వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

భారతదేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 49,965 కోట్ల రూపాయలు నేరుగా బదిలీ (డిబిటి) చేయబడ్డాయి.


2020 ఏప్రిల్ నుండి 2021 ఏప్రిల్ వరకు కోవిడ్ -19 కాలంలో ఓ.ఎన్.ఓ.ఆర్.సి. (ఒక దేశం ఒక రేషన్ కార్డు) కింద 18.3 కోట్ల మేర జరిగిన పోర్టబిలిటీ లావాదేవీలు - పనిలో ఉన్న జనాభా మరియు వలసదారుల ద్వారా పెరిగిన వినియోగానికి అద్దం పడుతున్నాయి.

పి.ఎమ్‌.జి.కె.ఎ.వై-3 కింద, 2021 మే నెలలో, 34 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, ఎఫ్‌.సి.ఐ. డిపోల నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను వినియోగించుకున్నాయి.

పి.ఎమ్‌.జి.కె.ఎ.వై-3 కింద, 12 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా, ఇంతవరకు, లక్షకు పైగా మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను 2 కోట్లకు పైగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.

ఓ.ఎన్.ఓ.ఆర్.సి. పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 26.3 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదయ్యాయి.

పి.ఎమ్‌.జి.కె.ఏ.వై-3 మరియు ఓ.ఎన్.ఓ.ఆర్.సి. పథకాల గురించి, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశు పాండే, విలేకరులకు వ్యక్తులకు వివరించారు.

Posted On: 10 MAY 2021 5:28PM by PIB Hyderabad

పి.ఎం.జి.కె.-3 మరియు ఒక దేశం ఒక రేషన్వ కార్డు పథకాల గురించి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి, శ్రీ సుధాంశు పాండే ఈ రోజు, దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు.  “ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన” (పి.ఎమ్-జి.కె.ఏ.వై-III) గురించి, ఆయన, మాట్లాడుతూ, ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఏ. కి చెందిన,  అంత్యోదయ అన్న యోజన (ఏ.ఏ.వై) మరియు ప్రియారిటీ హౌస్‌హోల్డర్స్ (పి.హెచ్.హెచ్) అనే రెండు పధకాల పరిధిలో ఉన్న 80 కోట్ల మంది లబ్ధిదారులకు, మునుపటి మాదిరిగానే అదే పద్ధతిలో, వారికి సాధారణంగా ప్రతీ నెలా అందించే, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. అర్హతలకు అదనంగా ఒక్కొక్కరికీ, నెలకు 5 కిలోల చొప్పున, ఉచితంగా ఆహార ధాన్యాలు (బియ్యం/గోధుమ) అందించడం ద్వారా, తమ శాఖ, “ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన”  (పి.ఎమ్-జి.కె.ఏ.వై-III)  పధకాన్ని రెండు నెలల కాలానికి, అంటే 2021 మే, జూన్ నెలలకు గాను అమలుచేస్తున్నట్లు, తెలియజేశారు. ఆహార సబ్సిడీ, అంతర్ రాష్ట్ర రవాణా మొదలైన ఖర్చుల కోసం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర సహాయం రూపంలో 26,000 కోట్ల రూపాయల మేర మొత్తం ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుందని, ఆయన చెప్పారు. 

శ్రీ పాండే, ఈ సందర్భంగా, విలేకరులతో మాట్లాడుతూ, 2021 మే నెలలో షెడ్యూల్ ప్రకారం ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందని, తెలియజేశారు.  2021 మే నెల కోసం, 34 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, ఎఫ్‌.సి.ఐ. డిపోల నుండి, 2021 మే, 10వ తేదీ నాటికి, 15.55 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సేకరించగా, అందులో, ఒక లక్షకు పైగా మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను, 12 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా,  2 కోట్లకు పైగా లబ్ధిదారులకు, పంపిణీ చేసినట్లు, ఆయన చెప్పారు.  2021 మే మరియు జూన్ నెలలకు గాను, పి.ఎం.జి.కె.ఏ.వై-III కింద ఆహార ధాన్యాల పంపిణీని, జూన్ 2021 చివరి నాటికి పూర్తి చేయడానికి, దాదాపు అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయని, ఆయన అన్నారు.

అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ పధకానికి విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన అన్ని భద్రతా నియమ,నిబంధనలను పాటిస్తూ, ఎప్పటికప్పుడు జారీ చేసిన సలహాల ప్రకారం, పి.ఎమ్-జి.కే.ఏ.వై-III ఆహార ధాన్యాలను, ఈ-పి.ఓ.ఎస్. పరికరాల ద్వారా పారదర్శకంగా పంపిణీ చేసే విధంగా, తమ విభాగం, ఈ పధకాన్ని, నిరంతరం సమీక్షిస్తోందని, ఆయన, చెప్పారు.  ఆహార ధాన్యాల పంపిణీ పురోగతిని వ్యూహరచన చేసి, సమీక్షించడం కోసం, ఆహార శాఖ కార్యదర్శులు / రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో, డి.ఓ.ఎఫ్.పి.డి. కార్యదర్శి, 2021 ఏప్రిల్ 26వ తేదీన; సంయుక్త కార్యదర్శి (బి.పి,పి.డి), 2021 మే, 5వ తేదీన; దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాలు నిర్వహించారు.

‘ఒక దేశం ఒక రేషన్ కార్డు’ (ఓ.ఎన్.ఓ.ఆర్.సి) ప్రాముఖ్యత గురించి, ఆహారం, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి, నొక్కి చెబుతూ,  జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఏ) కింద, దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది, తమ శాఖ రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రణాళిక మరియు ప్రయత్నం అని అభివర్ణించారు. దేశంలో ఎక్కడ నుంచైనా, వలస లబ్ధిదారులు, వారి ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఏ. ఆహార ధాన్యాలు / ప్రయోజనాలను, ఎటువంటి అవరోధాలు లేకుండా సజావుగా పొందడానికి వీలుగా అధికారం కల్పించడమే, ఈ పధకం లక్ష్యమని, ఆయన వివరించారు.  ప్రస్తుతం, ఈ వ్యవస్థ, 32 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా కొనసాగుతూ, ఈ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 69 కోట్ల మంది లబ్ధిదారులకు (ఎన్.ఎఫ్.ఎస్. జనాభాలో 86 శాతం) ఈ పధకం ప్రయోజనం చేకూరుస్తోంది.

ఓ.ఎన్.ఓ.ఆర్.సి. పధకం, ఇప్పుడు 32 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, శ్రీ పాండే చెప్పారు. ఓ.ఎన్.ఓ.ఆర్.సి. పధకం కింద, ప్రతీ నెలా, సగటున 1.5 నుండి 1.6 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదౌతున్నాయని, ఆయన, తెలిపారు.  2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి, ఈ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో, అంతర్-రాష్ట్ర లావాదేవీలతో సహా, 26.3 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు, జరిగాయని, శ్రీ పాండే తెలియజేశారు.  కాగా, వీటిలో 2020, ఏప్రిల్ నుండి 2021 ఏప్రిల్ వరకు, కోవిడ్ -19 కాలంలో, దాదాపు 18.3 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదయ్యాయని, ఆయన చెప్పారు.  వలస లబ్ధిదారుల అవసరాలను ముందుగా తీర్చడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి సామర్థ్యంలో అమలు చేయడం కోసం, ఒక దేశం ఒక రేషన్ కార్డు (ఓ.ఎన్.ఓ.ఆర్.సి) ప్రణాళిక యొక్క సామర్థ్యాన్ని బట్టి, కోవిడ్-19 సంక్షోభ సమయంలో వలస ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లబ్ధిదారులకు ఎన్.ఎఫ్.ఎస్.ఏ. ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండేలా చూడటానికి, ఈ విభాగం, దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాలు / సూచనలు  / లేఖలు మొదలైన వాటి ద్వారా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం కృషి చేస్తోందని కూడా ఆయన తెలియజేశారు.  ఓ.ఎన్.ఓ.ఆర్.సి. ప్రణాళిక పై , విస్తృత ప్రచారం,  అవగాహన కల్పించాలని, ఈ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది.  ఇందుకోసం, తమ శాఖ, ఇటీవల ఎన్‌.ఐ.సి. సహకారంతో, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లబ్ధిదారుల ప్రయోజనం కోసం, ప్రత్యేకంగా వలస వచ్చిన ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లబ్ధిదారుల కోసం, 14445 అనే నెంబరు ఉచిత సేవతో పాటు, ‘మేరా రేషన్’ అనే మొబైల్ యాప్ లను ఇంగ్లీష్, హిందీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, గుజరాతీ వంటి తొమ్మిది వేర్వేరు భాషలలో, అభివృద్ధి చేసిందని, ఆయన వివరించారు.  "మేరా రేషన్ యాప్‌" లో మరిన్ని ప్రాంతీయ భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

