ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పిఎం కేర్స్ కింద వెంటిలేటర్ల సరఫరాపై తాజా సమాచారం


మౌలికసదుపాయాల పెంపుతో సమర్థవంతమైన కోవిడ్ చికిత్సకు దోహదం చేసిన మేడిన్ ఇండియా వెంటిలేటర్లు

లోపరహిత నిర్వహణకు తయారీదారుల సాంకేతిక సహకారం

Posted On: 13 MAY 2021 10:00AM by PIB Hyderabad

నిరుటి నుంచి కోవిడ్ బాధితులకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థవంతమైన చికిత్స అందించే విధంగా భారత ప్రభుత్వం వాటికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వస్తోంది. ఇప్పుడున్న ఆస్పత్రి మౌలిక సదుపాయాలకు తోడుగా కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత కొనుగోళ్ళ ద్వారావెంటిలేటర్లు సహా  అత్యవసర వైద్య పరికరాలు కొనుగోలు చేసి రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు పంపిణీచేస్తోంది.  

 

అయితే పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ జిజిఎస్ వైద్య కళాశాలకు పిఎం కేర్స్ ద్వారా కొనుగోలు చేసి భారత ప్రభుత్వం పంపిణీ చేసిన వెంటిలేటర్లు సాంకేతిక కారణాల వలన పనిచేయకపోవటంతో నిరుపయోగంగా తయారయ్యాయని కొన్ని వార్తలు వెలువడ్డాయి. వాటిని అమ్మిన సంస్థలు అమ్మకానంతర సేవలు అందించటంలో విఫలమైనందువల్లనే అలాంటి పరిస్థితి ఏర్పడినట్టు ఆ వార్తల్లో ఆరోపించారు. అయితే, ఈ వార్తలు నిరాధారమైనవిగానీ విషయంలో తగిన సమాచారం లేకుండానే ప్రచురించినట్టుగానూ కనబడుతోంది.

నిరుడు ఈ సంక్షోభం మొదలైనప్పుడు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలోనూ వెంటిలేటర్లు చాలా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండేవి. పైగా వెంటిలేటర్ల తయారీ కూడా దేశంలొ నామమాత్రంగానే ఉండేది. విదేశీ తయారీదారులు సైతం భారతదేశానికి పెద్ద సంఖ్యలో ఎగుమతి చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. ఆ సమయంలోనే స్థానిక తయారీదారులను మేకిన్ ఇండియా వెంటిలేటర్ల తయారీకి ప్రోత్సహించటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎతున దేశ అవసరాలు తీర్చటానికి మార్గం ఏర్పడింది. వాళ్లలో చాలామందొ మొదటి సారిగా వెంటిలేటర్ల తయారీ చేపట్టారు. అందువల్లనే అందుబాటులో ఉన్న అతికొద్ది సమయంలోనే ఆ వెంటిలేటర్లను ఆ రంగంలో నిష్ణాతులైన వారిచేత క్షుణ్ణంగా పరిశీలింపజేసి, సాంకేతికంగా పరీక్షించటం ద్వారా, రోగులమీద ప్రయోగాత్మకంగా వాడిన మీదటే ఆమోదించటం జరిగింది. ఆ తరువాతనే వాటిని వాడకంలో పెట్టారు.

కొన్ని రాష్టాలకు ఈ వెంటిలేటర్లు పంపినప్పటికీ వాటిని ఇంకా వాటి ఆస్పత్రులలో అమర్చుకోలేదు. గత 4-5 నెలలుగా కనీసం 50 వెంటిలేటర్లు ఇంకా అమర్చుకోని రాష్టాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి 20212 ఏప్రిల్ 11న లేఖ రాశారు. త్వరగా అమర్చుకోవటం ద్వారా వెంటికేటర్లను వాడకం లోకి తెచ్చుకోవాలని ఆలేఖలో సూచించారు.

