రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ కేర్ కోచ్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో ఐసోలేషన్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి.
వారమంతటా సమన్వయం ద్వారా రైల్వే ఐసోలేషన్ కోచ్‌లను డిమాండ్ గల ప్రదేశాలకు వేగంగా తరలిస్తున్నారు.
చక్కటి వైద్య సదుపాయాలతో కోవిడ్ తేలికపాటి లక్షణాలు గల కేసులకు క్వారంటైన్ ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ సేవలు అందించడానికి బృందాలు ప్రయత్నిస్తాయి.
దాదాపు 4700 పడకల సామర్థ్యం కలిగిన మొత్తం 298 ఐసోలేషన్ కోచ్‌లు ఇప్పుడు వాడకంలో ఉన్నాయి
Posted On:
08 MAY 2021 4:24PM by PIB Hyderabad
కొవిడ్–19కి వ్యతిరేకంగా నిరంతర పోరాటంలో, రైల్వే అధికారులు బృందాలు సకాలంలో సమన్వయ చర్యల ద్వారా రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలసి వేగంగా పనిచేస్తున్నాయి. కేంద్రీకృత పర్యవేక్షణ, వివరణాత్మక వర్క్ ఫ్లో విధానాల ద్వారా రాష్ట్రాల డిమాండ్కు తగ్గినట్టు రైల్వే ఐసోలేషన్ కోచ్‌లను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించగలిగారు. ప్లాట్‌ఫామ్‌లపై ఉంచిన ఐసోలేషన్ కోచ్‌లను బారికేడ్ చేశారు. తాత్కాలిక టెంట్లను కూడా వేశారు. ఇక్కడ విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది సౌకర్యాల కోసం అన్ని సదుపాయాలనూ ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్ల తొలగింపునకు శాశ్వత సౌకర్యాలు అందుబాటులో లేని చోట, పురుషులు, మహిళా ఆరోగ్య సిబ్బందికి కోచ్లలో ప్రత్యేక తాత్కాలిక యూనిట్లను ఏర్పాటు చేశారు. రోజంతా ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల వద్ద ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరిస్తారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రతి కోచ్‌లో 2 ఆక్సిజన్ సిలిండర్లను, మంటలను ఆర్పే యంత్రాలను కూడా రైల్వే ఏర్పాటు చేసింది. ఇతర సదుపాయాలతోపాటు, ఈ కోచ్‌లలోకి రోగులను పంపించడానికి ప్రత్యేకంగా మెట్లను నిర్మించారు.
ఐసోలేషన్ కోచ్‌లు ఇప్పుడు దేశంలోని 7 రాష్ట్రాల్లోని 17 స్టేషన్లలో ఏర్పాటయ్యాయి.ఇవన్నీ కోవిడ్ కేర్ రోగుల కోసమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, 4700 పడకలకు పైగా పడక సామర్థ్యం కలిగిన 298 బోగీలను కోవిడ్ కేర్ కోసం వివిధ రాష్ట్రాలకు అప్పగించారు. 7 రాష్ట్రాలకు కోచ్ల కేటాయింపు ఇలా ఉంది:
మహారాష్ట్రలో 60 బోగీలను మోహరించారు. నందుర్బార్ వద్ద కొవిడ్ కేర్ సెంటర్లో ఉండేందుకు కోవిడ్ రోగులు పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఐసోలేషన్ ముగిసిన తరువాత తగిన వైద్య ధృవీకరణ ద్వారా డిశ్చార్జ్ అవుతున్నారు. మొత్తంమీద, రాష్ట్ర ఆరోగ్య అధికారులు 93 మంది రోగులను డిశ్చార్జ్ చేయగా, ఇప్పటికే 116 మందికి అడ్మిషన్ ఇచ్చారు. ఇక్కడ 23 మంది రోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. రైల్వే 11 కోవిడ్ కేర్ కోచ్‌లను (ఒక కోచ్‌ను వైద్య సిబ్బంది కోసం, సామాగ్రి కోసం ప్రత్యేకంగా కేటాయించారు) అజ్ని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలో ఉంచి, నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఇక్కడ 9 మంది రోగులు ఉన్నారు. వీరంతా డిశ్చార్జ్ అనంతరం ఐసోలేషన్లో ఉన్నారు. రైల్వే ఇటీవల పాల్ఘర్కు 24 బోగీలను అందించింది. ఇక్కడ ఆరోగ్య కేంద్రం సేవలు మొదలయ్యాయి.
రైల్వే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 42 బోగీలను మోహరించింది. వెస్ట్రన్ రైల్వేకు చెందిన రత్లామ్ డివిజన్ ఇండోర్ సమీపంలోని తిహి స్టేషన్ వద్ద 320 పడకల సామర్థ్యం కలిగిన 22 బోగీలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 21 మంది రోగులు ఇక్కడ చేరగా, 7 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. భోపాల్‌లో 20 బోగీలను మోహరించారు. తాజా డేటా ప్రకారం ఇక్కడ 29 అడ్మిషన్లు జరగ్గా, ఇప్పటికే 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 18 మంది రోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 302 పడకలు అందుబాటులో ఉన్నాయి.
తాజా అప్డేట్ ప్రకారం, అస్సాం రాష్ట్రం నుండి తాజా డిమాండ్ల కారణంగా, రైల్వేశాఖ 21 ఐసోలేషన్ కోచ్లను గువహటికి, 20 ఐసోలేషన్ కోచ్లను సిల్చార్ (ఎన్. ఎఫ్. రైల్వే) సమీపంలోని బదర్పూర్కు తరలించింది. ఈ వారం ప్రారంభంలో, సబర్మతి, చాండ్లోడియా, దిమాపూర్ వద్ద ఐసోలేషన్ కోచ్లను మోహరించారు.
ఢిల్లీలో, 1200 పడకల సామర్థ్యం కలిగిన 75 కోవిడ్ కేర్ కోచ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను రైల్వే మన్నించింది. 50 కోచ్‌లు శాకూర్‌బస్తి వద్ద, 25 కోచ్‌లు ఆనంద్ విహార్ స్టేషన్లలో ఉన్నాయి. ఇక్కడ ఇది వరకే ఐదుగురు చేరి డిశ్చార్జ్ కూడా అయ్యారు. మొత్తం 1200 పడకలు అందుబాటులో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కోచ్‌లను కోరకపోయినా, ఫైజాబాద్, భదోహి, వారణాసి, బరేలీ, నజీబాబాద్‌లో 10 కోచ్‌ల చొప్పున ఉన్న 800 పడకల (50 బోగీలు) ఐసోలేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఐసోలేషన్ యూనిట్లుగా పనిచేయడానికి రైల్వేలు మొత్తం7000 పడకలు గల 4400 కి పైగా కోచ్‌ల సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి.
***
(Release ID: 1717285)
Visitor Counter : 211