రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మాజీ ఏఎంసీ/ ఎస్ఎస్‌సీ మెడికల్ ఆఫీసర్ల నియమ‌కానికి డీజీ ఏఎఫ్ఎంఎస్ అనుమతి

Posted On: 09 MAY 2021 11:53AM by PIB Hyderabad

మాజీ ఆర్మీ మెడికల్ కార్ప్స్ (ఏఎంసీ) / షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) వైద్య అధికారుల నియామకానికి వీలు క‌ల్పిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌కు (డీజీ ఏఎఫ్‌ఎంఎస్) రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నుంచి 2021 మధ్య స‌ర్వీసులు బ‌య‌ట‌కు వ‌చ్చిన 400 మంది మాజీ ఏఎంసీ / ఎస్‌ఎస్‌సీ వైద్య అధికారులను ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ పథకం గరిష్టంగా 11నెలల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకోవాలని భావిస్తున్నారు. 2021 మే 08 నాటి ఉత్తర్వు ప్రకారం పదవీ విరమణ సమయంలో డ్రా చేసిన జీతం నుండి ప్రాథమిక పెన్షన్‌ను తీసివేయ‌గా వ‌చ్చే స్థిర నెలవారీ  మొత్తాన్ని చెల్లించి స‌ర్వీసుల‌ను పొందేందుకు అనుమతిస్తుంది. ఎక్క‌డెక్క‌డైతే వీలుంటుందో అక్క‌డ స్పెష‌లిస్టు పే చెల్లించేందుకు కూడా ఈ ఉత్తుర్వులు వీలు క‌ల్పిస్తుంది. ఒప్పందం కాలానికి ఈ మొత్తం మారదు మరియు ఇతర భత్యాలు చెల్లించబడవు. నియమించాల్సిన వైద్య అధికారులు పౌర ప్రమాణాల ప్రకారం వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితి అధిగమించడానికి పౌరపరిపాలనకు సహాయపడటానికి అదనపు మానవశక్తిని సమీకరించడానికి గాని రక్షణ మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ తాజా చర్య కూడా ఇందులో భాగంగా చేప‌ట్టిన‌వే. ఏఎఫ్ఎంఎస్ ఇప్పటికే వివిధ ఆసుపత్రులలో నిపుణులు, సూపర్ స్పెషలిస్టులు మరియు పారామెడిక్స్‌తో సహా అదనపు వైద్యులను నియమించింది. షార్ట్ సర్వీస్ కమిషనుడ్‌ ఏఎఫ్ఎంఎస్‌
వైద్యులు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగింపును మంజూరు చేశారు. తాజా చ‌ర్య‌తో అద‌నంగా 238 మంది వైద్యులను అందుబాటులోకి తెస్తుంది. ఆరోగ్య నిపుణుల శ్రమశక్తిని మరింతగా పెంచడానికి ఇటీవల ఏఎఫ్ఎంఎస్‌ నుండి రిటైర్ అయిన వైద్య నిపుణులను కూడా తిరిగి నియమించారు. అంతే కాకుండా, దేశంలోని పౌరులందరికీ ఈ-సంజీవని ఓపీడీపై ఆన్‌లైన్ ఉచిత వైద్య సంప్రదింపుల‌ను అందించడానికి మాజీ రక్షణ వైద్యులను నియమించారు.
ఈ సేవను https://esanjeevaniopd.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్‌) పాలీ క్లీనిక్‌ల‌కు అద‌న‌పు తాకిడి నేప‌థ్యంలో.. రాత్రిపూట విధుల నిర్వ‌హ‌ణ కోసం అద‌నంగా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 3 నెలల కాలానికి 51 మంది సిబ్బందిని నియమించారు. వెట‌ర‌న్ మ‌రియు వారిపై ఆధార‌ప‌డిన వారి సేవ‌ల కోసం వీరిని నియ‌మించారు.

***



(Release ID: 1717322) Visitor Counter : 248