వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రారంభించిన 10 రోజుల్లోనే పీఎం జీకే-3 కింద రెండు కోట్ల మంది లబ్ద్ధిదారులకు 12 రాష్ట్రాలు/ యూటీల్లో లక్ష ఎంటీలకు పైగా ఆహార ధాన్యాల సరఫరా


కోవిడ్ -19 మహమ్మారి సమయంలో 1.4.2020 నుంచి 31.3.2021 వరకు 928.77 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు, 363.89 ఎల్‌ఎమ్‌టి గోధుమలు మరియు 564.88 ఎల్‌ఎమ్‌టి బియ్యం పంపిణీ కోసం సెంట్రల్ పూల్ నుంచి విడుదల

పీఎం జీకే-3, ఒక దేశం ఒక రేషన్ కార్డ్ పథకాల వివరాలను మీడియాకు వివరించిన ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాన్షు పాండే

Posted On: 10 MAY 2021 7:07PM by PIB Hyderabad

పీఎం జీకే-3, ఒక దేశం ఒక రేషన్ కార్డ్  పథకాలు దేశంలో లక్ష్యాల మేరకు అమలు జరుగుతున్నాయని  ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాన్షు పాండే తెలిపారు. వర్చువల్ విధానంలో విలేకరులతో  మాట్లాడిన శ్రీ పాండే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎం జీకే-3) పథకాన్ని ఆహార ప్రజా పంపిణీ శాఖ  గతంలో అమలు చేసిన విధంగానే మరో రెండు నెలల పాటు 2021 మే, జూన్ నెలల్లో అమలు చేస్తున్నదని తెలిపారు. పథకం కింద ఎంఎఫ్ఎస్ఏ పరిధిలోకి వచ్చే దాదాపు 80 కోట్ల మంది అంత్యోదయ అన్న యోజన, ప్రాధాన్యతా గృహస్థులు లబ్ధిదారులకు మనిషికి అయిదు కేజీల చొప్పున వారికి సరఫరా చేయవలసిన మొత్తం కంటే ఎక్కువగా ఆహార ధాన్యాలు ( బియ్యం/గోధుమలు) ఉచితంగా అందిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆహార సబ్సిడీ కింద అందిస్తున్న 26,000 కోట్ల రూపాయలను కేంద్రం భరిస్తుందని అన్నారు. 

2021 మే నెలకు సంబంధించి పంపిణీ సజావుగా నిర్ణీత కార్యక్రమం ప్రకారం అమలు జరుగుతున్నదని శ్రీ పాండే వివరించారు. 2021 మే 10వ తేదీనాటికి భారత ఆహార సంస్థ గిడ్డంగుల నుంచి 34 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 15.55 ఎల్‌ఎమ్‌టిల ఆహార ధాన్యాలను తీసుకున్నాయని అన్నారు. వీటిలో 12 రాష్ట్రాలు/ యూటీలు రెండు కోట్ల మంది లబ్ధిదారులకు లక్ష ఎంటీల ఆహారధాన్యాలను పంపిణీ చేశాయని అన్నారు. 2021 జూన్ చివరి నాటికి మే, జూన్ నెలల ఆధార ధాన్యాల పంపిణీని పూర్తి చేయడానికి అన్ని రాష్ట్రాలు కార్యాచరణ కార్యక్రమాన్ని సిద్ధం చేశాయని ఆయన తెలిపారు. 

ఆహారధాన్యాలు సకాలంలో పారదర్శక విధానంలో పంపిణీ చేయడానికి అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో తమ మంత్రిత్వశాఖ సమీక్ష నిర్వహిస్తున్నది శ్రీ పాండే అన్నారు. పథకంపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించి కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ ఈపోస్ పరికరాల ద్వారా ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని సూచించామని అన్నారు. పథకం అమలు జరుగుతున్న తీరును సమీక్షించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆహార కార్యదర్శులు/ ప్రతినిధులతో 2021 ఏప్రిల్ 26వ తేదీన తిరిగి మే అయిదవ తేదీన సమావేశాలను నిర్వహించామని వివరించారు.  

ఒక దేశం ఒక రేషన్ కార్డు పధకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీ పాండే తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 కింద  దేశవ్యాప్త  రేషన్ కార్డుల పోర్టబిలిటీని ప్రవేశ పెట్టడానికి ఆహార ప్రజా పంపిణీ కార్యదర్శి వివరించారు. చట్టంలో తమకు కల్పించిన హక్కు ప్రకారం వలస కార్మికులు తమ ఆహార ధాన్యాలు/ ఇతర సౌకర్యాలను దేశంలో ఎక్కడైనా పొందడానికి ఈ పథకం వీలు కల్పిస్తుందని అన్నారు. ఈ వ్యవస్థ ప్రస్తుతం 32 రాష్ట్రాలు/ యూటీలలో 69 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిస్తూ అమలు జరుగుతున్నదని అన్నారు. 

