సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కొవిడ్ 19 ప్రజా ఫిర్యాదులపై డిఎఆర్‌పిజీ కార్యదర్శి కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాల ఫిర్యాదు అధికారులతో మరియు రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షించారు.


పౌరుల కేంద్రీకృత సేవలను సమయానుసారంగా కొనసాగించడంతో పాటు మహమ్మారి కాలంలో సమయ పరిమితిని మరియు నాణ్యమైన ఫిర్యాదుల పరిష్కారాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

Posted On: 06 MAY 2021 4:30PM by PIB Hyderabad

ఈ రోజు 84 కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాల గ్రీవెన్స్ అధికారులు మరియు రాష్ట్ర / యుటి ప్రభుత్వాల గ్రీవెన్స్ అధికారులతో జరిగిన రెండు సమీక్ష సమావేశాలకు డిఎఆర్‌పిజీ కార్యదర్శి అధ్యక్షత వహించారు. మహమ్మారి కాలంలో సమయపాలన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఆయన ఎత్తిచూపారు. మహమ్మారికి సంబంధించిన పౌరుల సమస్యలను పర్యవేక్షించడానికి కేటాయించబడ్డ కొవిడ్-19 పోర్టల్ యొక్క కార్యాచరణ, వాటిలో ప్రతి ఫిర్యాదులకు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య కేటాయించడం, ఫిర్యాదులను 11 వర్గాలుగా వర్గీకరించడం, ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని 60 రోజుల నుండి 3 రోజులకు తగ్గించడం, ఆటో ఉత్పత్తి పరిగణించబడిన విశ్లేషణ కోసం ఇమెయిల్ రిమైండర్‌లు మరియు రోజువారీ నివేదిక తయారీపై సమీక్షించారు. మార్చి 30, 2020 నుండి మే 3, 2021 వరకు డిఎఆర్‌పిజీకి చెందిన సిపిజిఆర్ఎఎంఎస్‌ పోర్టల్ 1.92 లక్షల ఫిర్యాదులను స్వీకరించింది. వీటిలో 1.66 లక్షల కేసులు పరిష్కరించబడ్డాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు 1.16 లక్షల పిజి కేసులను పరిష్కరించాయి మరియు రాష్ట్రాలు / యుటిలు 0.50 లక్షల పిజి కేసులను పరిష్కరించాయి. మార్చి 1, 2021 నుండి మే 3, 2021 వరకు సిపిజిఆర్ఎఎంఎస్‌ పోర్టల్‌కు 14137 పిజి కేసులు వచ్చాయి, వీటిలో 9267 కేసులు పరిష్కరించబడ్డాయి.

సిపిజిఆర్ఎమ్ఎస్ సంస్కరణలను వేగంగా అమలు చేయడం, సిపిజిఆర్ఎమ్‌లతో రాష్ట్ర పోర్టల్‌లను ఏకీకృతం చేయడం, సిపిజిఆర్‌ఎమ్‌లతో జిల్లా పోర్టల్‌లను ఏకీకృతం చేయడం, ప్రజల సమస్యలకు మూలకారణాలను విశ్లేషించడం మరియు  సంస్కరణలను తీసుకురావడం, అప్పీలేట్ అథారిటీ వ్యవస్థ యొక్క సమర్థవంతమైన కార్యాచరణలకు సంబంధించిన ముసాయిదాను రూపొందిస్తున్నామని డిఎఆర్‌పిజి కార్యదర్శి చెప్పారు. మహమ్మారి కాలంలో ఫిర్యాదుల పరిష్కారాన్ని అందించడంలో పౌర కేంద్రీకరణపై దృష్టి పెట్టాలని ఆయన గ్రీవెన్స్ అధికారులందరినీ కోరారు.


 

<> <> <> <> <>




(Release ID: 1716603) Visitor Counter : 175