పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఆశల రవాణా: కోల్‌కతా విమానాశ్రయం నుండి వైద్య సరుకుల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది
Posted On:
09 MAY 2021 5:45PM by PIB Hyderabad
కరోనా వైరస్కు వ్యతిరేకంగా దేశం పోరాటం చేస్తోంది. ఈ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిమీటర్ మరియు ఇతర నిత్యావసరాల సరఫరా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పోరాటంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు వివిధ విమానాశ్రయాలు మరియు విమానయాన సంస్థలు మరియు వారి కరోనా యోధులు వివిధ నగరాలు / రాష్ట్రాల నుండి వచ్చే లేదా బయటికి వచ్చే అన్ని వైద్య అవసరాల యొక్క నిరంతరాయ సరఫరాను కొనసాగించడం ద్వారా తమ పాత్రను పోషిస్తున్నారు. కోవిడ్ -19 తో జరుతుతున్న ఈ పోరాటంలో కోల్కతా విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తోంది. కోల్కతా విమానాశ్రయం నుండి వ్యాక్సిన్లు మరియు ఇతర వైద్య అవసరాల కదలికల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
26.04.2021
* కోవిడ్ వ్యాక్సిన్ (కోవిషీల్డ్)కు సంబంధించి 50 బాక్స్లు పూణే నుండి స్వీకరించబడ్డాయి
* 38 బాక్స్‌ల కోవిడ్ వ్యాక్సిన్ (కోవిషీల్డ్) ను ఈశాన్య భారతదేశం మరియు పోర్ట్ బ్లెయిర్లోని వేర్వేరు ప్రదేశాలకు పంపించారు
28.04.2021
* 05 బాక్స్‌ల కొవిడ్ 19 వ్యాక్సిన్లు సిక్కింకు పంపారు.
* పూణే విమానాశ్రయం నుండి కోల్కతా విమానాశ్రయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ 85 బాక్స్లు అందుకున్నాయి. దీనిని ఆరోగ్య శాఖకు అప్పగించారు.
* 169 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు దోహ నుండి ఖతార్ విమానం క్యూఆర్ 8094 లో కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది.
30.04.2021
* 260 కిలోల బరువున్న 09 కోవిషీల్డ్ వాక్సిన్ బాక్సులను ఏఐ 715 విమానంలో ఐజాల్కు పంపించారు.
* 1290 కిలోల బరువున్న 50 పెట్టెల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు స్పైస్ జెట్ ఎస్జి7634 విమానంలో కోల్కతా విమానాశ్రయానికి వచ్చాయి.
01.05.2021
* 1 మే 2021 న, 47 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇండిగో విమానం ద్వారా భారతదేశంలోని వివిధప్రాంతాలకు పంపించారు.
02.05.2021
* వోల్గా డిఎన్ఇపిఆర్ ఎఎన్124 విమానంలో కోల్కతా విమానాశ్రయానికి ఒక్కొక్కటి 8.2 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 12 ఆక్సిజన్ కంటైనర్లు వచ్చాయి. ఈ ఖాళీ కంటైనర్లు పరీక్ష, ప్రాసెసింగ్ & ద్రవ వైద్య ఆక్సిజన్ సరఫరా కోసం ఉపయోగించబడతాయి.
* 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండిగో ద్వారా భారతదేశం అంతటా వివిధ ప్రాంతాలకు పంపించారు.
03.05.2021
* 416 కిలోల బరువున్న 13 బాక్సుల కోవిడ్ వ్యాక్సిన్ను ఎయిర్ ఇండియా విమానంలో అగర్తలాకు పంపించారు.
* 9502 కిలోల బరువున్న 430 పెట్టెల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండిగో 6 ఇ 7302 విమానంలో కోల్కతా విమానాశ్రయానికి వచ్చాయి.
04.05.2021
* 07 పెట్టెల కొవిడ్19 వ్యాక్సిన్లు ఎయిర్ ఇండియా విమానంలోగువహతి, ఇంఫాల్ మరియు ఐజాల్కు తరలించారు.
* కోల్కతా విమానాశ్రయానికి హాంకాంగ్ నుండి స్పైస్జెట్ ఎస్జి7009 విమానంలో 50 ప్యాకేజీల ఆక్సిమీటర్, 252 ప్యాకేజీల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి
05.05.2021
* కోల్కతా విమానాశ్రయానికి హైదరాబాద్ నుంచి 564 కిలోల బరువున్న 21 పెట్టెల్లో కోవాగ్సిన్ టీకాలు వచ్చాయి.
* పూణే విమానాశ్రయం నుండి 1376 కిలోల బరువున్న 43 పెట్టెల కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఆరోగ్య శాఖకు అందజేశారు.
06.05.2021
2,654 కిలోల బరువున్న 124 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను కోల్కతా విమానాశ్రయం ద్వారా భారతదేశంలోని వివిధ నగరాలకు పంపించారు
కోల్కతా ఎయిర్పోర్ట్కు 8924 కిలోల బరువున్న 430 ప్యాకేజీలు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు వచ్చాయి
07.05.2021
* ఐఎఎఫ్ విమానం కోల్కతా ఎయిర్పోర్ట్కు 75 ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసింది
* 380 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఎమిరేట్స్ మరియు స్పైస్ జెట్ విమానంలో కోల్కతాకు చేరుకున్నాయి
* ఢిల్లీ నుండి ఐఎఎఫ్ సి130జె లో కోల్కతా విమానాశ్రయానికి 2442 కిలోల బరువున్న 324 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఆఫ్లోడ్ అయిన 30 నిమిషాల్లోనే పశ్చిమబెంగాల్ రాష్ట్ర ఆరోగ్య విభాగానికి పంపిణీ చేయబడ్డాయి.
* 544 కిలోల బరువున్న కోవిషీల్డ్ వాక్సిన్కు సంబంధించిన 17 పెట్టెలు ముంబై నుండి కోల్కతా ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి.దానిని రాష్ట్ర ఆరోగ్య శాఖకు అప్పగించారు.
* కోల్కతా విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా ద్వారా 288 కిలోల బరువున్న 9 కోవిషీల్డ్ వాక్సిన్లు గువహతికి తరలించారు
ఈ అన్ని పంపిణీలను కోవిడ్ వారియర్స్ సజావుగా నిర్వహించారు మరియు సరుకులను అతితక్కువ సమయంలో ఫ్రంట్లైన్ హీరోలు అందజేశారు.
2021 మే 7 న ఆక్సిజన్ సిలిండర్లు వచ్చాయి
వోల్గా డిఎన్ఇపిఆర్ ఎఎన్124 విమానంలో కోల్కతా విమానాశ్రయానికి ఒక్కొక్కటి 8.2 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కంటైనర్లు వచ్చాయి.
హైదరాబాద్ నుండి కోవాక్సిన్ వచ్చింది
7 మే 2021 న ముంబై నుండి కోవిషీల్డ్ తరలింపు
6 మే 2021 న 430 ప్యాకేజీల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు వచ్చాయి
*****
(Release ID: 1717321)
Visitor Counter : 250