రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ వ్యతిరేక పోరాటంలో రక్షణమంత్రిత్వశాఖ & సాయుధ దళాల చర్యలను సమీక్షించారు;


అదనంగా ఆరోగ్య నిపుణుల సమీకరణ, ఆక్సిజన్ సరఫరాను సులభతరం చేయడానికి లాజిస్టిక్ మద్దతు మరియు కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు.

Posted On: 01 MAY 2021 5:02PM by PIB Hyderabad

దేశంలో ప్రస్తుత కొవిడ్‌-19 వ్యతిరేక పోరాటంలో పౌర పరిపాలనకు మద్దతు ఇవ్వడానికి రక్షణ మంత్రిత్వశాఖ మరియు సాయుధ దళాల చర్యలను రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ 2021 మే 01 న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్ బిపిన్ రావత్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ అండ్ డి మరియు ఛైర్మన్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) డాక్టర్ జి. సతీష్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆర్డ్మ్‌ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఎఎఫ్‌ఎంఎస్) సర్జన్ వైస్ అడ్మిరల్ రజత్ దత్తా, డిప్యూటీ చీఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిత్కర్ మరియు అదనపు కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ సంజయ్ జాజు మరియు రక్షణమంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పదవీ విరమణ చేసిన వారిని విధి నిర్వహణకు పిలవడం వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా సుమారు 600 మంది అదనపు వైద్యులను సమీకరిస్తున్నట్లు శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు అధికారులు వివరించారు.  భారత నావికాదళం 200 బాటిల్ ఫీల్డ్ నర్సింగ్ అసిస్టెంట్లను వివిధ ఆసుపత్రులలో సహాయం కోసం నియమించింది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హర్యానాలోని వివిధ ప్రదేశాలలో 300 మంది క్యాడెట్లను మరియు సిబ్బందిని నియమించింది. ఇంట్లోనే చికిత్స పొందుతున్న రోగులకు సలహాలు,సూచనలు అందించడానికి వారి అనుమానాలను నివృత్తి చేయడానికి ఆరోగ్య నిపుణులతో టెలి మెడిసిన్ సేవ త్వరలో ప్రారంభమవుతుంది. భారత సైన్యం వివిధ రాష్ట్రాల్లోని పౌరులకు 720 కి పైగా పడకలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్థానిక పరిపాలనతో పంచుకోవాలని రక్షణ మంత్రి సైన్యాన్ని ఆదేశించారు. పౌర పరిపాలనకు సహాయం చేయడంలో స్థానిక మిలిటరీ చురుకుగా పాల్గొనాలని జనరల్ బిపిన్ రావత్ సూచించారు.

లక్నోలో డిఆర్‌డిఓ ఏర్పాటు చేస్తున్న 500 పడకల ఆసుపత్రి రాబోయే 2-3 రోజుల్లో పనిచేయడం ప్రారంభిస్తుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. 5 మే నాటికి పూర్తయ్యే విధంగా వారణాసిలో మరో ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పీఎం కేర్స్ ఫండ్ కింద తయారవుతున్న 380 ఆక్సిజన్ పిఎస్‌ఎ (ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్) ప్లాంట్లలో మొదటి నాలుగు ప్లాంట్లను వచ్చే వారం నాటికి న్యూ ఢిల్లీలోని ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్నట్టు డిఆర్‌డిఓ చైర్మన్ తెలిపారు.

విదేశాల నుండి మరియు దేశంలోని వినియోగం మరియు ఉత్పత్తి స్థలాల మధ్య ఆక్సిజన్ కంటైనర్లను రవాణా చేయడంలో సాయుధ దళాలు అందిస్తున్న లాజిస్టిక్స్ మద్దతును రక్షణ మంత్రి ప్రశంసించారు. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) యొక్క రవాణా విమానాలు సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్ మరియు దేశంలోని అనేక ప్రాంతాలను నిర్వహించగా.. రెండు మధ్యప్రాచ్యానికి మరియు రెండు ఆగ్నేయాసియా దేశాలనుండి భారతదేశానికి ఆక్సిజన్ కంటైనర్లను రవాణా చేయడానికి భారత నావికాదళం నాలుగు ఓడలను పంపించింది. మే 21, 2021 నాటికి, ఐఏఎఫ్‌ విదేశాల నుండి 28 సోర్టీలను నిర్వహించింది, 830 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 47 ఆక్సిజన్ కంటైనర్లను విమానంలో ఎక్కించగా, దేశంలోని 158 సోర్టీలను నిర్వహించింది, 2,271 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 109 కంటైనర్లను ఎయిర్ లిఫ్టింగ్ చేసింది. నేవీ మరియు వైమానిక దళం తమ స్టోర్ల నుండి దాదాపు 500 పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్లను వివిధ పౌర ఆసుపత్రులకు సరఫరా చేశాయి.

డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (డిపిఎస్‌యు) రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రులకు సరఫరా చేయడానికి సిఎస్‌ఆర్ కింద రూ .40 కోట్ల విలువైన 28 ఆక్సిజన్ ప్లాంట్లు మరియు ఇతర వైద్య పరికరాలను కొనుగోలు చేస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) బెంగళూరులో 250 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. లక్నోలో మరో 250 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు.

పౌర పరిపాలనకు సాయుధ దళాలు అవసరమైన సహకారాన్ని అందించాలని శ్రీ రాజనాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అలాగే వివిధ కార్యక్రమాల పురోగతిని నిశితంగా పరిశీలించాలని రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు మూడు సర్వీసులకు చెందిన అధికారులను కోరారు.

***



(Release ID: 1715455) Visitor Counter : 166