ఎజివిఎ సంస్థ తయారు చేసిన 80 లో 71 వెంటిలేటర్లు పనిచేయటం లేదని, అవి పంజాబ్ లొని ఫరీద్ కోట్ జిజిఎస్ వైద్య కళాసాలలొ వృధాగా పడి ఉన్నాయని ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలకు సంబంధించి వాస్తవాలు ఇలా ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) 88 వెంటిలేటర్లు, ఎజివిఎ 5 వెంటిలేటర్లు పంజాబ్ లోని జిజిఎస్ కాలేజ్ కి సరఫరా చేశాయి. వాటిని విజయవంతంగా నెలకొల్పి  పరీక్షించిన తరువాత ఆస్పత్రి అధికారులు అంతిమ ఆమోద ధృవపత్రం ఇచ్చారు.  

బిఇఎల్ సంస్థ తాను అందజేసిన వెంటిలేటర్లలో ఎలాంటి లోపమూ లేదని, మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేసింది. గతంలో వారి సిబ్బంది వేరు వేరు సందర్భాలలో ఆ కళాశాలను సందర్శించి. చిన్న చిన్న మరమ్మతులు కూడా తక్షణమే చేసినట్టు పేర్కొంది. అక్కడి సిబ్బందికి కూడా వాటి పనితీరును ప్రయోగాత్మకంగా చూపినట్టు స్పష్టం చేసింది.

అయితే, జిజిఎస్ వైద్య కళాశాల ఆస్పత్రిలో కేంద్ర ఆక్సిజెన్ గొట్టాలలో తగినంత పీడనం లేకపోవటం వంటి సమస్యలు ఉన్నట్టు తెలిసింది.  పైగా, ఫ్లో సెన్సార్లు, బాక్టీరియా ఫిల్టర్లు. హెచ్ ఎం ఇ ఫిల్టర్ల వంటి ముఖ్యమైన విడి భాగాలను ఆస్పత్రి అధికారులు మార్చకపోవటం లాంటి లోపాలను కూడా గుర్తించారు. సరైన పీడనాన్ని నిర్వహించకపోవటం, విడి పరికరాల వాడకం తగినట్టు ఉండేలా చూడటం చాలా కీలకం. ఇవి సక్రమంగా లేనప్పుడు సివి 200 వెంటిలేటర్లు సరిగా పనిచేయకపోవచ్చు.

పైగా, బిఇఎల్ ఇంజనీర్లు 12వ తేదీన మళ్ళీ జిజిఎస్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి వారు చూసుకోవాల్సిన చిన్న చిన్న పరికరాలను మార్చటం ద్వారా ఐదు వెంటిలేటర్లను పనిలో పెట్టారు.  ఆస్పత్రి అధికారుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. సరిగా నడిపితే బాగా పనిచేస్తాయని, వెంటిలేటర్ల పనితీరు విశ్వసనీయమైనదని తేల్చారు.

పైగా ఆ వెంటిలేటర్లతోబాటు ఇచ్చిన యూజర్ మాన్యువల్ లోనే అన్ని మార్గదర్శకాలూ ఉన్నాయని, దాని వాడకానికి అవసరమైన మౌలిక సదుపాయాల గురించి, నిర్వహణ గురించి కూడా ఉన్నదని స్పష్టం చేశారు. అయితే చాలా పంజాబ్ లోని చాలా ఆస్పత్రులలో వాటిని పాటించకపోగా, సమస్య వెంటిలేటర్లలో ఉన్నట్టు చెప్పటం అర్థరహితమని పేర్కొన్నారు. బిఇఎల్ క్రమం తప్పకుండా ఈ సంక్షోభ సమయంలో అవసరమైన పూర్తి సాంకేతిక సహకారం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

అదే సమయంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మే 9న అన్ని రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాస్తూ వెంటిలేటర్ల తయారీదారుల హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తెలియజేశారు. వెంటిలేటర్లమీద అతికించిన స్టిక్కర్లలో కూడా ఆ నెంబర్లు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రాలవారీ వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఈ సమాచారం ఉందన, ఆయా నోడల్ అధికారులకు సమాచారం ఇచ్చామని, సాంకేతిక సమస్యలకు పరిష్కారం కోరేందుకు అది అనువిఉగా ఉంటుందని తెలియజేశారు. తయారీదారుల ఈ మెయిల్ ఐడి లు కూడా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చారు. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012T8U.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020IE6.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WC29.jpg

***


(Release ID: 1718234) Visitor Counter : 245