రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ముఖ్యమైన వైద్య సామగ్రితో కొత్త మంగళూరు పోర్టుకు చేరుకున్న భారత నౌకాదళ నౌకలు కోచి, తబర్‌

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2021 6:40PM by PIB Hyderabad

కొవిడ్‌ ఉపశమన "ఆపరేషన్‌ సముద్రసేతు-2"ను ముమ్మరం చేస్తూ, భారత నౌకాదళానికి చెందిన మరో రెండు నౌకలు కోచి, తబర్‌ మంగళవారం కొత్త మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి. అతి ముఖ్యమైన వైద్య పరికరాలను అవి తీసుకొచ్చాయి.

    రెండు నౌకల్లో కలిపి, ఐదు కంటైనర్లలో 100 మె.ట. ద్రవరూప వైద్య ఆక్సిజన్‌, 1200 ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయి. కువైట్‌లో ఈ నెల 6న ఈ నౌకలు బయల్దేరాయి.

    తర్వాతి కార్యాచరణ కోసం ఈ సామగ్రిని "ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌"కు అప్పగించారు.

 

 

***


(రిలీజ్ ఐడి: 1717893) సందర్శకుల సూచీ సంఖ్య : : 205
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil