మంత్రిమండలి
ఉత్పత్తితో లంకె కలిగిన ప్రోత్సాహక పథకమైన నేషనల్ ప్రోగ్రాం ఆన్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ పథకాన్ని ఆమోదించిన కేబినెట్
Posted On:
12 MAY 2021 3:29PM by PIB Hyderabad
మొత్తం రూ.18,100 కోట్ల వ్యయంతో ఎసిసికి సంబంధించి గంటకు యాభై గిగావాట్ల, సముచిత ఎసిసి నుంచి గంటకు ఐదు గిగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించేందుకు ఉత్పత్తితో లంకె కలిగిన ప్రోత్సాహ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ -పిఎల్ ఐ) పథకమైన, అత్యాధునిక కెమికల్ సెల్ (ఎసిసి) బ్యాటరీ స్టోరేజ్ పథకాన్ని అమలు చేయాలన్న భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది.
ACC లు నూతన తరం అధునాతన నిల్వ సాంకేతికతలు, ఇవి విద్యుత్ శక్తిని ఎలక్ట్రోకెమికల్ లేదా రసాయన శక్తిగా నిల్వ చేయగలగడమే కాక అవసరమైనప్పుడు దానిని తిరిగి విద్యుత్ శక్తిగా మార్చగలవు. బాటరీని భారీగా వినియోగించే రంగాలైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, అదునాతన విద్యుత్ గ్రిడ్లు, సోలార్ రూఫ్ టాప్ (ఇంటిపైన) తదితరాలన్నీ కూడా రానున్న సంవత్సరాలలలో భారీ వృద్ధిని సాధించగలవని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వృద్ధి రంగాలను ఆధిపత్య బ్యాటరీ సాంకేతికతలు నియంత్రరిస్తాయని అంచనావేస్తున్నారు.
అంతర్జాతీయ సగటుతో పోల్చినప్పుడు సౌకర్యాల సామర్ధ్యం తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పటికే పలు కంపెనీలు బ్యాటరీ పాక్ లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. అయితే, ఇది భారతదేశంలోని ఎసిసిలకు అదనపు విలువను ఆపాదించడంలో, ఉత్పత్తి పరంగా చూసినప్పుడు అతి తక్కువ పెట్టుబడి. భారత దేశంలో నేటివరకూ ఉన్న ఎసిసి డిమాండ్‌ను ప్రస్తుతం దిగుమతుల ద్వారా తీరుస్తున్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) బాటరీ స్టోరేజ్ అన్నది దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అది ఆత్మనిర్భర్ భారత్ చొరవకు కూడా తోడ్పడుతుంది. ఎసిసి బ్యాటరీ నిల్వ తయారీదారులను పారదర్శక పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఉత్పాదక కేంద్రంలో రెండేళ్ళలోపు ఉత్పత్తి ప్రారంభించాలి. తర్వాత, ఐదేళ్ళ కాలంలో ప్రోత్సహకాన్ని చెల్లించడం జరుగుతుంది.
4. పెరిగిన నిర్దిష్ట శక్తి సాంద్రత & సైకిళ్ళు, స్థానిక విలువ పెరుగుదలతో ప్రోత్సాహక మొత్తం పెరుగుతుంది.
ఎంపిక చేసిన ప్రతి ఎసిసి బ్యాటరీ స్టోరేజ్ తయారీదారు కనీసం గంటకు ఐదు (5) గిగావాట్ సామర్థ్యం కలిగిన ఎసిసి తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉండడమే కాక, ఐదేళ్ళలోపు ప్రాజెక్ట్ స్థాయిలో కనీసం 60% దేశీయ విలువ అదనంగా ఉండేలా చూడాలి.
ఇంకా, లబ్ధిదారుల సంస్థలు మదర్ యూనిట్ వద్ద, ఇంటిగ్రేటెడ్ యూనిట్ విషయంలో లేదా ప్రాజెక్ట్ స్థాయిలో, "హబ్ & స్పోక్" నిర్మాణం విషయంలో 5 సంవత్సరాలలో 60% దేశీయ విలువ అదనంగా పెంచడమే కాక కనీసం 25% దేశీయ విలువ చేరికను సాధించాలి. రెండు సంవత్సరాలలో (మదర్ యూనిట్ స్థాయిలో) తప్పనిసరిగా రూ .225 కోట్లు /గంటకు గిగావాట్ల పెట్టుబడి పెట్టాలి.
ఈ పథకం నుంచి అంచనా వేస్తున్న ఫలితాలు/ లాభాలు దిగువన పేర్కొన్న విధంగా ఉండవచ్చుః
ఈ పథకం కింద భారతదేశంలో గంటకు 50 గిగావాట్ల సంచిత ఎసిసి తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడం.
ఎసిసి బ్యాటరీ స్టోరేజ్ ఉత్పత్తి ప్రాజెక్టులలో సుమారు రూ.45,000 కోట్ల ప్రత్యక్ష పెట్టుబడి.
భారతదేశంలో బ్యాటరీ స్టోరేజ్ కోసం డిమాండ్ సృష్టించడాన్ని సులభతరం చేయడం.
మేక్ -ఇన్-ఇండియాను సులభతరం చేయడంః దేశీయ విలువ-సంగ్రహణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం.ఈ కార్యక్రమ కాలంలో చమురు దిగుమతి బిల్లుల తగ్గింపుతో చేసిన రూ.2,00,000 కోట్ల నుంచి రూ. 2,50,000 కోట్ల ఈవీని అందిపుచ్చుకోవడంతో నికరంగా ఆదా చేయవచ్చు. ఎందుకంటే, ఈ పథకం కింద ఉత్పత్తి చేసే ఎసిసి ఎక్కువగా ఈవీని ఎక్కువగా అవలంబిస్తాయని భావిస్తున్నారు.
ఎసిసిల ఉత్పత్తి ఈవీల డిమాండ్ ను సులభతరం చేస్తుంది. ఇవి చెప్పుకోతగినంత తక్కువగా కాలుష్యాన్ని వెలువరిస్తాయని రుజువైంది.
భారతదేశం పునరుత్పాదక ఇంధన అజెండాను అనుసరిస్తున్నందున, భారత దేశ హరిత ఉద్గారాలను తగ్గించడంలో ఎసిసి కార్యక్రమం కీలకంగా దోహదం చేయనుంది. ఇది పర్యావరణ మార్పును ఎదుర్కోవాలన్న భారతదేశ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.
ప్రతి ఏడాదీ సుమారు రూ .20,000 కోట్ల దిగుమతి ప్రత్యామ్నాయం.
నిర్ధిష్ట శక్తి సాంద్రతను, ఎసిసి ఆవృతాలను సాధించేందుకు పరిశోధన, అభివృద్ధికి ప్రేరణ.
నూతన, సముచిత సెల్ సాంకేతికతలకు ప్రోత్సాహం.
***
(Release ID: 1718076)
Visitor Counter : 336
Read this release in:
Punjabi
,
Bengali
,
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada