పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువు సంస్థలు ఐఎస్ఓ ప్రమాణాలు ఉన్న కంటైనర్లు మరియు సిలిండర్ల కొనుగోలు కోసం ఆర్డర్లు

Posted On: 11 MAY 2021 4:06PM by PIB Hyderabad

ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ ను రవాణా చేసే అంశంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి చమురు సహజ వాయువుల మంత్రిత్వశాఖకు చెందిన చమురు, సహజవాయువు ప్రభుత్వ రంగ సంస్థలు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. సామజిక బాధ్యతగా ఈ సంస్థలు కోవిడ్-19 రెండవ దశను సమర్ధంగా ఎదుర్కొనే అంశంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ముందుకు వస్తున్నాయి. ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ ను రవాణా చేసే అంశంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ఈ సంస్థలు దృష్టి సారించాయి.

ప్రస్తుతం 650 ఎంటీల సామర్ధ్యం ఉన్న 12 ట్యాంకర్లు, ఐఎస్ఓ ప్రమాణాలు ఉన్న 20 కంటైనర్లు ఉన్నాయి. వీటి సంఖ్య త్వరలో గణనీయంగా పెరగనున్నది. ఈ నెలాఖరుకి ట్యాంకర్ల సంఖ్య 26కి, ఐఎస్ఓ ప్రమాణాలు కలిగిన కంటైనర్ల సంఖ్య 117కి చేరనున్నది. 2314 ఎంటీ సామర్ధ్యం కలిగి ఐఎస్ఓ ప్రమాణాలు ఉన్న 95 కంటైనర్లను సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. 650 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో ఐఎస్ఓ ప్రమాణాలు గల 30 కంటైనర్లకు ఇప్పటికే ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. మిగిలిన కంటైనర్ల కోసం చర్చలు జరుగుతున్నాయి.

40/50 లీటర్ల సామర్ధ్యం గల పదివేల సిలిండర్లు, ఎక్కువ సామర్ధ్యం గల 300 సిలిండర్లు (500 లీటర్ల 150 సిలిండర్లు, 450 లీటర్ల 150 సిలిండర్లు) కొనుగోలు కోసం ఆర్డర్లు ఉంచబడ్డాయి. ఈ సిలిండర్ల పంపకం త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ సంస్థలు లిక్విడ్ ఆక్సిజన్‌ను కూడా దిగుమతి చేసుకుంటున్నాయి. బహ్రెయిన్, యుఎఇ, సౌదీ అరేబియా, కువైట్ మరియు థాయిలాండ్ నుంచి గ్రాటిస్ ప్రాతిపదికన 900 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ దిగుమతి అవుతోంది.ఇప్పటికే దీనిలో కొంత భాగం వచ్చింది. మిగిలిన మొత్తం త్వరలో వచ్చే అవకాశాలు వున్నాయి. దీనికి అదనంగా వాణిజ్య ప్రాతిపదికన 12840 ఎంటీల ద్రవ ఆక్సిజన్ కూడా దిగుమతి అవుతోంది. దీనితో మొత్తం 13740 ఎంటీల మేరకు ఆక్సిజన్ దిగుమతి అవుతుంది.

***


(Release ID: 1717898) Visitor Counter : 251