కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
5జి టెక్నాలజీ , స్పెక్ట్రమ్ ప్రయోగాలకు టెలికం విభాగం అనుమతి
దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 5జి ట్రయల్స్ ప్రారంభించనున్న టెలికం సర్వీసు ప్రొవైడర్లు
5జి ప్రయోగాలు గ్రామీణ , సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాలలో నిర్వహించనున్నారు.
ఈ ప్రయోగాల అనుమతిలో దేశీయ 5 జి టెక్నాలజీ కూడా ఇమిడి ఉంది.
Posted On:
04 MAY 2021 4:38PM by PIB Hyderabad
భారత ప్రభుత్వానికి చెందిన డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డిఒటి), 5జి టెక్నాలజీ వినియోగం , అప్లికేషన్స్‌కు సంబంధించి ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు టెలికం సర్వీసు ప్రొవైడర్లకు అనుమతి ఇచ్చింది. ఇందుకు దరఖాస్తు చేసుకున్న టిఎస్‌పిలలో భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్‌ఫో కామ్ లిమిటెడ్, ఓడాఫోన్ ఐడియా లిమిటెడ్ , ఎంటిఎన్ ఎల్ ఉన్నాయి. ఈ టిఎస్‌పిలు ఒరిజినల్ పరికరాల తయీరీ, సాంకేతికత సరఫరాదారులైన ఎరిక్‌సన్, నోకియా, శాంసంగ్, సి-డాట్‌లతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాయి. దీనికితోడు రిలయన్స్ జియో ఇన్‌ఫోకామ్ లిమిటెడ్, తన స్వంత దేశీయ టెక్నాలజీని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహిస్తుంది.
టిఎస్‌పిలు తమకు తాముగా గుర్తించిన ప్రాధాన్యతలు , వారు ఎంచుకున్న టెక్నాలజీ పార్టనర్‌లకు అనుగుణంగా డిఒటి అనుమతులు మంజూరు చేసింది. ప్రయోగాత్మకంగా స్పెక్ట్రమ్ ను వివిధ బాండ్‌లలో ఇవ్వనున్నారు.
ఇందులో మిడ్ బ్యాండ్ (3.2 జిహెచ్ నుంచి 3.67 జిహెచ్‌జెడ్), మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (24.25 జిహెచ్‌జెడ్ నుంచి 28.5 జిహెచ్‌జెడ్) , సబ్ - గిగాహెర్ట్జ్ (700 జిహెచ్‌జెడ్), టిఎస్‌పి లు తమ స్వంత స్పెక్ట్రమ్ ను ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు వినియోగించవచ్చు. (800 ఎం.హెచ్.జెడ్, 900 ఎం.హెచ్.జెడ్ , 1800 ఎం.హెచ్.జెడ్, 2500 ఎం.హెచ్.జెడ్)
ప్రస్తుతం ఈ ట్రయల్స్ నిర్వహణకు ప్రస్తుతం 6 నెలలు సమయం ఇచ్చారు. ఇందులో పరికరాల సేకరణ, ఏర్పాటుకు రెండు
నెలల సమయం కూడా ఇందులో కలిసి ఉంది.
డిఒటి ఇచ్చిన అనుమతి పత్రాల ప్రకారం ప్రతి టిఎస్పి , గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో, అలాగే అర్బన్ ప్రాంతాలలో నిర్వహించవల్సి ఉంటుంది. 5జి టెక్నాలజీ వ్యాప్తి కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉండేలా చూసేందుకు ఈ అనుమతి ఇచ్చారు.
టిఎస్‌పిలు ఇప్పటికే తెలిసిన 5జి టెక్నాలజీ కి తోడు 5జిఐ టెక్నాలజీ ఉపయోగంపై కూడా ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటియు) , ఇండియా ప్రతిపాదించిన 5జిఐ టెక్నాలజీని ఆమోదించిన విషయం తెలిసిందే. ఇది 5జిటవర్లు, రేడియో నెట్ వర్క్‌కు మరింత ఎక్కువ అందుబాటు కలిగి ఉంటుంది. 5జిఐ టెక్నాలజీని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ (సిఇడబ్ల్యు ఐటి ) , ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్‌లు అభివృద్ధి చేశాయి.
5జి ట్రయల్స్ నిర్వహణ లక్ష్యాలలో భారతీయ నేపథ్యంలో 5 జి స్ప్రెక్ట్రమ్ ప్రచార లక్ష్యాలు , మోడల్ ట్యూనింగ్, ఎంపిక చేసిన పరికరాల పనితీరు, దేశీయ సాంకేతిక పరిజ్ఞానంపై పరీక్షల నిర్వహణ, అప్లికేషన్లపై పరీక్షలు (టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయ పర్యవేక్షణ వంటివి), 5జి ఫోన్లు, ఉపకరణాలపై పరీక్ష ఉన్నాయి.
5జి టెక్నాలజీ డాటా డౌన్‌లోడ్ రేట్లకు సంబంధించి (4జి కన్న పది రెట్లు ఎక్కువ) మెరుగైన వాడక అనుభవం, మూడు రెట్ల ఎక్కువ స్ప్రెక్ట్రమ్ సామర్ద్యం ఉండనున్నాయి. అలాగే ఇండస్ట్రీ 4.0 కు వీలుగా తక్కువ సమయంలొ ఎక్కువ డాటా పంపడం వంటివి ఉండనున్నాయి. దీని వినియోగం వివిధ రంగాలకు అంటే వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు సంబంధించిన బహుళ పక్ష అప్లికేషన్లకు ఉపయోగపడనున్నాయి.
ఈ ట్రయల్స్ టిఎస్‌పిల ప్రస్తుత నెట్ వర్క్‌లతో అనుసంధానం చేయకుండా విడిగా నిర్వహించాలని డిఒటి స్పష్టంచేసింది. ట్రయల్స్ వాణిజ్యేతర ప్రాతిపదికపైన ఉ ండాలి. ట్రయల్స్ సందర్భంగా రూపొందించిన డాటాను ఇండియాలోనే స్టోర్ చేయాలి. ట్రయల్స్‌లో భాగంగా టిఎస్‌పిలు దేశీయంగా అభివృద్ధి చేసిన పరికరాలను,యూజ్ కేస్‌లను ఈ ట్రయల్స్ లో భౄగంగా పరీక్షించి చూడాలి. 5జి అప్లికేషన్లకు సంబంధించి ఇటీవల నిర్వహించిన హాకథాన్ అనంతరం డిఒటి ఎంపిక చేసిన వంద అప్లికేషన్లు, యూస్ కేస్‌లు కూడా ఈ ట్రయల్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
***
(Release ID: 1715971)
Visitor Counter : 365