2021-22 రబీ మార్కెటింగ్ సీజన్ లో సేకరణ సజావుగా కొనసాగుతోందనీ, 2021 మే, 9వ తేదీ నాటికి, మొత్తం 337.95 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించామనీ, శ్రీ పాండే తెలియజేశారు. కాగా, గత సంవత్సరం, ఇదే సమయానికి, 248.021 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు మాత్రమే సేకరించినట్లు, ఆయన చెప్పారు. అదేవిధంగా, గత ఏడాది 28.15 లక్షల మంది రైతులు లబ్ది పొందగా, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 34.07 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు కూడా ఆయన తెలిపారు.  భారతదేశ వ్యాప్తంగా, 19,030 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేపట్టినట్లు, ఆయన చెప్పారు.  హర్యానా, పంజాబ్ రైతులు కూడా ఎమ్.ఎస్.పి. పరోక్ష చెల్లింపుల నుండి నేరుగా ఆన్‌-లైన్ బదిలీ ద్వారా చెల్లింపు విధానానికి మారారనీ, దేశవ్యాప్తంగా రైతులు ఇప్పుడు తమ పంటల అమ్మకాల ప్రయోజనాలను, నేరుగా ప్రత్యక్ష బదిలీ ద్వారా పొందుతున్నారనీ, ఆయన వివరించారు. 

భారతదేశ వ్యాప్తంగా, గోధుమల సేకరణ కోసం, డి.బి.టి. చెల్లింపులో భాగంగా, ఇప్పటివరకు మొత్తం 49,965 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్లు, కార్యదర్శి, తెలియజేశారు.  ఇందులో భాగంగా, పంజాబ్‌ లో రైతులకు సుమారు 21,588 కోట్ల రూపాయలు, హర్యానాలో రైతులకు సుమారు 11,784 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు, ఆయన తెలిపారు.

కోవిడ్ క్లిష్ట సమయంలో ప్రజల ఉపశమనం కోసం, గోధుమ, బియ్యం నిల్వలను బహిరంగ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, భారత ప్రభుత్వం, 2021-22 సంవత్సరానికి ఓ.ఎం.ఎస్.ఎస్.(డి) విధానాన్ని సరళతరం చేసినట్లు, శ్రీ పాండే చెప్పారు.  ఆహార ధ్యాన్యాలు సేకరించని రాష్ట్రాల్లో ఓ.ఎం.ఎస్.ఎస్.(డి) కింద ఆహార ధాన్యాల విక్రయం ప్రారంభమైందనీ, ఇప్పటివరకు 2,800 మెట్రిక్ టన్నులు విక్రయించడం జరిగిందనీ, ఆయన, తెలియజేశారు.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, 1.4.2020 తేదీ నుంచి 31.3.2021 తేదీ వరకు, సుమారు 928.77 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు; 363.89 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు; 564.88 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, సెంట్రల్ పూల్ నుంచి, పంపిణీ చేసినట్లు కూడా ఆయన తెలియజేశారు.

వంట నూనెల ధరల పెరుగుదల గురించి అడిగిన ప్రశ్నకు శ్రీ పాండే సమాధానమిస్తూ, వంట నూనెల ధరలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు.  కోవిడ్ పరిస్థితుల కారణంగానూ, వివిధ ఏజెన్సీల క్లియరెన్స్ సంబంధిత పరీక్షల కారణంగానూ, నౌకాశ్రయాల్లో  కొన్ని నిల్వలు ఇరుక్కుపోయాయనీ, అయితే, ఈ సమస్య ఇప్పుడు పరిష్కారమయ్యిందనీ, త్వరలో స్టాక్స్ మార్కెట్లో విడుదలవుతాయనీ, తద్వారా, చమురు ధరల ప్రభావం సానుకూలంగా ఉంటుందనీ, ఆయన వివరించారు. 

చక్కెర రాయితీ గురించి అడిగిన మరో ప్రశ్నకు, శ్రీ పాండే సమాధానమిస్తూ, చక్కెర మరియు ఇథనాల్ పరిశ్రమతో సవివరమైన సమీక్ష కొనసాగుతున్నట్లు తెలియజేశారు.  ఈ ఏడాది ఇంతవరకు 7.2 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించామనీ, కాగా, ఈ ఏడాది చివరి నాటికి 8.5 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నామనీ, ఆయన చెప్పారు.  దేశంలోని 11 రాష్ట్రాలు ఇప్పటికే 9 నుండి 10 శాతం వరకు బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించాయనీ, కాగా, మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ దిశగా పనిచేస్తున్నాయనీ, ఆయన అన్నారు.

 

*****



(Release ID: 1717592) Visitor Counter : 164