32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక దేశం ఒక రేషన్ కార్డు విధానం అమలు జరుగుతున్నదని శ్రీ పాండే అన్నారు. సరాసరిన ప్రతి నెల ఈ వ్య్వవస్థ కింద 1.5 నుంచి 1.6 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని, ఇంతవరకు దేశ వ్యాపితంగా 26.3 కోట్ల లావాదేవీలు జరిగాయని అన్నారు.  2019 ఆగస్ట్ నెలలో ఈ పథకం ప్రారంభం అయిందని తెలిపిన శ్రీ పాండే కోవిడ్-19 సమయంలో ఏప్రిల్ 2020-ఏప్రిల్ 2021ల మధ్య 18.3 కోట్ల లావాదేవీలు జరిగాయని అన్నారు. జాతీయ ఆహార భద్రతా కల్పించిన హక్కులు ఈ పథకం ద్వారా వలస కార్మికులకు అందుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చర్యలతీసుకుంటుందని అన్నారు. పథకంపై అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ 14445 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవడంతో పాటు 'మేరా రేషన్' యాప్ ను ప్రారంభించామని అన్నారు. ఎన్‌ఐసి సహకారంతో ఇటీవల అభివృద్ధి చేసిన 'మేరా రేషన్' యాప్ తొమ్మిది వేర్వేరు భాషలలో.  ఇంగ్లీష్, హిందీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, గుజరాతీ లలో ఉందని అన్నారు. త్వరలో మరికొన్ని ప్రాంతీయ భాషల్లో దీనిని అభివృద్ధి చేస్తామన్నారు. 

2021-22 రబీ మార్కెటింగ్ సీజన్ లో పంటల సేకరణ సజావుగా సాగుతున్నదని తెలిపిన శ్రీ పాండే 2021 మే తొమ్మిదవ తేదీ నాటికి 337.95 ఎల్‌ఎమ్‌టి గోధుమలు సేకరించినట్లు తెలిపారు. గత సంవత్సరంలో ఇదే సమయానికి 248.021 ఎల్‌ఎమ్‌టి గోధుమలను సేకరించారు. గత ఏడాది ఇదే సమయానికి 28.15 లక్షల మంది ప్రయోజనం పొందగా ఈ ఏడాది 34.07 లక్షల మంది ప్రయోజనం పొందారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 19,030 కొనుగోలు కేంద్రాల ద్వారా పంటల సేకరణ జరుగుతున్నదని తెలిపారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు కూడా కనీస మద్దతు ధర మొత్తాన్ని పరోక్ష విధానములో కాకుండా ప్రత్యక్ష పద్దతిలో చెల్లించడం ప్రారంభించాయని, దీనివల్ల జాప్యం లేకుండా రైతులు తమకు రావలసిన మొత్తాలను పొందుతున్నారని, ఇవి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయని అన్నారు. 

గోధుమ సేకరణ ద్వారా  ఇప్పటివరకు మొత్తం 49,965 కోట్ల రూపాయల మొత్తం డిబిటి చెల్లింపులో నేరుగా భారతదేశం అంతటా రైతుల ఖాతాలోకి బదిలీ చేయబడిందని, ఇందులో పంజాబ్‌లో రూ .21,588 కోట్లు, హర్యానాలో సుమారు రూ .11,784 కోట్లు నేరుగా బదిలీ చేసినట్లు కార్యదర్శి తెలిపారు.  

కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  గోధుమ మరియు బియ్యం నిల్వలను బహిరంగ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి బహిరంగ మార్కెట్ లో అమ్మకాల విధానాన్ని సరళీకృతం చేసిందని శ్రీ పాండే చెప్పారు.  కొనుగోలు చేయని రాష్ట్రాల్లో ఈ విధానం కింద ఆహార ధాన్యాల అమ్మకాలు ప్రారంభం అయ్యాయని,ఇప్పటివరకు 2800 ఎంటీ  అమ్మకాలు జరిగాయని తెలిపారు. 

కోవిడ్ -19 సమయంలో 928.77 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు, 363.89 ఎల్‌ఎమ్‌టి గోధుమలు మరియు 564.88 ఎల్‌ఎమ్‌టి బియ్యం 1.4.2020 నుంచి 31.3.2021 వరకు సెంట్రల్ పూల్ నుండి పంపిణీ చేసినట్లు తెలిపారు. 

వంట నూనెల ధరల పెరుగుదల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నూనెల ధరను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని శ్రీ పాండే అన్నారు.  కోవిడ్  కారణంగా వివిధ ఏజెన్సీల క్లియరెన్స్ సంబంధిత అంశాల వల్ల  కొన్నినిల్వలు పోర్టులలో ఇరుక్కుపోయాయని ఇప్పుడు సమస్యను పరిష్కరించిందని అన్న శ్రీ పాండే  త్వరలోనే నిల్వలు మార్కెట్లో విడుదల అవుతాయని ఇది చమురు ధరలపై  ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.

చక్కెర రాయితీపై  మరో ప్రశ్నకు సమాధానమిస్తూచ క్కెర మరియు ఇథనాల్ పరిశ్రమతో సవివరమైన సమీక్ష జరుగుతోందని శ్రీ పాండే తెలియజేశారు.   ఈ సంవత్సరం 7.2% బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించామని ఇది  ఈ సంవత్సరం చివరి నాటికి మేము 8.5% కి చేరుతుందని అన్నారు.  దేశంలోని 11 రాష్ట్రాలు ఇప్పటికే 9-10% మిశ్రమాన్ని సాధించాయని, మిగిలిన రాష్ట్రాలు బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు.

***



(Release ID: 1717554) Visitor Counter : 116