శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అస్సాంకు చెందిన 6 మంది యువతులు అభివృద్ధి చేసిన బయోడిగ్రేడబుల్ యోగా చాప, చెరువులను గుర్రపు డెక్క సమస్య నుంచి కాపాడగలదు
Posted On:
04 MAY 2021 1:14PM by PIB Hyderabad
అస్సాంలోని మత్స్యకార సమాజానికి చెందిన ఆరుగురు యువతులు నీటిలో మొలిచే గుర్రపుడెక్క ఆకుల నుంచి జీవవిచ్ఛిన్నశీల (బయోడిగ్రేడబుల్), పచ్చి ఎరువుగా మార్చగల (కంపోస్టబుల్) యోగా చాపను అభివృద్ధి చేశారు.
ఈ యువతులు గువాహతి నగరానికి వాయువ్య దిశలో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామసార్ ప్రాంతంగా గుర్తించబడిన శాశ్వత మంచినీటి చెరువు అయిన దీపోర్ బీల్ శివార్లలో నివసించే బెస్త సమాజానికి చెందిన వారు. ఇది పక్షుల సంరక్షణ కేంద్రం కూడా. ఈ చెరువు దాదాపు 9 గ్రామాలకు చెందిన బెస్తవారి జీవనోపాధికి మూలంగా ఉంది. వీరు గత కొన్ని శతాబ్దాలుగా ఈ బయోమ్ (వృక్షజాల, జంతుజాల ఆవాసం)ను వీరు పంచుకుంటున్నారు. అయితే, గత కొన్నేళ్ళుగా నీటిలో గుర్రపు డెక్క ఆకుల అధికంగా పెరిగి, పోగుపడడంతొ సమస్యాత్మకంగా మారింది.
జీవనోపాధి కోసం చిత్తడి భూమి మీద ప్రత్యక్షంగా ఆధారపడిన కుటుంబాలకు చెందిన ఈ యువతుల ఆవిష్కరణ, ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు, దీపోర్ బీల్ సంరక్షణకు తోడ్పడడమే కాక, స్థానిక జీవనోపాధులను మెరుగుపరచనుంది. మూర్‌హెన్ యోగా మ్యాట్ అని పేరు పెట్టిన ఈ చాపను ప్రత్యేక ఉత్పత్తిగా ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.
నీటి గుర్రపు డెక్క మొక్కల నుంచి సంపదను సృష్టించాలన్న తపనతో సిమంగ్ అంటే కల అనే బృందానికి నాయకత్వం వహిస్తున్న ఈ ఆరుగురు యువతుల కృషిలో మొత్తం మహిళా సమాజాన్ని భాగస్వాములను చేసేందుకు భారత ప్రభుత్వానికి చెందిన శాస్త్ర, సాంకేతిక శాఖ (డిఎస్‌టి) కింద పని చేసే స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ (NECTAR ) చొరవ ద్వారా ఈ ప్రమేయం ప్రేరేపితమైంది.
నీటి గుర్రపు డెక్క లక్షణాలు, చాప వంటి ఉత్పత్తికి గల ప్రయోజనాత్మక అవసరాలను దృష్టిలో పెట్టుకుని 100% బయోడిగ్రేడబుల్, 100% కంపోస్టబుల్ చాపను బహుళ పర్యావరణ, సామాజిక ప్రయోజనాలను అందించేందుకు యోగా చేసే చాపను కల్పించారు. ఫైబర్‌ను శుద్ధి చేయడం, సాంకేతికపరమైన ప్రమేయం నీటి గుర్రపు డెక్క ఆకులను తొలగించి చిత్తడి నేలల జలపర్యావరణ వ్యవస్థను మెరుగుపరచి, మొత్తం సమాజం భాగస్వామ్యంతో వినిమయ వస్తువుల నిలకడైన ఉత్పత్తికి తోడ్పడి, స్థానిక సమాజాలకు జీవనోపాధిని కల్పించి, సంపూర్ణంగా ఆత్మనిర్భరతను సాధించేందుకు తోడ్పడగలదు.
చాపలను నేసే/ అల్లే ముందు గుర్రపు డెక్క ఆకులను సేకరించి, ఎండబెట్టి తయారు చేయడమనేది అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఇందులో సోలార్ డ్రయర్‌ను (సౌరశక్తిని ఉపయోగించి) వినియోగించడం వంటి చిన్నపాటి సాంకేతిక చొరవలు, ఎండే సమయాన్ని కనీసం 3 రోజులు తగ్గించాయి. దేశంలోని ఈ ప్రాంతంలో ఆరునెలల సుదీర్ఘమైన వానాకాలం (మే-అక్టోబర్) ఉండే చోట చేసుకునే భారీ వానల వల్ల కోల్పోయిన సమయాన్ని కూడా ఇది భర్తీ చేయగలదు.
సంప్రదాయ అస్సామీ మగ్గాన్ని ఉపయోగించి భిన్న పద్ధతులు, పదార్ధాలు, సాధనాల విభిన్న కలయికతో అత్యంత నాణ్యమైన, సౌకర్యవంతమైన, పూర్తిగా బయోడిగ్రేడబుల్, కంపోస్ట్ యోగా చాపను మహిళలు గుర్రపు డెక్క ఆకును ఉపయోగించి నేశారు. మూడు శివారు గ్రామాలు (కియోత్‌పాడా, నోతున్ బస్తీ, బొర్బొరీ)కి చెందిన 38 మహిళలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. సాంకేతిక చొరవ ఉత్పత్తి రేటును పెంచగలదు.
చాపకు చెందిన వివిధ నమూనాలను రూపొందించడంలో ఎన్ఇసిటిఎఆర్ బెల్లం, ఇనుము, ఉల్లిపాయ పొరలు, లక్కతో సహజమైన రంగులు అద్దిన పత్తిని ఉపయోగించేందుకు 7 వీవ్స్ (సిమంగ్ కలెక్టివ్ అనుబంధ సంస్థ) బృందం కామరూప్ జిల్లాలోని లోహారఘాట్ అరణ్య ప్రాంతంలో అందుబాటులో ఉండే సహజ పదార్ధాలతో అద్దకం చేసే నైపుణ్యాన్ని అందించింది. చాప నేత నిర్మాణానికి అనుకూలంగా ఉండేలా మగ్గంలోని వివిధ పరికరాలను మార్చారు.
యోగా చాపకు కామ్ సొరాయ్ (దీపోర్ బీల్ జీవసంరక్షణ ప్రాంతంలో స్థానిక పక్షి అయిన ఊదా మూర్హెన్ )పేరు పెట్టారు, ఇది జిప్పు లేదా మెటల్ బటన్ల వంటివి లేని కాటన్ కాన్వాస్ సంచిలో వస్తుంది. దీనికి పూర్తి బయోడిగ్రేడబులిటీకి అనుగుణంగా సరి చేసుకోగల నాడాతో, కప్పుతో సమర్ధవంతంగా రూపొందించారు.
***
(Release ID: 1715975)
Visitor Counter : 257