విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గ్లోబ‌ల్ ఇనొవేశ‌న్ పార్ట్‌న‌ర్‌శిప్ అంశం పై భార‌త‌దేశాని కి, యునైటెడ్ కింగ్‌డ‌మ్ కు మ‌ధ్య ఎమ్ఒయు కు ఎక్స్‌-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 05 MAY 2021 12:22PM by PIB Hyderabad

గ్లోబ‌ల్ ఇనొవేశ‌న్ పార్ట్‌న‌ర్‌శిప్ (జిఐపి) అంశం పై భార‌త గ‌ణ‌తంత్ర ప్ర‌భుత్వ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ కు, యునైటెడ్ కింగ్ డ‌మ్ కు చెందిన ఫారిన్‌, కామన్‌ వెల్థ్ ఎండ్ డివెల‌ప్‌మెంట్ ఆఫీస్‌ (ఎఫ్‌సిడిఒ) కు మధ్య ఒక అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎమ్ఒయు) పై  సంత‌కాల ప్రక్రియ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.
 
ఉద్దేశ్యాలు:

ఈ ఎమ్ఒయు ద్వారా  భార‌త‌దేశం, యునైటెడ్ కింగ్‌డ‌మ్ లు  గ్లోబ‌ల్ ఇనొవేశ‌న్ పార్ట్‌న‌ర్‌శిప్ ను ప్రారంభించ‌నున్నాయి.  భార‌త‌దేశాని కి చెందిన నూత‌న ఆవిష్క‌ర్త‌ లు  మూడో ప‌క్షం దేశాల లో వారి నూత‌న ఆవిష్క‌ర‌ణ ల‌ను మరింత గా పెంచుకోవడానికి జిఐపి ఊతాన్ని అందిస్తుంది.  దీని ద్వారా వారు కొత్త బ‌జారు లను వెతకడం లో ఇది సాయపడి, వారు వారి సొంత కాళ్ళ మీద నిల‌బ‌డ‌డానికి దోహ‌దం చేస్తుంది.  ఇది భార‌త‌దేశం లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల కు సంబంధించిన స్థితిగ‌తుల ను ప్రోత్స‌హిస్తుంది కూడాను.  జిఐపి లో భాగం గా రూపుదిద్దుకొనే నూత‌న ఆవిష్క‌ర‌ణ లు సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల (ఎస్‌డిజి) కి సంబంధించిన రంగాల పై శ్ర‌ద్ధ వహించడం ద్వారా స్వీక‌ర్త దేశాలు వాటి ఎస్‌డిజి ల‌ను సిద్ధింప చేసుకోవడం లో సైతం సాయ‌ప‌డ‌తాయి.

సీడ్ ఫండింగు ను, గ్రాంటుల ను, పెట్టుబ‌డుల ను, సాంకేతిక‌ప‌ర‌మైన స‌హాయాన్ని అందించ‌డం ద్వారా ఈ భాగ‌స్వామ్యం భార‌తీయ న‌వ పారిశ్రామికవేత్త‌ లు మ‌రియు నూత‌న ఆవిష్క‌ర్త‌ లు వారు అభివృద్ధిపరచే వినూత్న పరిష్కారాల నిగ్గు దేల్చడానికి, వాటి స్థాయి ని పెంచ‌డానికి, వాటి ని ఎంపిక చేసిన కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల కు తీసుకు పోవ‌డానికి మ‌ద్ధ‌తు ను కూడా అందిస్తుంది.
 
జిఐపి లో భాగం గా ఎంపికైన నూత‌న ఆవిష్కారణ లు స్థిర అభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న ను శీఘ్ర‌ త‌రం చేయ‌గ‌లుగుతాయి.  జ‌నాభా లో అట్ట‌డుగు స్థాయి లో ఉన్న‌టువంటి వారికి మేలు ను చేస్తాయి.  ఈ ర‌కం గా స్వీక‌ర్త దేశాల లో స‌మాన‌త్వాన్ని, అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని వెళ్ళేట‌టువంటి వైఖ‌రిని ఇవి పెంపొందించగలుగుతాయి.
 
జిఐపి దేశాల మ‌ధ్య నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల బ‌ద‌లాయింపున‌కు ఒక అరమరికలకు తావు ఉండనటువంటి, అన్ని వ‌ర్గాల‌ కు అవ‌కాశాలు ల‌భించేట‌టువంటి ఎల‌క్ట్రానిక్ అంగ‌డి (E-BAAZAR)ని కూడా అభివృద్ధి ప‌రుస్తుంది.  అంతేకాదు, ప్ర‌భావ‌వంత‌మైన‌ అంచ‌నా పై ఆధార‌ప‌డే ఫ‌లితాల‌ ను ఆవిష్క‌రించ‌డం పై ఇది దృష్టి ని కేంద్రీకరిస్తుంది.  అందువ‌ల్ల పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని, జ‌వాబుదారుత‌నాన్ని ఇది పెంపొందిస్తుంది.
 

***(Release ID: 1716190) Visitor Counter : 105