ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ సమాజం నుండి స్వీకరించిన కోవిడ్-19 సరఫరాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమర్థవంతంగా కేటాయించి, పంపిణీ కొనసాగిస్తున్న - భారత ప్రభుత్వం


ఇప్పటివరకు 2933 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు; 2429 ఆక్సిజన్ సిలిండర్లు, 13 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 2951 వెంటిలేటర్లు / బి-పి.ఎ.పి / సి-పి.ఎ.పి. తో పాటు 3 లక్షల రెమెడిసివిర్ ఇంజెక్షన్లను ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది.

Posted On: 07 MAY 2021 6:25PM by PIB Hyderabad

ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా సహకార మరియు సమిష్టి పోరాటంలో భాగంగా, భారత ప్రభుత్వం 2021 ఏప్రిల్, 20వ తేదీ నుండి వివిధ దేశాలు / సంస్థల నుండి అంతర్జాతీయ విరాళాలతో పాటు, కోవిడ్-19 సహాయ వైద్య సామాగ్రి, పరికరాలను అందుకుంటోంది.

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో భారత ప్రభుత్వం ముందంజలో కొనసాగుతోంది. 

ఇప్పటివరకు 2933 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు; 2429 ఆక్సిజన్ సిలిండర్లు, 13 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 2951 వెంటిలేటర్లు / బి-పి.ఎ.పి / సి-పి.ఎ.పి. లతో పాటు 3 లక్షల రెమెడిసివిర్ ఇంజెక్షన్లను ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది.

2021 మే, 6వ తేదీన అందుకున్న ప్రధాన వస్తువులు:

1.    న్యూజిలాండ్ 

*  ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు - 6 ప్యాలెట్లు - ఒక్కొక్కటీ 12 యూనిట్లు (72)

2.    యు. కె. 

*    20 ప్యాలెట్లలో 46.6 లీటర్లు నింపిన సిలెండర్లు (375)

3.    జర్మనీ

*     మొబైల్ ఆక్సిజన్ ప్లాంటు - 1  మొదటి ట్రెంచ్ 

4.     నెథర్లాండ్స్ 

*     వెంటిలేటర్లు :  (450)

*      ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు :  (100)

2021 మే, 6వ తేదీ వరకు స్వీకరించిన అన్ని వస్తువులను, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమర్థవంతంగా కేటాయించి, వెంటనే పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. 
 

ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల తో సహా విదేశాల నుండి అందుకున్న కోవిడ్ -19 పరికరాల గురించి, న్యూఢిల్లీ,  సఫ్దర్‌ జంగ్ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్ ఎస్.వి. ఆర్య, ఎం.ఎస్., మాట్లాడుతూ, కోవిడ్ రోగుల చికిత్స కోసం వాటిని వినియోగిస్తున్నామని చెప్పారు.

[దూరదర్శన్ వార్తలు - ట్విట్టర్ లింక్ : https://twitter.com/DDNewslive/status/1390604996077576193?s=08]

న్యూఢిల్లీ,  సఫ్దర్‌ జంగ్ ఆసుపత్రిలో వాడుకలో ఉన్న ఇన్ఫ్యూషన్ పంపు ఫోటో. 

ఆంధ్రప్రదేశ్‌, మంగళగిరి లోని ఎయిమ్స్ వద్ద రెమ్డేసివిర్ అందుకుంటున్న ఫోటో. 

నాగపూర్‌ లోని ఎయిమ్స్‌ కు చెందిన ప్రొఫెసర్ అమోల్ దుబే మాట్లాడుతూ, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించడం ద్వారా సకాలంలో సహాయం చేసినందుకు, అంతర్జాతీయ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దీని ఫలితంగా చాలా మంది పేద రోగులకు అవసరమైన వైద్య సంరక్షణ లభించిందని చెప్పారు

[దూరదర్శన్ వార్తలు - ట్విట్టర్ లింక్ : https://twitter.com/DDNewslive/status/1390605705384693762?s=08]

డి.ఆర్.డి.ఓ. సౌకర్యం వద్ద సిద్ధంగా ఉన్న - జర్మన్ ఆక్సిజన్ జనరల్ ప్లాంట్ ఫోటోలు :

భారతదేశం అందుకున్న సహాయక సామాగ్రిని సమర్థవంతంగా, సత్వరమే కేటాయించి, పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించింది.  వివిధ ఏజెన్సీలతో సమన్వయ లోపం లేకుండా కార్గో క్లియరెన్స్ మరియు డెలివరీలు సులభతరం చేయబడ్డాయి.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఈ ప్రక్రియను,  క్రమం తప్పకుండా, సమగ్రంగా పర్యవేక్షిస్తోంది.  ఇది అత్యాధునిక సంరక్షణ సంస్థలు మరియు 31 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలను భర్తీ చేయడానికి సహాయపడ్డంతో పాటు,   ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగులకు సత్వర, సమర్థవంతమైన వైద్య చికిత్సతో పాటు చికిత్స నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. 

విదేశాల నుండి అందుతున్న సహాయ సామగ్రిని స్వీకరించి, కేటాయింపులను సమన్వయం చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కేంద్రం 2021 ఏప్రిల్, 26వ తేదీ నుండి పనిచేయడం ప్రారంభించింది.  ఇందు కోసం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం రూపొందించి, 2021 మే, 2వ తేదీ నుండి అమలు చేస్తోంది. 

*****



(Release ID: 1716946) Visitor Counter : 196