రక్షణ మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్‌లోని పీఎం కేర్ కొవిడ్ ఆసుపత్రికి (ధన్వంతరి) డబ్ల్యూఎన్‌సీ నుంచి అదనపు నౌకాదళ సిబ్బంది కేటాయింపు
Posted On:
07 MAY 2021 11:42AM by PIB Hyderabad
కొవిడ్‌పై పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు నైపుణ్యమున్న మానవ వనరుల రూపంలో సామర్థ్యాన్ని పెంచే చర్యల్లో భాగంగా, పశ్చిమ నౌకాదళ స్థావరం నుంచి 41 మందిని ఈ నెల 6న అహ్మదాబాద్‌లోని పీఎం కేర్ కొవిడ్ ఆసుపత్రికి (ధన్వంతరి) కేటాయించారు. వైద్యాధికారులు, నర్సింగ్ అధికారులు, పారామెడికల్, సహాయ సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు. గత నెల 29న కేటాయించిన 57 మంది సిబ్బందికి వీరు అదనం. వీరు రెండు నెలలపాటు అక్కడే ఉండి, కొవిడ్ రోగుల నిర్వహణలో సాయం చేస్తారు.


****
(Release ID: 1716722)
Visitor Counter : 124