రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సముద్రసేతు-2లో భాగంగా ఖతార్ నుంచి వైద్య ఆక్సిజన్ తీసుకొచ్చిన ఐఎన్‌ఎస్ తార్కాష్
प्रविष्टि तिथि:
12 MAY 2021 5:32PM by PIB Hyderabad
భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ సముద్రసేతు-2లో భాగంగా, ఖతార్ నుంచి వైద్య సామగ్రి సాయాన్ని ఐఎన్‌ఎస్ తార్కాష్ తీసుకొచ్చింది. నౌకలో వచ్చిన సరకులో, 20 మె.ట. చొప్పున రెండు క్రయోజెనిక్ కంటైనర్లలో 40 మె.ట. ద్రవరూప వైద్య ఆక్సిజన్, 230 ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి.
"ఆక్సిజన్ సంఘీభావ వారధి"లో భాగంగా "ఫ్రెంచ్ మిషన్" ఆక్సిజన్ కంటైనర్లను పంపగా, ఖతార్‌లో నివశిస్తున్న భారతీయులు ఆక్సిజన్ సిలిండర్లను బహుమతిగా అందించారు.
మహారాష్ట్ర అధికార యంత్రాంగానికి వీటిని నౌకాదళం అప్పగించింది.

***
(रिलीज़ आईडी: 1718168)
आगंतुक पटल : 269