ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సాయంగా ప్రపంచ దేశాల నుంచి అందుతున్న వస్తువులను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సమర్ధంగా కేటాయిస్తున్న కేంద్రం


ఇంతవరకు 1841 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 1814 ఆక్సిజన్ సిలిండర్లు, 09 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు; 2403 వెంటిలేటర్లు / బి పిఎపి / సి పిఎపి, 2.8 లక్షలకు మించి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల పంపిణీ

Posted On: 06 MAY 2021 7:32PM by PIB Hyderabad

కోవిడ్-19 కట్టడికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు తమ సహాయసహకారాలను అందిస్తున్నాయి. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి నాయకత్వం వహిస్తోంది. 

విదేశాల నుంచి అందుతున్న సహాయ సామాగ్రిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏవిధంగా కేటాయించి సరఫరా చేయాలన్న అంశాన్ని చర్చించడానికి నీతి ఆయోగ్ సీఈఓ శ్రీ అమితాబ్ కాంత్ అధ్యక్షతన ఉన్నత స్థాయీ సమావేశం జరిగింది. దీనిలో  కేంద్ర కార్యదర్శి (ఐ అండ్ బి) శ్రీ అమిత్ ఖరే, కేంద్ర కార్యదర్శి (వ్యయం) డాక్టర్ టి వి సోమనాథన్, అదనపు కార్యదర్శి  (ఎంఇఎ) శ్రీర్ దమ్ము రవి, అదనపు కార్యదర్శి  (హెచ్) శ్రీమతి ఆర్తి అహుజా పాల్గొన్నారు. సహాయ సామాగ్రి గమ్య స్థానం నుంచి బయలుదేరిన వెంటనే ఆ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు అందిస్తున్నారని, దీనిప్రకారం పంపిణీ కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారని ఎంఇఎ అదనపు కార్యదర్శి వివరించారు. సహాయ సామగ్రి దేశానికి చేరిన సమయానికి పంపిణీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి తెలిపారు. 

వివిధ దేశాలు/ సంస్థల నుంచి భారతదేశానికి 2021 యాప్రాల్ 27వ తేదీ నుంచి వైద్య సరఫరాలు, పరికరాలు అందుతున్నాయి. ఇంతవరకు 1841 ఆక్సిజన్ క్యాన్సన్ట్రేటర్లు,  1814 ఆక్సిజన్ సిలిండర్లు;  09 ఆక్సిజన్ ఉత్పత్తి  ప్లాంట్లు;  2403 వెంటిలేటర్లు / బి పిఎపి / సి పిఎపి; 2.8 లక్షలకు మించి  రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు భారతదేశానికి చేరాయి.

2021 మే అయిదవ తేదీన వివిధ దేశాలనుంచి అందిన ప్రధాన వస్తువులు :

1. ఆస్ట్రేలియా

 

 *వెంటిలేటర్ /  బి పిఎపి / సి పిఎపి     (1056)

 

* ఆక్సిజన్ కాన్సంట్రేటర్ (43)

2. అమెరికా 

* ఆర్ డి కే  (40300)

 

 *రెమ్‌డెసివిర్ (~ 1.56 లక్షలు)

 

*పీపీఈ  కిట్లు మరియు అదనపు ఇతర వస్తువులు

3. బహ్రెయిన్

 

* లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్ (02)

2021 మే అయిదవ తేదీ వరకు అందిన అన్ని వస్తువులు, పరికరాలను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించి సరఫరా చేయడం జరిగింది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది.

 

అంతర్జాతీయ సహాయంలో భాగంగా అందిన కోవిడ్ పరికరాలను  ఇప్పటికే ఆసుపత్రిలో నెలకొల్పామని న్యూఢిల్లీ   ఎల్‌హెచ్‌ఎంసి ఆసుపత్రి డాక్టర్ ఎన్ ఎన్ మాథుర్ తెలిపారు. 

 అందుతున్న సహాయక సామాగ్రిని సమర్థవంతంగా కేటాయించి పంపిణీ చేయడం కోసం భారత ప్రభుత్వం ఒక క్రమబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించింది.   గ్రాంట్లు, సహాయం మరియు విరాళాలుగా విదేశాల నుంచి అందుతున్న కోవిడ్-19 సహాయాన్ని  స్వీకరించి  కేటాయించడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ప్రత్యేక సమన్వయ కేంద్రం ఏర్పాటయ్యింది.  ఈ సెల్ 2021 ఏప్రిల్ 26 నుంచి  పనిచేయడం ప్రారంభించింది. 2021 మే 2 నుంచి  ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం రూపొందించి అమలు చేస్తోంది. 

వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ సరకుల రవాణాలో జాప్యం లేకుండా చూడడానికి చర్యలను తీసుకుంటున్నారు. దీనిని ప్రతీరోజూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. 31 రాష్ట్రాలు / యుటిలలో వైద్య సౌకర్యాలను మెరుగుపరచి కోవిడ్ -19 రోగులకు అవసరమైన చికిత్సను అందించడానికి ఈ చర్యలు సహాయపడుతున్నాయి. 

***


(Release ID: 1716657) Visitor Counter : 166