ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ ఉపశమన సహాయం - తాజా సమాచారం

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశానికి ప్రతిస్పందనగా అంతర్జాతీయ సహాయం, మద్దతు - రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేగవంతమైన, సమర్థవంతమైన కేటాయింపు

ఇప్పటివరకు 6,738 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు; 3,856 ఆక్సిజన్ సిలిండర్లు, 16 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 4,668 వెంటిలేటర్లు / బి-పి.ఎ.పి లతో పాటు 3 లక్షల రెమెడిసివిర్ ఇంజెక్షన్లను రవాణా / పంపిణీ చేయడం జరిగింది.

Posted On: 09 MAY 2021 4:59PM by PIB Hyderabad

భారతదేశం పట్ల సంఘీభావం మరియు సద్భావన ను ప్రతిబింబిస్తూ, కోవిడ్-19 కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సామూహిక పోరాటంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ సమాజం చేయూత అందిస్తోంది.  భారతదేశం అందుకున్న సహాయక సామాగ్రిని సమర్థవంతంగా, సత్వరమే కేటాయించి, పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించింది.  అత్యాధునిక సంరక్షణ సంస్థలు, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలను భర్తీ చేయడానికి సహాయపడ్డంతో పాటు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగులకు సత్వర, సమర్థవంతమైన వైద్య చికిత్సతో పాటు చికిత్స నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. 

2021 ఏప్రిల్, 20వ తేదీ నుండి, భారత ప్రభుత్వం, వివిధ దేశాలు, సంస్థల నుండి అంతర్జాతీయ విరాళాలతో పాటు, కోవిడ్-19 సహాయ వైద్య సామాగ్రి, పరికరాలను అందుకుంటోంది.

2021 ఏప్రిల్, 27వ తేదీ నుండి 2021 మే, 8వ తేదీ వరకు మొత్తం, 6,738 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు; 3,856 ఆక్సిజన్ సిలిండర్లు, 16 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 4,668 వెంటిలేటర్లు / బి-పి.ఎ.పి. లతో పాటు 3 లక్షల రెమెడిసివిర్ ఇంజెక్షన్లను పంపిణీ చేయడం జరిగింది.

కెనడా, థాయిలాండ్, నెదర్లాండ్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, అమెరికా, జపాన్, మలేషియా, అమెరికా (గిలేడ్), అమెరికా (సేల్స్-ఫోర్స్ ), థాయ్‌లాండ్‌ లోని భారతీయ సమాజం నుండి 2021 మే, 8వ తేదీన అందుకున్న ప్రధాన వస్తువులు:

*      ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్లు (2,404);

*      రెంమ్డేసివిర్ (25,000); 

*      వెంటిలేటర్లు (218);

*     పరీక్షా పరికరాలు (6,92,208)

సమర్థవంతమైన తక్షణ కేటాయింపు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థలకు క్రమబద్ధీకరణ పంపిణీ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఈ ప్రక్రియను,  క్రమం తప్పకుండా, సమగ్రంగా పర్యవేక్షిస్తోంది.

కేసులు భారీగా పెరగడాన్ని అరికట్టడం కోసం పోరాడటానికి వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య పరికరాల రూపంలో విదేశీ సహాయం పంపినందుకు న్యూఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్, ప్రొఫెసర్ రణదీప్ గులేరియా ధన్యవాదాలు తెలియజేశారు. మహమ్మారిపై పోరాటంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.

[దూరదర్శన్ వార్తలు - ట్విట్టర్ లింక్ :

 https://twitter.com/DDNewslive/status/1391323595930886147?s=08]

రాయబరేలీ లోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ రాజ్‌ వంశీ మాట్లాడుతూ,  రాబరేలి లోని ఎయిమ్స్ రోగుల సహాయం కోసం విదేశాల నుండి అందుకున్న కోవిడ్ -19 పరికరాల గురించి వివరించారు. 

[దూరదర్శన్ వార్తలు - ట్విట్టర్ లింక్ :   

https://twitter.com/DDNewslive/status/1391328402490105858?s=08]

ఫోటో -1: మహారాష్ట్ర లో ఆరోగ్య సౌకర్యాల వినియోగం కోసం డెన్మార్క్ నుండి వచ్చిన 53 వెంటిలేటర్లు - ఈ రోజు న్యూఢిల్లీ నుండి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న దృశ్యం. 

బీబీనగర్ ఎయిమ్స్, మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ ఎస్ కళ్యాణి, మాట్లాడుతూ,  తమ ఆసుపత్రికి తక్షణ విదేశీ సహాయం అందించినందుకు, భారత ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ, ధన్యవాదాలు తెలియజేశారు. తమ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు, బి-పి.ఏ.పి. యంత్రాలతో పాటు, ఇతర కోవిడ్-19 పరికరాలు కూడా అందినట్లు ఆమె చెప్పారు.  ప్రజలు భయపడవద్దని, కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని, ఆమె విజ్ఞప్తి చేశారు. 

[దూరదర్శన్ వార్తలు - ట్విట్టర్ లింక్ :   

https://twitter.com/DDNewslive/status/1391337442058268674?s=08]

భోపాల్ లోని ఎయిమ్స్, డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ శర్మన్ సింగ్, మాట్లాడుతూ, సహాయం అందించిన విదేశీ ఏజెన్సీలకు ధన్యవాదాలు తెలియజేశారు.   భోపాల్ లోని ఎయిమ్స్ , ఇప్పటివరకు, 80 బి-పి.ఎ.పి. వెంటిలేటర్లు; 80 ట్రాలీలు; 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు; ఒక లక్ష మాస్కులతో పాటు, 5,000 సర్జికల్ గౌన్లను భారత ప్రభుత్వం కేటాయించిన విదేశీ సహాయం నుండి స్వీకరించింది. 

[ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. ట్విట్టర్ లింక్ :   

https://twitter.com/MoHFW_INDIA/status/1391055535038861321?s=08 ]

మహమ్మారికి వ్యతిరేకంగా ఆసుపత్రి చేసే పోరాటానికి, విదేశాల నుండి అందుతున్న సహాయం ఎలా సహాయపడుతుందో, పాట్నాలోని ఎయిమ్స్ కు చెందిన ప్రొఫెసర్ సి.ఎం. సింగ్, వివరించారు. 

[ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. ట్విట్టర్ లింక్ :    

https://twitter.com/MoHFW_INDIA/status/1391061196669784064?s=08 ]

తమ ఆసుపత్రికి 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 64  పెద్ద పెద్ద ఆక్సిజన్ సిలిండర్లు వచ్చాయనీ, వాటిని, వెంటనే, రోగుల చికిత్స కోసం ఉపయోగించడం ప్రారంభించామనీ, రాయపూర్ లోని  ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ నితిన్ నాగార్కర్ చెప్పారు.

 

[ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. ట్విట్టర్ లింక్ :   

https://twitter.com/MoHFW_INDIA/status/1391059277951893505?s=08 ]

విదేశాల నుండి కోవిడ్-19 సహాయం కోసం గ్రాంట్స్, సహాయ సామగ్రి, విరాళాల రూపంలో అందుతున్న సహాయాన్ని స్వీకరించి, కేటాయింపులను సమన్వయం చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కేంద్రం 2021 ఏప్రిల్, 26వ తేదీ నుండి పనిచేయడం ప్రారంభించింది.  ఇందు కోసం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించి, 2021 మే, 2వ తేదీ నుండి అమలు చేస్తోంది.

*****



(Release ID: 1717331) Visitor Counter : 140