రైల్వే మంత్రిత్వ శాఖ

ఉపశమనం అందిస్తున్న ఇండియన్ రైల్వేకు చెందిన 100 వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్


100 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా పంపిణీ చేయబడిన 6260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్


ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నిన్న దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశవ్యాప్తంగా పంపిణీ చేశాయి


ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఎంపి, హర్యానా, తెలంగాణ, రాజస్థాన్,ఢిల్లీ మరియు యుపిలకు ఉపశమనం


డెహ్రాడూన్ మరియు పూణేలకు మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నిన్న రాత్రి 120 ఎంటీ & 55 ఎంటీ మెడికల్ ఆక్సిజన్‌తో చేరుకున్నాయి


మహారాష్ట్రకు 407 మెట్రిక్ టన్నులు, యూపీకు దాదాపు 1680 మెట్రిక్ టన్నులు, ఎంపికు 360 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 939 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 123 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 40 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 120 మెట్రిక్ టన్నులు మరియు ఢిల్లీకు 2404 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఆక్సిజన్ తరలింపు

Posted On: 12 MAY 2021 3:52PM by PIB Hyderabad

అన్ని అడ్డంకులను అధిగమించి కొత్త పరిష్కారాలను కనుగొనే భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత రైల్వే 396 ట్యాంకర్లలో దాదాపు 6260 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.


నిన్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను జాతికి అందించాయి.

100 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయి.

కొరుకున్న రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎల్‌ఎంఓను అందించడానికి భారత రైల్వే ప్రయత్నిస్తోంది.

ఈ విడుదల సమయం వరకు, మహారాష్ట్రకు 407 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓ, యుపికు దాదాపు 1680 మెట్రిక్ టన్నులు, ఎంపీకు 360 ఎంటి, హర్యానాకు 939 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 123 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 40 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 120 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకు 2404 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను పంపిణీ చేశాయి.

ఉత్తరాఖండ్‌కు తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ గత రాత్రి జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో చేరుకుంది.

పూణేకు కూడా  గత రాత్రి అంగుల్ (ఒడిశా) నుండి 55 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ చేరుకుంది.

ఆక్సిజన్‌ను అందించడం చాలా వేగంతో కూడుకున్న కసరత్తు. మరియు గణాంకాలు ఎప్పటికప్పుడు నవీకరించబడతాయి. మరింత లోడ్ చేయబడిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రాత్రి తరువాత వాటి ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.

***



(Release ID: 1718064) Visitor Counter : 171