్ట్రాటజీ” రూపొందింది.  వ్యాక్సిన్ల ధర, సేకరణ మరియు నిర్వహణను  మరింత సరళంగా చేసి  వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు దేశంలో వ్యాక్సిన్ల విస్తృత లభ్యతకు ఈ విధానం దోహదపడుతుంది. 

కోవిడ్ -19 వ్యాక్సిన్  దేశీయ ఉత్పత్తిని పెంచే విధానంలో భాగంగా  ప్రభుత్వ వ్యాక్సిన్ తయారీదారులతో టెక్నాలజీ బదిలీ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలను (పిఎస్‌యు)  ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకొంటున్నది.  సాంకేతిక బదిలీకి భారత్ బయోటెక్ తో రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు- ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) మరియుబిబిసిఒఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్ బయోటెక్ తో  రాష్ట్ర ప్రభుత్వ సంస్థ  హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ సాంకేతిక బదిలీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సాంకేతిక బదిలీ ఒప్పందాలకు  కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందించింది. వాక్సిన్ ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడు సంస్థలను ఆర్ధిక సహకారాన్ని కూడా అందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సెప్టెంబర్ 2021 నుంచి, హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ మరియు బిబిసిఒఎల్ నవంబర్ 2021 నుంచి  కోవాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తాయి.

సాంకేతిక బదిలీ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్ బయోటెక్ మరికొన్ని పిఎస్‌యులు ప్రైవేట్ల సంస్థలతో చర్చలు ప్రారంభించింది. దీనివల్ల దేశంలో కోవాక్సిన్ ఉత్పత్తిని మరింత పెరుగుతుంది. 

కొత్త విధానం ప్రకారం  వాడటానికి సిద్ధంగా ఉన్న  విదేశీ వ్యాక్సిన్ భారత ప్రభుత్వ ఛానెల్ కాకుండా  రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులు మరియు పారిశ్రామిక సంస్థల ఆసుపత్రులు  దిగుమతి చేసుకోవడానికి100 శాతం డోసులు  అందుబాటులో ఉంటాయి. విదేశీ  వ్యాక్సిన్ తయారీదారులతో సహా ప్రైవేట్ తయారీదారులను దేశంలో ప్రోత్సహించడానికి  ధరల పరంగా కూడా లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ -19 టీకా స్ట్రాటజీ  రూపొందింది. 

 భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసుకోవాలని  మోడరనా, ఫైజర్ మొదలైన విదేశీ వ్యాక్సిన్ తయారీదారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనివల్ల  ఈ టీకాలను సులభంగా దిగుమతి చేసుకొని భారతదేశంలో అందుబాటులోకి వస్తాయి.  

 అదే సమయంలో, కోవిడ్ -19 వ్యాక్సిన్ల పై  ఐపిఆర్ ను మాఫీ చేయాలని  భారత ప్రభుత్వం మిత్ర దేశాలను కోరుతోంది.  ప్రభుత్వం అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం వల్ల కోవిడ్ -19 వ్యాక్సిన్లను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సులభంగా లభిస్తాయి.

***(Release ID: 1718402) Visitor Counter : 113