పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్‌పై పోరాటంలో తమ వంతుగా అత్యవసర వైద్య సామాగ్రిని ఆటంకాలు లేకుండా బట్వాడా చేస్తున్న భుబనేశ్వర్ విమానాశ్రయం
మొత్తం 156 ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు, 526 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 140 ఆక్సిజన్ సిలెండర్ల రవాణా
కోవిడ్ వాక్సినేషన్ శిబిర నిర్వహణ
Posted On:
13 MAY 2021 12:50PM by PIB Hyderabad
కోవిడ్19కి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ప్రతిరోజూ దేశంలోని విమానాశ్రయాలు అత్యవసర వైద్య సామాగ్రి, పరికరాలను దేశం నలుమూలలకు రవాణా చేస్తున్నాయి. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన భుబనేశ్వర్ విమానాశ్రయం, దాని భాగస్వాములు 24 x 7 వైద్య పరకరాలు, సామాగ్రిని నిరాటంకంగా రవాణా చేసే సౌకర్యాన్ని కల్పించడంలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.
భుబనేశ్వర్ విమానాశ్రయం ద్వారా 9మే, 2021వరకు మొత్తం 669 డబ్బాల (20.53 మెట్రిక్ టన్నుల) కోవిడ్ వాక్సిన్ ను వివిధ ఎయిర్ లైన్స్ ద్వారా రవాణా చేశారు. దేశంలోని ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించేందుకు మొత్తం 156 ఖాళీ ఆక్సిజన్ ట్యాంకులను, 526 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, 140 ఆక్సిజన్ సిలెండర్లను సి17, సి130జె, ఎఎన్32 వంటటి 75 భారతీయ వైమానిక దళ విమానాలు 23 ఏప్రిల్ 2021 నుంచి 11 మే 2021 వరకు రవాణా చేశాయి. వివిధ ఎయిర్‌లైన్ల ద్వారా 41 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా రవాణా చేశారు. ప్రస్తుతం 10లీటర్ల సామర్ధ్యం గల 3500 సియామ్‌లెస్ సిలెండర్లను, 46.2 లీటర్ల సామర్ధ్యం గల 1520 సియామ్‌లెస్ సిలెండర్లను రవాణా చేయానున్నారు. ఒకవారంలో విదేశాల నుంచి పంపిన సరుకు వస్తుందని అంచనా.
ఈ కార్యకలాపాలే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించేందుకు అవసరమైన కోవిడ్ 19 సంబంధిత మార్గదర్శకాలను, ప్రోటోకాళ్ళను భుబనేశ్వర్ విమానాశ్రయం అనుసరిస్తోంది. ప్రజలు గుమి గూడకుండా, దఫాలవారీగా సమయాన్ని పాలన చేస్తూ కోవిడ్‌కు తగిన ప్రవర్తనను ఎల్లప్పుడూ అనుసరించవలసిందిగా ప్యాసెంజర్లకు, భాగస్వాములకు, సందర్శకులకు, ఉద్యోగులకు విమానాశ్రయ సిబ్బంది నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది. కోవిడ్ కు తగిన ప్రవర్తన గురించి చైతన్యాన్ని కలిగించేందుకు, తద్వారా ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇచ్చేందుకు, విమానాశ్రయంలో టెర్మినళ్ళ వద్ద వివిధ ఎలక్ట్రానిక్, శాశ్వత డిస్ల్పేల ద్వారా సూచనలను ప్రదర్శిస్తోంది.
అన్ని విమానాశ్రయాలు తమకు సాధ్యమైనంతగా యుద్ధంలో భాగస్వాములయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. భుబనేశ్వర్ విమానాశ్రయం ఎఎఐ సిబ్బందికి, ఇతర భాగస్వాములకు ఒడిషా ప్రభుత్వ సహాయ సహకారాలతో అన్ని రక్షణ చర్యలనూ పరిగణనలోకి తీసుకుని కోవిడ్ వాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించింది.
****
(Release ID: 1718294)
Visitor Counter : 214